కిరణ్ కుమార్ ఏ క్షణాన ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడో కానీ ఆయన చుట్టు అన్నీ సమస్యలే చుట్టు ముడుతున్నాయి. ప్రజా సమస్యలైతే కిందో మీదో పడి పరిష్కరించవచ్చు. మరి ఆయన ముఖ్యమంత్రి మంత్రి పీఠానీకే ఎసరు వస్తుంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్ష పీఠం అధిష్టించినప్పటి నుండి వారిద్దరి మధ్య అంతర్యుద్దం జరుగుతూనే ఉంది. పీసీసీ అధ్యక్షుడు బొత్సను ఎదుర్కోవడానికి సీఎం కిరణ్ పడరాని పాట్లు పడుతున్నాడు. ఏ కొంచెం వీలు చిక్కిన బొత్స దూకుడుకి సీఎం కళ్ళెం వేయాలని, బొత్స ఎప్పుడు సీఎం కిరణ్ సీటుకి ఎసరు పెడదామా అని ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు.
2014 ఎన్నికల వరకు సీఎం కిరణ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు, ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేసే రెండంచెల వ్యూహంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా.. తన సీటుకు ఎసరు పెట్టి, తనను ఢీకొంటున్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారా యణపై కిరణ్ దృష్టి సారించారు. ఆయనకు సొంత ఉత్తరాంధ్ర ప్రాంతం, కాపు సామాజికవర్గం నుంచి ప్రత్యర్థులను తయారుచేసే వ్యూహంలో ఉన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణ తీరు దానినే బల పరుస్తోంది. దానిని ఆయన వేదికగా చేసుకున్నట్లు ఎంపిక తీరు స్పష్టం చేస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ శాఖ మార్పు చేయడం వెనుక దీర్ఘకాలిక వ్యూహమే ఉందంటున్నారు. బొత్సను సమర్థవంతంగా ఎదు ర్కొనే నేతను ఎంపిక చేసుకునే అన్వేషణలో భాగం గా హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనా రాయణకు అత్యంత కీలకమైన వ్యవసాయ శాఖ అప్పగించి నట్లు కనిపిస్తోంది. సాంకేతికంగా బీసీ అయినప్పటికీ కాపులను అడ్డుపెట్టుకుని తనను ఇబ్బందిపెడుతున్న బొత్సను అదే కాపు నేత, కోస్తా కాపులలో ఇమేజ్ ఉన్న కన్నాకు కీలకశాఖ కట్టబెట్టడం ద్వారా బొత్స దూకుడుకు చెక్ పెట్టాలన్నది సీఎం లక్ష్యంగా స్పష్టమవుతోంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులలో పట్టు, పలుకుబడి తో పాటు వివాదరహితుడయిన కన్నాతో బొత్సకు చెక్ పెట్టించి.. కాపులను బొత్స నుంచి వేరు చేయాలన్న లక్ష్యంతో సీఎం అడుగులు వేస్తున్నారు. గతంలో వైఎస్ కన్నాను బాగా ప్రోత్సహించారు. రోశయ్యతో సరిపడకపోయినా ఆయన సైతం కన్నాను కొనసాగించారు. కాంగ్రెస్ వచ్చిన ప్రతిసారీ కన్నాకు ప్రాధాన్యం లభిస్తోంది. ఏ సీఎం వచ్చినా.. తన పనితీరు, అంకితభావంతో అందరినీ మెప్పించే కన్నా 13 సార్లు మంత్రి పదవులు నిర్వహించడం ప్రస్తావనార్హం. ఇప్పుడు కిరణ్ కూడా కన్నాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తాజాగా ఇచ్చిన ప్రమోషన్ స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న శాసనసభలో ఒక్కసారి కూడా ఓడిపోని వారిలో కన్నా, జెసి దివాకర్‌రెడ్డి ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు కన్నాను పూర్తి స్థాయిలో బొత్సపై ప్రయోగించాలని సీఎం నిర్ణయించన్నట్లు తెలుస్తుంది. ఆయనకు కీలకశాఖ కట్టబెట్టడం ద్వారా కోస్తా కాపులను ప్రసన్నం చేసుకునే వ్యూహానికి సీఎం తెరలేపారు. దీనిద్వారా అసలు కాపులకు తాను ప్రాధాన్యం ఇస్తున్నానని, కొసరు కాపు కార్డుతో హడావిడి చేస్తున్న బొత్సకు చెక్ పెట్టడంతో పాటు, చిరంజీవి ద్వారా కాకుండా, కన్నా లక్ష్మీనారాయణ ద్వారానే కాపులను కాంగ్రెస్ వైపు ఆకర్షితులను చేయాలన్నది మరో లక్ష్యంగా కనిపిస్తోంది. కాపులలో పాటు, పట్టణ వర్గాల్లో బలంగా ఉన్న రెడ్డి, బ్రాహ్మణ, బీసీల్లోనూ మాస్ ఇమేజ్ ఉన్న కన్నాను.. కాపు-బీసీ కార్డు ప్రయోగిస్తు తనను ఇబ్బంది పెడుతోన్న బొత్సపై అస్త్రంగా సంధించేందుకు కిరణ్ సిద్ధమవుతున్నారు. అందుకే మంత్రివర్గంలో చాలామంది ఉన్నా కేవలం కన్నా లక్ష్మీనారాయణను మాత్రమే ఎంచుకుని ఆయనకు కీలకమైన వ్యవసాయశాఖను కట్టబెట్టారు. ఈ వ్యూహంతో బొత్స ఇక సొంత జిల్లా, ఉత్తరాంధ్రలో ఎదురీదక తప్పదంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more