వివిధ ప్రాంతలలో జరగబోయే ఉప ఎన్నికలను ముందుగానే ఆంద్రవిశేష్ సర్వే చేస్తుంది. మొదటిగా ప్రకాశం జిల్లా హెడ్ క్వాటర్ అయిన ఒంగోలు లో సర్వే చేసింది. అసెంబ్లీ ఉప ఎన్నికల జరిగే వాటిలో ఒంగోలు ఒకటి
పేరుకే ప్రకాశం జిల్లా అయిన .. పెత్తనమంత .. ఒంగోలు మండలం నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఏం జరిగిన దాని చూట్టు ఒంగోలు ప్రభావం చాలా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్య మైన అసెంబ్లీ నియోజక వర్గం ఒంగోలు. అయితే ఒంగోలు నియోజక వర్గం నుండి బాలినేని శ్రీనివాసు రెడ్డి అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక వ్యక్తి. బాలినేని శ్రీనివాస రెడ్డి (వాసు) . ఇతను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
ఒంగోలు నియోజక వర్గంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన తండ్రి వెంకటేశ్వర రెడ్డి రాజకీయలకు దూరంగా ఉండేవాడట. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన చదువుకొనే రోజుల నుండి రాజకీయాలపై మక్కువ పెంచుకొని.. విద్యార్థి దశలోనే జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అప్పటి రాజకీయ అనుభవంతో ఒంగోలు ప్రజలకు వాసు గా పరిచయం అయ్యాడు.
ఒంగోలు నియోజక వర్గంలో ఎక్కువ శాతం రెడ్డి వర్గానికి చెందినవారు ఉన్నారు. బాలినేని వాసు దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డికి దగ్గర బంధువు. 2009 సంవత్సంలో ఒంగోలు నియోజక వర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసిన వారు- కాంగ్రెస్ పార్టీ నుండి బాలినేని వాసు, టిడిపి నుండి ఈదర హరిబాబు, పిఆర్పీ నుండి పర్వతరెడ్డి ఆనంద్ లపై వాసు 67, 214 ఒట్ల మోజారిటితో గెలుపొందాడు. వాసు తన హవాను వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపోంది. తన సత్తాను చాటుకున్నాడు. అయితే ఈసారి తన ఎమ్మేల్యే పదవి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. వాసుకు బంధువు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. కొత్త పార్టీ పెట్టడం, వాసు జగన్ కు మద్దతుగా తన ఎమ్మేల్యే పదవిని త్యాగం చేయటం (రాజీనామా) జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా పెట్టిన పార్టీ, వైఎస్ ఆర్ పార్టీ. వాసు రాజీనామాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించటంతో .. ఇప్పడు ఒంగోలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.
అందులో భాగంగా .. ఆంధ్రవిశేష్ ఒంగోలలో సర్వే చేసింది. ఇప్పడు ఉప ఎన్నికల బరిలోకి ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి. 1 కాంగ్రెస్, 2 టిడిపి, 3. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒంగోలు నియోజక వర్గంలో 52శాతం మంది జగన్ పార్టీ తరపున నిలబడిన బాలినేని వాసు పై మొగ్గు చూపుతున్నారు. తరువాత టిడిపి 24 శాతం తగ్గించుకుంది. కేవలం 16శాతంతో కాంగ్రెస్ నిలబడింది. ఒంగోలు నియోజక వర్గంలో .. కమ్మ, రెడ్డి, కాపు, యాదవులు, వైశ్యాస్ , మాల, మాదిగ జనాభ కలిగి ఉన్నారు. వీరి లో మొదటి నుండి కమ్మ వర్గం, వైశ్యాస్ వర్గం వారు తెలుగు దేశం వైపు ఉండేవారు. ఇక రెడ్డి, కాపు, యాదవులు, ఎస్సీలు . కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేవారు. బాలినేని కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించటానికి కారణం వీళ్లే. అయితే .. బాలినేని అంటే ఒంగోలు నియోజక వర్గం ప్రజలకు కాస్త భయం కూడా ఉందని అంటున్నారు. ఆ భయంతోనే కొంతమంది బాలినేని ఒట్లు వేస్తారనే రూమర్లు కూడా ఉన్నాయి.
ఇప్పడు జరగబోయే ఉప ఎన్నికలు . వైఎస్ ఆర్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి. ఈ సారి బరిలోకి వైఎస్ ఆర్ పార్టీ నుండి .. బాలినేని శ్రీనివాసు రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి మాగుంట పార్వత్మ, లేదా పర్వత రెడ్డి ఆనంద్ (గతంలో పిఆర్పీ నుండి పోటీ చేసిన వ్యక్తి) తెలుగు దేశం పార్టీ నుండి దామచర్ల అంజనేయులు కొడుకు బరిలోకి దిగనున్నారు.
అయితే ప్రజలు మాత్రం రెడ్డి వర్గం, ఎస్సీలు .. బాలినేనికి ఒట్లు వేయానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే .. నియోజక వర్గంలో ఉన్న రెడ్డి వర్గం మొత్తం బాలినేని వైపు చూస్తుంది. అలాగే.. మాల, మాదిగలు .. వైఎస్ జగన్ తన మతస్తుడని భావించి.. ఆపార్టీ కి ఒట్లు వేయటం ఖాయమని తెలుస్తుంది. ఇక వైశ్యాస్ వీరి మొన్నటి వరకు తెలుగు దేశం పార్టీలో ఉన్నావారు కావటంతో వీరు ఇప్పడు గనుల శాఖ మంత్రి అయిన బాలినేని వాసు తో అనేక సంబంధాలు ఉండటంతో వీరు కూడా జగన్ పార్టీ కి ఓటు వేయక తప్పదు.
ఇక మిగిలింది.. కమ్మ, కాపు, యాదవులు, ఈ మూడు వర్గాలలో తెలుగు దేశం పార్టీ , కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఉన్నాయి. కాపులు యాదవులు , కలిసి కాంగ్రెస్ కు మొగ్గు చూపిన, ఇక తెలుగుదేశం పార్టీ కి ఒక కమ్మ వర్గం వారు మాత్రం మిగులుతారు. ఈ ఉప ఎన్నికల వలన పూర్తి నష్టపోయేది .. తెలుగు దేశం పార్టీ అని సర్వేలో తేలింది. కమ్మ వర్గంలో కొంత మంది బాబు ప్రవర్తన నచ్చక, వారి ఒట్లు కాంగ్రెస్ పడే అవకాశం ఉంది. కాపులు మాత్రం చిరంజీవి మీద కాస్త అసహనంగా ఉన్నారు. వారు మొదటి నుండి తెలుగు దేశంలో ఉన్నప్పటికి 2009 లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టి కాపులకు గుర్తింపు తెచ్చిన విషయం తెలిసిందే. అయితే వారు .. అంటు కాంగ్రెస్ లోకి వెళ్లాలా, లేక తెలుగు దేశం లోకి వెళ్లాలా, తెలియాక అయోమయంలో ఉన్నారు.
మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి వర్గం, మాల, మాదిగలను కలుపుకొని 58శాతం ఓట్లు పడే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఒంగోలు నియోజక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 58 శాతం , తెలుగుదేశం పార్టీ కి 20 శాతం, కాంగ్రెస్ పార్టీకి 16 శాతం మాత్రమే దక్కుతాయని సర్వేలో తేలింది.
ఆంధ్రవిశేష్. కామ్ గతంలో కూడా కడప నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితను ముందుగానే చెప్పటం జరిగింది. ఆంద్రవిశేష్ చెప్పిన విధంగానే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాదించింది. ఇప్పడు కూడా ఒంగోలు నియోజక వర్గంలో ఆంద్రవిశేష్ సర్వే ఫలితాలను ముందుగా చెప్పటం జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more