సిఎంకు సీనియర్ ఐఏఎస్ అధికారికి పోరు జరుగుతుంది. సీఎం మాటను వ్యతిరేకిస్తున్న ఐఏఎస్ అధికారిగా మిగిలిపోయాడు. సీఎం ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సీనియర్ ఐఏఎస్ అధికారి, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భలేరావు షాక్ ఇచ్చారు. పశుసంవర్థక శాఖకు చెందిన అధికారి ఒకరిని అటవీశాఖలో విలీనం చేయాలని సీఎం సిఫారసు చేయగా.. అలా చేయడం కుదరదంటూ భలేరావు నిర్ద్వందంగా తోసిపుచ్చారు.
సీఎం నిర్ణయాన్ని అమలు చేయడం కుదరదంటూ ఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంబంధిత ఫైలును తిప్పి పంపడం అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. సీబీఐ విచారణల పేరిట తమను వేధిస్తూ, జైళ్లలో పెడుతూ.. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ ఐఏఎస్ అధికారులు మండిపడుతున్న విషయం విదితమే. తాము వర్క్ టూ రూల్ పనిచేస్తామని ఐఏఎస్ అధికారులు అంటుండగా.. సీఎం సిఫారసునే తోసిపుచ్చిన వైనం సంచలనం సృష్టిస్తోంది. పశుసంవర్థక శాఖకు చెందిన హకీం అనే అధికారి డెప్యుటేషన్‌పై అటవీశాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చేస్తుండగా.. ఆయన అయిదేళ్ల డెప్యుటేషన్ గడువు ముగిసిపోయింది. నిబంధనల ప్రకారం అంతకుమించి డెప్యుటేషన్‌కు అనుమతించరాదు. హకీం మాతృశాఖకు వెనక్కు వెళితే ఇక్కడున్న ఏడీ హోదా ఉండదు. అందువల్ల తనను అటవీశాఖలో విలీనం చేయాలంటూ ఆయన తన రాజకీయ పరపతిని ఉపయోగించి సీఎంను కలిశారు. ముఖ్యమంత్రి ఆయనను అటవీశాఖలో విలీనం చేయాలంటూ సిఫారసు చేశారు.
ఈ మేరకు సీఎంఓ నుంచి వెళ్లిన ఫైలును పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భలేరావు తిప్పిపంపారు. నిబంధనల ప్రకారం తమ శాఖ అధికారిని అటవీశాఖలో విలీనం చేయడానికి వీలుకాదని, పైగా ఇప్పటికే సిబ్బంది కొరతతో అల్లాడుతున్న పశుసంవర్థక శాఖ మరింత ఇబ్బంది పడుతుందని నోట్‌ఫైల్‌లో రాశారు. సాధారణ పరిపాలన విభాగం భలేరావు వాదనను సమర్థించగా.. న్యాయ శాఖ కూడా బలపరిచింది. ఈ మేరకు ఫైలు సీఎం వద్దకు వెళ్లగానే.. ఆయన ‘నేను గతంలో రాసిన మాటకే కట్టుబడి ఉన్నాను.
ఆ అధికారిని అటవీశాఖలో విలీనం చేయాల్సిందే..’ అన్న అర్థం వచ్చేలా రాసి మళ్లీ ఫైలు పంపారు. భలేరావు కూడా తాను గత నిర్ణయానికే కట్టుబడి ఉన్నానంటూ.. ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే సీనియర్‌కు అన్యాయం జరుగుతుందని మళ్లీ నోట్‌ఫైల్‌లో రాసి తిప్పి పంపారు. ‘నిజంగా హకీంను విలీనం చేస్తే ప్రస్తుతం అటవీశాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారికి అన్యాయం జరుగుతుంది. జూనియర్ కింద సీనియర్ పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం అన్ని విధాలా సమంజసమైనదే’ అని అటవీ శాఖ అధికారులతోపాటు పశుసంవర్థక శాఖ వర్గాలు కూడా అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more