ఏ పని చేసినా ప్రజాహితంగా ఉండాలని ప్రజాప్రతినిధుల నుండి కోరుకుంటారు కానీ ఏ పని చేసినా పార్టీ బలోపేతమవాలని రాజకీయాల్లో నాయకులు గట్టిగా నమ్మతున్నట్టుగా తెలుస్తోంది. ఒక ప్రకటన చేసినా, ప్రతిపక్షాలను విమర్శించినా, ఒక పర్యటన చేసినా, ఉద్యమాలు నిర్వహించినా పార్టీ ప్రయోజనం చూసేవారు. ఇప్పుడు జీవో పాస్ చేసినా, నియమాలను రూపొందించినా, ఉద్యమాలను ఉపేక్షించినా, ఉద్యమాలను అడ్డుకున్నా, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజాప్రయోజనం కాకుండా పార్టీ ప్రయోజనాలను ప్రధానంగా చూసే రోజులోచ్చాయని రాజకీయ వర్గాల్లో ఇంకా నీతీ నిజాయితీలను ఆశిస్తున్న వర్గాలు ఆక్రోశిస్తున్నాయి.
వైయస్ జగన్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అందులోకి పోయిన తర్వాత కొందరు శాసన సభ్యులు అతనికి మద్దతుగా నిలిచారు. వారికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చెయ్యటమూ జరిగింది కానీ అదంతా తెరవెనుకనే ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా చూసీ చూడనట్టుగా ఉండిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు బాహాటంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఓటు వేసినా ఊరుకోవటం కష్టమవటంతో వారి మీద అనర్హత తీర్పునివ్వమని సభాపతిని కోరటం జరిగింది. కానీ ఇంతకాలం అసమ్మతుల కూటమిని ఏమీ అనకుండా ఊరుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఏదో చర్య తీసుకున్నట్టుగా బయటకు చూపించినా, సభాపతి పరిధిలో దానిమీద తీర్పు వాయిదా పడుతుండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
వారిని అనర్హులుగా ప్రకటిస్తే ఆ 18 మంది ఖాళీలను పూరించటానికి ఉప ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది. అప్పుడు వాళ్ళకే మళ్ళీ స్థానం లభిస్తేనో అన్న అనుమానం ఉండబట్టి వాటిని పెండింగ్ లో పెడుతూ వస్తున్నారని, జగన్ మీద ఉన్న సానుభూతి, కొద్దో గొప్పో సదభిప్రాయం పోతేకానీ కాంగ్రెస్ కి అవకాశం ఉండదన్న ఉద్దేశ్యంతో జగన్ చుట్టూ కేసుల ఉచ్చు పూర్తిగా బిగుసుకునేంత వరకూ వేచిచూస్తున్నారని, మార్చి నెలాఖరు కల్లా జగన్ మీద కేసులు ఒక కొలిక్కి వచ్చి అతన్ని అరెస్ట్ చేసినట్లయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పేరు వినిపించకుండా పోతుందని, అప్పుడు ఈ ఆరోపణలున్న సభ్యులను అనర్హతకు లోను చేస్తే వ్యవహారం చక్కబడుతుందని కాంగ్లెస్ ఉద్దేశ్యమంటూ రాజకీయ వర్గాల్లో విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
జగన్ కేసులు, అనర్హత వేటు, జగన్ అరెస్ట్ లు ఉప ఎన్నికల్లో పార్టీ వైఖరి, వ్యూహాలు సరిగ్గా తెలియకపోవటంతో మంత్రులూ, శాసన సభ్యులూ ప్రతిరోజూ శాసనసభ లాబీల్లో వీటిమీద చర్చలే చేసుకుంటున్నారట.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more