ఒక పక్క తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇన్నాళ్ళ శశికళ చెలిమిని మర్చిపోయి స్నేహ బంధాన్ని కర్కశంగా తెంచేస్తూ శశికళని సకుటుంబ సపరివార సమేతంగా పార్టీలోంచే బయటకు పంపించెయ్యటమే కాకుండా కొసరుగా ఆమె సోదరుడు, తాజాగా ఆమె భర్తనూ జైలు పాలు చేస్తుంటే, శశికళ మాత్రం తన అనురాగాన్నీ విశ్వాసాన్నీ చూపిస్తూ, కర్నాటక కోర్టులో జయలలితకు అనుకూలమైన సాక్ష్యాన్నివ్వటం చెలియ మీది ఆమె అనురాగానికి సాక్ష్యమా లేక ఉతృష్టమైన రాజకీయ ఎత్తుగడకు ప్రతిబింబమా అన్నది అర్థం కాక చాలామంది రాజకీయ విశ్లేషకులు కొట్టుమిట్టాడుతున్నారు.
జయ లలిత జయ టివి లో భాగస్వామే కానీ నిద్రాణ భాగస్వామట. శశికళే జయ టివికి సారధ్యం వహించి అన్ని నిర్ణయాలు, లావాదేవీలు, కీలక వ్యవహారాలను కూడా చక్కబెడుతుండేవారట. ఈ విధంగా కర్నాటకలో జయలలిత స్టేట్ మెంటునివ్వగా, నిన్న కోర్టుకి హాజరైన శశికళ కూడా అదే విధంగా స్టేట్ మెంటు నివ్వటం రాజకీయరంగంలో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
శశికళ తనకు అనుకూలంగా సాక్ష్యమివ్వటం కోసమే జయలలిత శశికళ భర్త నటరాజన్ ని అరెస్ట్ చేయించటం ద్వారా తన ఆధీనంలోకి తీసుకుని శశికలను బ్లాక్ మెయిల్ చేస్తోందని కొందరు భావిస్తుంటే, అందరూ కలిసి ఆడుతున్న నాటకమే నని, అంతా సద్దు మణిగిన తర్వాత ఎలా బయటకు పోయారో అలాగే మళ్ళీ లోపలకు చేరుకుంటారని కొందరు అంటున్నారు. జయ, శశికళ ల స్నేహాన్ని నటరాజన్ అతిగా వాడుకున్నందుకు అతనికి తగిన శాస్తి జరిగిందని కొందరంటుంటే, తనవాళ్ళని పెట్టుకునేదే వాళ్ళకి సంపాదించుకునే అవకాశమివ్వటం కోసమే కదా, కానీ అవి అవసరమైనప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళకి చేతిలో ఆయుధాలు కూడా అవుతుంటాయని మరికొందరంటున్నారు.
ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలే సెపరేట్
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more