మెగా స్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ .. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకు క్లప్ కొట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుండి రామ్ చరణ్ తేజ్ మంచి స్నేహితులని ..బయటి ప్రపంచానికి తెలిసింది. వీరి స్నేహం తెలుసుకొని అభిమానులు చాలా ఆనందపడ్డారు. అయితే రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్ సినిమా చేస్తాను అని ప్రకటన చేయటం వారి స్నేహానికి నిదర్శనం. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం సభ్యులు మాత్రం .. వీరి స్నేహం పై కత్తులు నూరుతున్నారని ఫిలింనగర్ టాక్.
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చిత్రం “దుమ్ము”. ఈ చిత్రం ఆడియో విడుదల ఇటీవల జరిగింది. సాధారణంగా నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు నటించిన చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు..నందమూరి ఫ్యామిలీ అంతా అక్కడ కొలువై ఉంటుంది.కానీ ‘దమ్ము’ ఆడియే విడుదలకు మాత్రం ఒక్కరంటే ఒక్కరు నందమూరి వంశస్థులు మచ్చుకైనా కనిపించలేదు. ఈ చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతిని వెంటబెట్టుకుని రాగా, మిగిలిన వారంతా చిత్ర యూనిట్ టెక్నీషియన్స్, కొంతమంది చిత్ర పరిశ్రమకు చెందినవారే.
ముఖ్యంగా.. జూనియర్ ఎన్టీఆర్ చిత్రాల ఆడియో ఆవిష్కరణలకు ఖచ్చితంగా సీనియర్ నటుడు బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హాజరవుతారు. కానీ వీరిద్దరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించలేదు. అలాగే, హీరోలు కళ్యాణ్ రామ్, తారకరత్నలు కూడా అటువైపు తొంగి కూడా చూడలేదు. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలియక పోయినప్పటికీ… వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందు వల్లే ఈ నందమూరి సింహాలు ‘దమ్ము’ ఆడియో ఆవిష్కరణకు దూరంగా ఉన్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం.
అయితే, మరికొంతమంది మాత్రం మరోలా వ్యఖ్యానిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ హీరోలను జూనియర్ ఎన్టీఆర్ విస్మరించారని అంటున్నారు. అంతేకాకుండా, ‘జై ఎన్టీఆర్’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పదేపదే చేసిన నినాదాలు కూడా వారి ఫ్యామిలీ నుంచి వేరుపడిన సంకేతాలు పంపుతోందని చెపుతున్నారు.
ఇంకొందరు మాత్రం.. జూనియర్ ఎన్టీఆర్ తమ బద్ధశత్రువుంగా ఉండే మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్‌తో సత్ సబంధాలు కొనసాగించడం మిగిలిన నందమూరి హీరోలకు ఏమాత్రం రుచించక ‘దమ్ము’ ఆడియోకు దూరంగా ఉన్నట్టు భొగొట్టా. ఇటీవల వీరిద్దరు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కథ కుదిరితో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తానని రామ్ చరణ్ ప్రకటించారు. ఇది నందమూరి హీరోలకు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more