పసుపులేటి కృష్ణవంశీ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు.
తెలుగు సినిమా పరిశ్రమ లో క్రిష్ణవంశీ సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు క్రిష్ణవంశీ. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు . ఆ సినిమా పేరు నిన్నే పెళ్ళాడతా. తరువాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి 'ఆంధ్రా టాకీస్' సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతనే ఇంటర్వ్యూలలో చెప్పాడు.
ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృష్ణవంశీ శైలిలో కథ, కథనాలుంటాయని తెలిసింది. వరసగా కృష్ణ వంశీ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్నాయి. మహాత్మ, మొగుడు చిత్రాలు మార్కెట్లో మంచి హైప్ తెచ్చుకున్నా వర్కవుట్ కాలేదు. ముతక కథ,కథనం ఈ చిత్రాలుకు మైనస్ గా మారాయి.
నాని,కృష్ణవంశీ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'పైసా' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎల్లోఫ్లవర్స్ సంస్థ ఈ చిత్రాన్ని మంచి నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేథరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్ పుప్పాల నిర్మాత.
నాని 'ఈగ' తరవాత చేస్తున్న చిత్రమిదే. ఓ ప్రక్క గౌతమ్ మీనన్ దర్సకత్వంలో ఎటో వెళ్లి పోయింది మనస్సు చిత్రంలో చేస్తూ నాని ఈ చిత్రం కమిటయ్యారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో పైసా టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు.
అలా మొదలైంది చిత్రం దర్సకురాలు నందినీ రెడ్డి గతంలో కృష్ణవంశీ అసెస్టెంట్. ఆ చనువుతో నానిని ఈ ప్రాజెక్టుకు ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. కృష్ణవంశీ సైతం ఎలాగైనా ఈ ప్రాజెక్టుతో హిట్ కొట్టాలని కసిగా చేస్తున్నట్లు చెప్తున్నారు. ఫన్ తో కలసిన సోషల్ రెలివెంట్ సబ్జెక్టు అని టాక్ వినపడుతోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more