కురచ దుస్తులు వేసుకోవడం, వీపు చూపించడం కానేకాదు. ఇలా చేసింది నేనొక్కదాన్నే కాదు. ఇంతకుముందు చాలా మంది ఇలా ఎక్స్‌పోజింగ్ చేశారు. బెంగాలీ బ్యూటీ పావోలీ డ్యామ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. త్వరలో విడుదలయ్యే బాలీవుడ్ సినిమా' హేట్‌స్టోరీ'లో ఈ హాట్‌బ్యూటీ అనచ్చాదిత వీపును చూపిస్తున్న పోస్టర్లు కుర్రకారును నిద్రపోనివ్వడం లేదు. సెక్స్ సింబల్‌గా గుర్తింపు రావడం వల్ల భయమేమీ లేదని ఈమె చెబుతోంది.
ఆ పోస్టర్‌ను చూసి భయపడాల్సిన అవసరం లేదని, పగతో రగిలిపోయే మహిళగా దర్శకుడు తనను చూపించాడని వివరించింది. ‘ధైర్యం అనేది మానసికపరమైన అంశం. నాపై ఇదే ముద్ర ఉంటుందని నేను అనుకోవడం లేదు. మళ్లీ ఇలా చేయను కూడా. ఒక నటిగా ప్రతిసారి నేను కొత్తదనాన్ని ప్రదర్శించాలి. రాబోయే సినిమాల్లో చేసే పాత్రలు కూడా కొత్త తరహాగా ఉంటాయి’ అని పావోలీ చెప్పింది. ఈ 32 ఏళ్ల తార గౌతమ్ ఘోష్ తీసిన' కాల్బెలా'తో సినీరంగంలోకి ప్రవేశించింది. అందులోనూ హాట్‌సీన్లలో నటించి సంచలన తారగా మారింది. కొత్తనటినే అయినా తన సత్తా చూపడానికి తగిన అవకాశం ఉంది కాబట్టే హేట్‌చాన్స్‌లో చేయడానికి అంగీకరించానని తెలిపింది.
‘బహుముఖాలున్న పాత్ర ఇది. హీరోయిన్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాతోనే బాలీవుడ్‌లో ప్రవేశించడం నిజంగా గొప్ప విషయం. మంచి పాటలు, నృత్యాలకు ఇందులో కొదవ లేదు’ అని పావోలీ వివరించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ మహిళా జర్నలిస్టు చుట్టూ తిరుగుతుంది. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై ఆమె ప్రతికారం ఎలా తీర్చుకుందో ఈ నెల 20న విడుదలయ్యే' హేట్‌స్టోరీ'లో చూడవచ్చు. బెంగాలీ సినిమాల్లో సాంస్కృతిక అంశాలు ఎక్కువని, హిందీలో గ్లామర్ అధికంగా కనిపిస్తుందని పావోలీ డ్యామ్ వివరించింది
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more