క్రికెట్ ఆడటంలోనే గ్రేట్ కాదు.. బిర్యానీ తింటంలో కూడా ఇర్పాన్ పఠాన్ ముందంజలో ఉన్నాడు. ఆయన ఏకంగా నాలుగు ప్లేట్లు బిర్యానీ తింటడట. బాదుడులో పఠాన్ సోదరులు ఇర్ఫాన్, యూసుఫ్‌ల శైలి ప్రత్యేకం. టీమిండియాలోకి వచ్చిపోతున్న ఈ ఆల్‌రౌండర్లు ఐపీఎల్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. అన్న యూసుఫ్ కోల్‌కతాకు.. తమ్ముడు ఇర్ఫాన్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అన్నట్టు యూసుఫ్‌కు ముంబయికి చెందిన ఓ ఫిజియోతో నిఖా పక్కా అయింది.
ఇక ఇర్ఫానే మిగిలాడు. ఇంతకుముందు ఎవరైనా పెళ్లి ప్రస్తావన తెస్తే.. అన్నకు అయిన తర్వాత అంటూ చోటా పఠాన్ చెప్పేవాడు. ఇప్పుడేమో పెళ్లి గురించి అడగొద్దని ఇర్ఫాన్ ముందుగానే విలేకరులకు షరతు విధిస్తున్నాడు. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్' అన్న ప్రశ్న తనకు ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నాడు. క్రికెట్‌నే పెళ్లి చేసుకుంటానని సరదా అన్న ఇర్ఫాన్.. వివాహం చేసుకునేముందు తప్పకుండా అందరికీ చెబుతానని మాటిచ్చాడు. యూసుఫ్‌తో అనుబంధం.. అమ్మ వండే బిర్యానీ.. తన ఆటతీరు గురించి చెప్పాడు. అతని మాటల్లోనే తెలుసుకుందాం..
అమ్మే నా హీరో తను చాలా దృఢ సంకల్పం గల మహిళ. అమ్మకు ఆరోగ్య సమస్యలున్నా మా ఇంటికి మూల స్తంభం లాంటిది. మా కోసం ఎన్నో కష్టాలు పడింది. నాకు నాన్నన్నా ఎంతో ఇష్టం. అమ్మ బిర్యానీ చాలా రుచిగా వండుతుంది. ఒకేసారి నాలుగు ప్లేట్లు లాగించేస్తా. అమ్మ వంటకానికి రెస్టారెంట్లో భోజనానికి పోలికే ఉండదు. ఏదైనా టూర్ నుంచి వచ్చిన వెంటనే బిర్యానీ చేయమని అమ్మకు చెబుతా. తినే ముందు కడుపు ఖాళీగా ఉంచుకుంటా. ఇక వంటలో నాకూ కొంత ప్రవేశం ఉంది. టీ, ఆమ్లెట్ చేయడం వచ్చు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more