తాజాగా నదీ జలాల పంపిణీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందా... జలాల పంపకం ఇప్పుడు వివిధ ప్రాంతాల మధ్య వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తోంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో ఇప్పటికే మిగులు జలాలపై హక్కుల్ని పోగొట్టుకున్న రాష్ట్రానికి, ప్రభుత్వ తీరుతో మరింత నష్టం వాటిల్లుతోందని టిఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరో వారం రోజుల్లో ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తెలంగాణకు నికర జలాలపై హక్కుల్ని కల్పించకపోతే రాష్ట్రం భగ్గుమంటుందని కేసీఆర్ హెచ్చరించటం దీనికి ఊతమిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమిస్తోన్న కేసీఆర్ ఇప్పుడు కృష్ణా జలాల సాధన కోసం ఉద్యమించబోతున్నారు. మరో వారం రోజుల్లో ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య అంతరాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ నదీ జలాల కోసం పోరు కు సిద్దమవుతున్నారు.
65శాతం నీటి లభ్యత ఆధారంగా ట్రైబ్యునల్ 2010 డిసెంబర్ 30న ఇచ్చిన అవార్డుతో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కలేదని., మలి విడత వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వ విధానాల తో తెలంగాణ నష్టపోయే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్ బిసి ప్రాజెక్టుల అవసరమైన 77 టిఎంసిల నీరు న్యాయంగా దక్కే పరిస్థితి ఉన్నా ప్రభుత్వ వాదనలతో కేటాయింపులు జరగలేదంటున్నారు.
ఇదిలా ఉండగా, మూడు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీలో అంతరాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారం కోసం ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ రాష్ట్రానికి మిగులు జలాలపై ఉన్న హక్కును రద్దు చేయడంతో పాటు 10శాతం నీటి లభ్యతను తక్కువగా పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్రానికి నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. 2010లో ట్రైబ్యునల్ ఉత్తర్వులు వెలువడిన తర్వాత చేసిన వాదనల్లో తెలంగాణ ప్రాంతానికి కావాల్సిన 77టిఎంసిలతో పాటు ఆంధ్రా., రాయలసీమలకు కావాల్సిన 150 టిఎంసిలు కలిపి 227 టిఎంసిలు కావాలని ప్రతిపాదించడంతో కృష్ణా పరివాహకంలోని తెలంగాణ ప్రాంతాలు నష్టపోతున్నాయని కేసీఆర్ వాదన.
వర్షపాతం, నీటి లభ్యత, కరువు పీడిత ప్రాంతాల ఆధారంగా నీటి కేటాయింపులు జరుగుతాయని తెలిసినా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణలో దుర్బిక్షాన్ని దాచిపెట్టిందని., ట్రైబ్యునల్ తీర్పు తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరిస్తున్నారు.ఈ వివాదం ఎలా సమసిపోతుందో కాలమే నిర్ణయించాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more