పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సౌత్ ఇండిమా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారనే ప్రచారం ఆ మధ్య జరిగిన విషయం తెలిసిందే. శంకర్ రూపొందించిన సూపర్ హిట్ మూవీ ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ గా దీన్ని రూపొందించనున్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఈ సినిమాలో అర్జున్ ని శంకర్ ‘ఒక్కరోజు ముఖ్యమంత్రి’గా ఏ విధంగా చూపించాడో మనందరికి తెలిసిన విషయమే.
తాజాగా శంకర్ దీనికి సంబంధించిన కథను సిద్దం చేసుకుంటున్నాడని వార్తలు. అయితే కొందరు మాత్రం ఈచిత్రం మొదలు కాబోతోదంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి ‘మనలో ఒక్కడు’ అనే టైటిల్ కూడా పెట్టేశారు పవన్ ఫ్యాన్స్. ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? అనే కథాంశంతో ఇది రూపొందుతోందని చెబుతూ ఓ పోస్టర్ కూడా దర్శనం ఇస్తోంది. ఈచిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారని, పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, గణేష్ బాబు ప్రొడ్యూసర్ అంటూ అందులో పేర్కొన్నారు.
ఈ వార్తల్లో ఎంత నిజముందో లేదో తెలియదు కానీ పవన్ అభిమానులు మాత్రం ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని తాపత్రయపడుతున్నారు. అయితే ఇదంతా కొందరు కావాలని చేస్తున్న ప్రచారమే అని, ఇప్పటి వరకు అలాంటి సినిమా ప్రతిపాదన రాలేదని పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ సన్నిహితులు అంటున్నారు. దీని పై పవన్ గానీ, శంకర్ గానీ నోరు విప్పితే నిజానిజాలు ఏంటన్నది తెలుస్తుంది. అప్పటి దాకా వేయిట్ అండ్ సీ.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more