టాలీవుడ్ కు బిగ్ బాస్ గా ఉంటున్న వ్యక్తి దాసరి నారాయణ రావు. సీనియర్ దర్శకుడు అయిన దాసరి నారాయణ రావు టాలీవుడ్ కొత్త హీరోలపై నిప్పులు చెరుగుతుంటాడు. ఇప్పుడు హీరోలలో మంచి హీరో లేడు అని చెప్పిన దాసరి. మరళ అదే నోటితో ఒక కుర్రహీరోను.. పొగడ్తలతో ముంచాడు. నేటితరం కుర్రహీరోలకు నటన చేతకాదు.. భాష ఉండదు.. మన ఖర్మ అంటూ మండిపడే దర్శకరత్న దాసరి నారాయణరావు దమ్ము సక్సెస్ మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. తారక్ నటన అబ్బురపరిచేదిగా ఉందంటూ పొగడ్తల జల్లు కురిపించారు.
కనురెప్పలను సైతం వాల్చకుండా అభినయం చేయడం కొంతమంది నటులకే సాధ్యమని, అది దమ్ము సినిమాలో ఎన్టీఆర్ చేసి చూపించారని అన్నారు. యువ నటుడు అయినప్పటికీ నటనలో 60 ఏళ్ల అనుభవం ఉన్నవాడిలో అద్భుతంగా చేశాడని కితాబిచ్చారు.
వెంటనే ఎన్టీఆర్ "ఇండస్ట్రీ సన్మార్గంలో ఉండాలని కోరుకునే దాసరికి కృతజ్ఞతలు. దమ్ము విజయం నా వెనకాలున్నవారందరి విజయం. దమ్ము టీమ్‌లోని వారంతా సినిమా సూపర్ హిట్ కావాలని మంచి హృదయంతో పూర్తిస్థాయిలో చేశారు. నాకు మంచి హిట్ అందించిన దర్శకుడు బోయపాటికి రుణపడి ఉంటాను.
ఇక అభిమాన సోదరులందరికీ ఆజాన్మంతం రుణపడి ఉంటాను. ప్రేక్షక దేవుళ్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఐతే ఎక్కడో చిన్న బాధ. సినిమా తీయాలంటే ఎంతో కష్టం. అలాంటిది రూ.10 పైరసీ క్యాసెట్‌లో సినిమా చూస్తే నిర్మాత ఎంతగా నష్టపోతాడో ఆలోచించండి. పైరసీని ఆపాల్సింది ప్రేక్షక దేవుళ్లే. దయచేసి పైరసీ రక్కసి నుంచి ఇండస్ట్రీని కాపాడండి" అంటూ ముగించారు. అనంతరం దాసరి అందుకుని.. గుంటూరులో సుమారు 15వేల పైరసీ క్యాసెట్లు పట్టుబడ్డాయన్నారు. ఇవన్నీ చెన్నై నుంచి వచ్చినట్లు తేలిందన్నారు. ఈ పైరసీని ఆపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more