కష్టకాలంలో తాను శ్రీదేవి నటించిన చిత్రాల నుంచి స్ఫూర్తి పొంది, తనకు జరుగుతున్న అన్యాయం పట్ల గళం విప్పానని 'సత్యమేవ జయతే' కార్యక్రమం ద్వారా తనతో మాట్లాడిన అమీర్‌ఖాన్‌కు చెప్పాడు. టీవీ మాధ్యమంలో బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ నిర్వహిస్తున్న 'సత్యమేవ జయతే' కార్యక్రమంలో అలనాటి హీరోయిన్ శ్రీదేవి ప్రత్యేక అతిథిగా పాల్గొని బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురై వేదనపడిన బాధితుడు హరీష్ అయ్యర్‌లో ఆశలు నింపింది.
ముంబై వాసి హరీష్ సుమారు 11 సంవత్సరాల పాటు బాల్య దశ నుంచి కౌమార ప్రాయం వరకూ తన బంధువు చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యాడు. అనంతరం అతనిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ కార్యక్రమానికి నటి శ్రీదేవిని కూడా తీసుకువచ్చారు. హరీష్‌తో శ్రీదేవి మాట్లాడుతూ.. ''నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నా సినిమాల నుంచి స్ఫూర్తి పొందడమన్నది నాకు చాలా ఆనందం కల్గించింది. ముఖ్యంగా నువ్వు పడ్డ కష్టం గురించి మాతో పంచుకోవడం వల్ల ఇలాంటి కష్టాన్ని ఎదుర్కుంటున్న వారిలో ఆశలు చిగురించి ధైర్యవంతులవుతారు.
అప్పుడు నువ్వే నిజమైన హీరో అవుతావు'' అని ప్రోత్సహించింది. బాలలపై కొనసాగుతున్న లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేలా కఠినమైన చట్టాలు రావాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఒక పత్రంపై కూడా ఆమె సంతకం చేసింది. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ పలువురు బాలలకు లైంగిక వేధింపులను అర్థం చేసుకోవడం గురించి 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' పేరిట వర్క్ షాప్‌ను నిర్వహించాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more