గబ్బర్ సింగ్ హిట్ చాలా మందిలో ఆనందాన్ని కలిగిస్తే ఒక హీరోకు మాత్రం చాలా బాధను కలిగిస్తోందిని వినికిడి. ఆ హీరో మరెవరో కాదు తమిళ హీరో శింబు. గబ్బర్ సింగ్ కన్నా ముందే తమిళంలో దబాంగ్ ని రీమేక్ చేసి ..ఓస్తి అనే చిత్రం చేసాడు. అయితే పెద్దగా మార్పులు చేయకుండా దబాంగ్ ని ఉన్నదున్నట్లుగా ఓస్తిగా తెరకెక్కించాడు. దాంతో అక్కడ నేటివిటి సమస్య వచ్చి డిజాస్టర్ అయ్యింది. అలాగే మల్లికా షెరావత్ తో చేసిన ఐటం సాంగ్ కూడా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో శింబు ..ఇక్కడ తెలుగులో గబ్బర్ సింగ్ క్రియేట్ చేస్తున్న రికార్డు వసూళ్లు,సునామీ తరహాలో వచ్చి పడుతున్న కలెక్షన్స్ ని చూసి చాలా బాధపడుతున్నాడని చెన్నై పరిశ్రమలో వారు అంటున్నారు. తెలుగు చిత్రం రీమేక్ లు ఉన్నదున్నట్లు గా చేసే శింబు..కొద్ది రోజులు ఆగి గబ్బర్ సింగ్ ని రీమేక్ చేసినా హిట్ అయ్యేది కదా..అంటున్నాడట. అంతేగాక ఇప్పడంతా శింబు..ఓస్తిని,గబ్బర్ సింగ్ తో పోల్చటం కూడా బాధకలిగిస్తోందిట. ఆ రకంగా గబ్బర్ సింగ్ ..శింబుకి తీరని బాధను కలిచిందని చెప్తున్నారు.
దానికి తోడు తమిళంలోనూ డైరక్ట్ గా గబ్బర్ సింగ్ విడుదలై సంచలనంరేపుతున్న విషయం తెలిసిందే. నాక్కొంచెం తిక్కుంది.. అయితే దానికీ ఓ లెక్కుంది అంటూ చెప్పిన డైలాగ్ ని తమిళ తంబీలకు తెగ నచ్చేసిందట. ఈ డైలాగ్ ని అక్కడ వాళ్ళు ఎనక్కు కొంజెం పైత్యం ఇరుక్కు .. అదక్కు ఒరు కానా ఇరుక్కు అని తమిళంలోకి మార్చుకుని చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, మధురై, కోయంబత్తూర్ ఇలా ప్రధాన నగరాలు అన్నింటిలోనూ ఈ డైలాగే వినిపిస్తుంది. దాంతో శింబుకి పుండు మీద కారం జల్లిన చందంగా గబ్బర్ సింగ్ మారింది. ఇదిలా ఉంటే దబాంగ్ హీరో సల్మాన్ కూడా గబ్బర్ సింగ్ చిత్రం గురించి ప్రశంసలు వర్షం కురిపించాడు. ఈ విషయమై సల్మాన్ మాట్లాడుతూ... సౌత్ లో హీరోలను దేముడులా ఆరాధిస్తారని తెలుసు. కానీ నేను ఓ హీరోకి ఇంత ఫాలోయింగ్, ఇంత క్రేజ్ ఊహించలేదు. ఈ మానియా చూస్తూంటే, నాకూ తెలుగులో ఓ చిత్రం చేయాలనిపిస్తోంది అన్నారు. గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ లో కూడా దబాంగ్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు తరుణ్ ఆదర్స్ లాంటివాళ్లు చెప్తున్నారు. ఇక సల్మాన్ ఈ చిత్రంలోని కెవ్వు కేక పాటకు చాలా ఇంప్రెస్ అయ్యాడని, తన దబాంగ్ 2లో ఆ పాటను పెట్టే అవకాశముందని బాలీవుడ్ టాక్. ఇవన్నీ శింబుకి బాధ కలిగించే విషయాలే కదా.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more