అసలు జగన్ కు ఎవరు వ్యతిరేకులు, ఎవరు మంచివారు ఏమిటి అర్థంగానీ పరిస్థితిలో ఉన్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వలన ఆయన పరిస్థితి ఎవరికి అర్థం కావటంలేదట. జగన్ కు అరెస్ట్ భయంతో ఏం చేస్తున్నాడో .. ఏం మాట్లాడుతున్నాడో.. తెలియటంలేదట. జగన్ పోలీస్ శాఖ పై కూడా వ్యాఖ్యలు చేయటం చాలా ఘోరమైన విషయమాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
జగన్ మొన్నటి వరకు సిబిఐ వారు నా పై అక్రమ కేసులు పెట్టారని జగన్ చెప్పటం అందరికి తెలిసిన విషయమే. అయితే సిబిఐ వారిని వదిలిపెట్టి వెంటనే .. కోర్టులను.. జడ్జీలను, మొత్తం నాయ్య శాఖ ను విమర్శించటం జగన్ కు అలవాటైందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ఆ తరువాత కేంద్ర మంత్రులను, అసలు ఈ వ్యవస్థే బాగా లేదని .. పబ్లిక్ లో జగన్ పార్లమెంట్ వ్యవస్థ పై విమర్శలు చేయటం చాలా శోచనీయంగా ఉందని ..ఢిలీ మంత్రులు అంటున్నారు. అవినీతి అనేది జగన్ బాడీలో గుండెలాంటిది. అలాంటి వ్యక్తి అవినీతిపో పోరటం చేస్తానని .. జగన్ చెప్పటం ఆశ్చర్యంగా ఉందని మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారు.
చివరకు జగన్ అందరికి రక్షణ కల్పించే వ్యవస్థ అయిన పోలీసు శాఖ పై కూడా జగన్ బురద చల్లటంతో .. జగన్ చేసిన చౌకబారు వ్యాఖ్య లపై డిజీపీ దినేష్ స్పందించినట్లు మీడియా వారు చెబుతున్నారు. జగన్ పోలీస్ శాఖ పై వ్యాఖ్యల చేయటం మంచిదికాదని ..అసలు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించింది ఎవరు? రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావటానికి కారణం ఎవరు ? అనేది ప్రజలకు తెలుసునని డిజీపీ దినేష్ అంటున్నారు.
రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, అవి తన పేరు మీద చలామణీ చేసేలా కుట్ర జరుగుతోందని జగన్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ దినేష్ రెడ్డి స్పందించారు. ఇందుకు ఆధారాలు చూపాలని ఆయన మీడియా ముఖంగా జగన్‌ను అడిగారు. ఈ వ్యాఖ్యలను జగన్ విజ్ఞతకే వదిలివేస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలతో డీజీపీ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను గవర్నర్‌ను కలిసినట్లు వచ్చిన వార్తలు వాస్తవమేనని స్పష్టం చేశారు. జగన్‌ను అరెస్టు చేస్తున్న నేపథ్యంలో తాను గవర్నర్‌ను కలిసినట్లు వస్తున్న ఊహాగానాలకు త్వరలోనే తెరదించుతామని అన్నారు. జగన్ వ్యాఖ్యలు నిరాధారమని కొట్టిపారేశారు.
అసలు పోలీస్ శాఖ ఏం చేశారని జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటి జగన్ ఆధారాలు చూపాలని ఆయన మీడియా ముఖంగా జగన్‌ను అడిగారు రాష్ట్రంలో పోలీసులు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పోలీసులు అల్లర్లను అదుపు చేస్తారని, అల్లర్లు సృష్టించరని ఆయన అన్నారు. సీనియర్ పోలీసు అధికారులపై కొంత మంది అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
జగన్ కాంగ్రెస్ పార్టీతో .. సీఎం గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పై వింత వ్యాఖ్యలు చేయటంతో.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జగన్ పై విరుచుపడ్డాడు. అసలు జగన్ తల్లి, తండ్రిని చంపి .. నేను అనాథ అంటున్నాడని .. సీఎం కిరణ్ ఒక మీటింగ్ చెప్పాడని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. తండ్రి పేరు చెప్పి.. ప్రజల్లో సింపతి కోసం .. జగన్ ఇలాంటి చేస్తున్నాడని .. తెలుగు దేశం పార్టీ నాయకులు అంటున్నారు. జగన్ ఎవరి మాట వినకుండా .. తను చేసిందే.. మంచి..తను ఏ నేరం చేయలేదని .. ప్రజల్లో తిరుగుతూ.. పదవి కోసం ఎలాంటి పని చేయటానికైన వెనకడుగు వేయకుండా ముందుకు పోతున్నాడని చంద్రబాబు అంటున్నాడు. ఇలాంటి మూర్ఖంగా ముందుకు పోతు .. తను చేసిందే మంచి .. ఇతరులు అందరు చెడ్డవారు అంటూ చెప్పటం జగన్ కే చెల్లుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు.
ఇలాంటి మూర్ఖుడి చేతిలో ప్రభుత్వం పెడితే.. ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అవుతుందని .. ప్రజలు ఈ విషయం తెలుసుకోని ఓటు వేయాలని చంద్రబాబు నాయకుడు ఉప ఎన్నికల ప్రచారంలో అంటున్నాడని ప్రజలు చేవులు కొర్కుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more