నాకు సిగరెట్ పొగ అంటేనే పడదు. అలాంటి పాత్ర కోసం పెట్టెలు పెట్టెలు కాల్చాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆరోగ్యం కూడా మందగిస్తోంది. నేను సినీ రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. హీరోయిన్ అవ్వడానికి నేను పెద్ద కష్టపడింది లేదు. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలుస్తోంది... ఏ బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్స్ అయిన అమ్మాయిలు... ఎంత దయనీయ పరిస్థితి నుంచి ఆ స్థాయికి వచ్చారో. నటిగా నాకు తగ్గ గౌరవాన్ని ఈ సినిమా అందిస్తుందని నమ్మకంతో కరీనా ఉందట కరీనాకపూర్ ఎంత అందంగా ఉంటారో... అంతటి మంచి నటి కూడా.
ఈ విషయం దేశం మొత్తానికీ తెలుసు. త్వరలో ఆమెలో ఓ మహానటి ఆవిష్కృతం కాబోతోంది. మాధుర్‌భండార్కర్ దర్శకత్వంలో ఆమె ‘హీరోయిన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కరీనా నట విశ్వరూపాన్ని చూస్తారని యూనిట్ వర్గాలు అంటున్నాయి. నిజాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా చెప్పడం మాధుర్ భండార్కర్ స్టైల్. గతంలో తన దర్శకత్వంలో వచ్చిన చాందినీబార్, పేజ్ త్రీ, ట్రాఫిక్ సిగ్నల్, ఫ్యాషన్... లాంటి చిత్రాలే అందుకు నిదర్శనాలు. పస్తుతం కరీనాతో ఆయన చేస్తున్న ‘హీరోయిన్’ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే.
హీరోయిన్ అవ్వాలనే ఆశతో ముంబయ్ వచ్చి అవకాశాలు కోసం తిరిగే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుంది? అవకాశం వచ్చాక ఎదుగుదల కోసం వాళ్లు పడే పాట్లు ఎలా ఉంటాయి? స్టార్ స్టేటస్ వచ్చాక వారి ప్రవర్తన ఎలా ఉంటుంది?... ఈ అంశాల చుట్టూ తిరిగే సినిమా ఇది. సినీరంగంలోని చీకటికోణాన్ని, కథానాయికల జీవితాల్లోని చేదు సంఘటనలు కళ్లకు కట్టబోతున్నారు ఈ సినిమా ద్వారా మాధుర్. ఇందులో కరీనాకపూర్ పాత్ర పేరు మహీ అరోరా. చాలా మంది కథానాయిక జీవితాలకు అద్దం పట్టేలా ఆమె పాత్ర ఉండబోతోందట. ఈ పాత్రను సమర్థంగా పోషించడానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more