భక్తునికి .. భగవంతునికి అనుసందనమైనది ..గుడి, చర్చి, మసీద్. ఈ పవిత్రమైన ప్రదేశాలు. వీటిలో పవిత్రమైన పుణ్యకార్యాలు జరుగుతుంటాయి. అవీ ఎవరి మతం, కులం, పద్దతిని బట్టి .. వారు ఈ ప్రదేశాలను పవిత్రంగా చూసుకుంటారు. ఇక్కడ నిష్కలకమైన మనస్సు ఉన్న వ్యక్తులు మాత్రమే పుణ్య ప్రదేశాలకు వెళ్లటం జరుగుతుంది. ఈ పవిత్ర ప్రదేశాలకు .. విరోదులు ఎవరైన వస్తే .. వారి కఠినంగా ఆయా మతం వారు శిక్షించటం చేస్తారనే ప్రతి ఒక్కరు తెలిసిందే.
అయితే ప్రజలకు ఉపయోగపడే పని తప్ప మిగత ఎలాంటి చేడు పనులు చేసిన ఆయా మతాల వారు ఓప్పుకోవటం జరగదు. కానీ .. ప్రజలకు ఏమీ చేయకుండానే.. క్రైస్తవ సోదరులను అడ్డం పెట్టుకొని.. ఆ మతం పేరుతో.. చర్చిని రాజకీయానికి వాడుకున్న వ్యక్తి చరిత్రలోకి ఎక్కాడు వైఎస్ జగన్ . క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రం చూసుకోనే చర్చిని జగన్ తన అవసరం కోసం రాజకీయంగా వాడుకున్నాడని ..కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అసలు విషయం ఏమిటయ్య అంటే.. జగన్ అక్రమాస్తుల కేసులో ఈనెల 25న విచారణకు హాజరుకావాల్సిందిగా జగన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేయటం జరిగిందట. అయితే ఆ నోటీసులు ఇవ్వటానికి .. సిబిఐ వారు జగన్ ఫోన్ చేయటంతో .. అప్పుడు జగన్ సిబిఐ వారికి .. ఒక పవిత్రమైన చర్చికి రావాలని వారికి చెప్పటం జరిగిందట. సీబీఐ వారు గుంటూరు జిల్లా రెంటచింతలలో ఉన్న చర్చికు వెళ్లి జగన్‌కు సీబీఐ నోటీసులు అందజేయటం జరిగిందని మీడియా వారు అంటున్నారు.
అసలు ఆ నోటీసుల అందుకోవటానికి జగన్ మాచర్లకు దగ్గరలో ఉన్న రెంటచింతల చర్చిని ఎందుకు వేదిక చేసుకున్నాడని మీడియా వారు చేవులు కోర్కుకుంటున్నారు. జగన్ అప్పటికే ఉప ఎన్నికల ప్రచారం లో ఉండటంతో.. సీబీఐ ఇచ్చిన నోటీసులకు కూడా .. జగన్ కు అనుకూలంగా మలుసుకున్నాడని .. కాంగ్రెస్ వారు అంటున్నారు. అంటే సీబీఐ వారు నేను చర్చిలో ఉంటే నాకు నోటీసు ఇచ్చారని .. క్రైస్తవ సోదరులు దగ్గర సింపతీ కోసం ఇలా చేశాడని మీడియా వారు అనుకుంటున్నారు. అంతేకాకుండా రెంటచింతల చర్చి చాలా పేరున్నా చర్చిఅని అక్కడి ప్రజలు చెబుతున్నారు. జగన్ క్రైస్తవులకు పవిత్రమైన చర్చిని రాజకీయానికి వాడుకోవటం చాలో ఘోరమైన విషయాని కొంతమంది మత పెద్దలు మండిపడుతున్నారని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అసలు జగన్ ఇప్పటికి ప్రజలకు ఏం చేశాడని, జగన్ నుండి ప్రజలు ఏం ఉపయోగం పొందారని, రాష్ట్ర ప్రజలకు ఏమీ చేసింది లేకపోయిన.. ప్రభుత్వాన్ని ఖూనీ చేసి , కుట్ర చేసి అక్రమంగా అవినీతి సొమ్ము సంపాదించి ఇప్పుడు ఒక క్రైస్తవా మతాన్ని అడ్డుపెట్టుకొని, వారి దగ్గర సింపతీ పొంది.. ప్రభుత్వన్ని పడగొట్టలానే ఆలోచనలో ఉన్నాడట. అందుకే జగన్ .. సిబీఐ వారిని .… చర్చికి పిలిపించి నోటీసులు తీసుకున్నాడని .. తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.
ఈ విధంగా క్రైస్తవా సోదరులకు .. చూడండి నేను చర్చిలో ఉంటే .. నాకు ప్రభుత్వం నోటీసులు పంపించింది అనే తప్పుడు సమాచారన్ని క్రైస్తవ సోదరులకు తెలియటం కోసం ఈ పని చేసినట్లు మీడియా గుసగుసలాడుకుంటున్నారు.
అంతేకాకుండా.. జగన్ తాతా వైఎస్ రాజా రెడ్డి దేశానికి ఏం చేసాడు? ఆయనేదో ఒక స్వతంత్ర నాయుకుడు అయినట్లు .. దేశానికి మంచి పేరు తెచ్చి వ్యక్తి కి చేసినట్లు జగన్ గుంటూరు జిల్లా రెంటచింతలలో తన తాత వైఎస్ రాజారెడ్డికి జగన్ రెడ్డి నివాళులు అర్పించటం జరిగిందట. ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ రెంటచింతల నుంచి బయల్దేరే ముందు తాత ఆశీర్వాదం తీసుకోవటం చూసి అక్కడున్న మీడియా వారు చేవులు కోర్కుకోవటం మొదలుపెట్టరట. ఆయన తల్లి కూడా వైఎస్ విజయమ్మ పులివెందులలోని రాజారెడ్డి సమాధి వద్ద అంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేశారట. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రక్తదానం చేయటం , ఆయనతో పాటు రాజారెడ్డి అభిమానులు కూడా రక్తదానం చేయటం మీడియా తెలుసుకొని రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు ఆశ్చర్యంతో.. ఇదేమి వింత చోద్యం అంటూ. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారట.
అప్పట్లో వైఎస్ రాజరెడ్డి పేరు చెబితే చాలు .. ఆయన ఉన్న 50 కేసులు లిస్టు పోలీసు చేతిలో ఉండేదట. రాజరెడ్డి 50 మందిని చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫ్యాక్షనిస్టు అయిన రాజరెడ్డి .. ఈ రోజు వైఎస్ జగన్ కుటుంబం చేస్తున్న పనులు చూసి .. సీనియర్ రాజకీయ నాయకులు నవ్వుకుంటున్నారట. అసలు వారి కుటుంబ సభ్యులు వరకు అయితే పరువలేదు. కానీ ఆయనేదో ఒక రాజకీయ నాయకుడు అయినట్లు ఆయన ఘాట్ కు నివాళులు అర్పించటం చాలో ఘోరమైన విషయమైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. ఆయన సమాధిపై పెద్ద శిలువ బొమ్మను వేసి.. క్రైస్తవులను మోసం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. శిలువ బొమ్మతో క్రైస్తవులను ఆకట్టుకోవటానికే జగన్ వేసిన ప్లాన్ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అసలు జగన్ పై ఇన్ని అరోపణలు వస్తున్న.. సైలెంటు గా.. తాను మాత్రం వివరణ ఇవ్వకుండా .... ప్రభుత్వం పై విరుచుకపడటం జగన్ వెన్నతో పెట్టిన విద్య అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు జగన్ ప్రజలకు కోసం ఏమైన చేశాడ అంటే . అదీ ఏమీ లేదు. కానీ ప్రజల బలం చూసుకోని జగన్ ఇలా రెచ్చిపోతున్నాడు.. తను ఏం చేసిన చెల్లుతుందిలే అనుకోవటం జగన్ అవివేకం అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. జగన్, కులాన్ని , మతాన్ని , సెంటిమెంట్ ను, చర్చిని, శిలువును, అడ్డం పెట్టుకోవటం ఆయనకు అలవాటైందని మీడియా వారు అంటున్నారు. ఇప్పటికి జగన్ తెలుగు మీడియా ముందుకు వచ్చి జగన్ వస్తున్న వాటికి ఒక్క వివరణ ఇవ్వలేదని మీడియా గుసగుసలాడుకుంటున్నారు. తెలుగు మీడియా ను గౌరవించకుండా .. నేషనల్ మీడియా వైపు అడుగులు వేస్తు జగన్ పంథ నడిపించుకుంటున్నాడని .. మీడియా వారు అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తుందని ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పటం విశేషంగా ఉందని మీడియా వారు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more