అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా సరే.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా ప్రకటించడంతో ఈసారి రాష్ట్రపతి ఎన్నిక అప్పుడే వేడెక్కుతోంది. అయితే.. ఆయన కల నెరవేరుతుందా.. లేదా అనే విషయంలోనే సందేహాలు ఏర్పడుతున్నాయి. తాజాగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సంగ్మాతో సమావేశమయ్యేందుకు నిరాకరించడంతో ఆయన ఆశలు సన్నగిల్లినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.తదుపరి రాష్ర్టపతిని కావాలని లోక్‌సభ మాజీ స్పీకర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు పిఎ సంగ్మా ఆకాంక్షకు తీవ్ర విఘాతం ఎదురైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఆయనను ఏమాత్రం పట్టించుకోలేదు.
తనతో భేటీకి సంగ్మాకు వ్యవధి కేటాయించడాని సోనియా నిరాకరించారు. రాష్ర్టపతి పదవికి సంగ్మా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్, ఆయన సొంత పార్టీ ఎన్‌సీపీ మద్దతు ఇవ్వబోవని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనకు సోనియా నుంచి నిర్లక్ష్యం ఎదురైంది. తన విదేశీ జాతీయత వివాదాన్ని రేకెత్తించినందుకు సంగ్మాను సోనియా క్షమించలేదనేందుకు ఇది స్పష్టమైన సూచిక అని పార్టీ వర్గాలు పేర్కొ న్నాయి. సోనియాతో ఆమె నివాసం 10, జన్‌పథ్‌లో సమావేశం కావడానికి సంగ్మా సమ యం కోరారు. కాని ఆయన అభ్యర్థనను ఆమె తిరస్కరించారు.
అసల సంగ్మాకు పై సోనియా కోపం ఎందుకంటే? అది.. 1999వ సంవత్సరం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా, అంతకుముందు పీవీ నరసింహారావు కేబినెట్‌లో రక్ష ణ మంత్రిగా కూడా పనిచేసిన శరద్‌పవార్.. ఎలాగైనా పీవీ తర్వాత ప్రధాని పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరారు. కానీ, పార్టీలోని ఇతర పెద్దలంతా కలిసి సోనియాగాంధీని ఆ పదవిలో కూర్చోబెట్టాలని భావించారు. దాంతో పవార్ ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. పీఏ సంగ్మా, తారిక్ అన్వర్‌లతో కలిసి.. ఒక విదేశీ మహిళకు ప్రధాని పదవి ఎలా ఇస్తారన్న వాదన లేవనెత్తారు. దీంతో పవార్, అన్వర్‌లతో పాటు సంగ్మా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఐదేళ్ల త ర్వాత.. అంటే 2004లో పవార్ కాస్తా మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. సంగ్మా తర్వాతి కాలంలో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీలో తన వర్గాన్ని కలిపి.. నేషనలిస్ట్ తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత 2005 అక్టోబర్ 10న లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, మళ్లీ 2006 ఫిబ్రవరిలో ఎన్‌సీపీ అభ్యర్థిగా గెలిచారు.
రాష్ర్టపతి పదవిని అధిష్ఠిం చాలని తాను ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రకటించినందుకు సంగ్మాను ఇంతకుముందు ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మందలించారు. యూపీఏ ‘సమష్టి నిర్ణయానికి’ తన పార్టీ నిబద్ధమై ఉంటుందని పవార్ తెలియజేశారు. అయినా, రాష్ర్టపతి పదవికి సొంత అభ్యర్థిని నిలబెట్టడానికి తనకు తగినంత సంఖ్యాబలం లేదని, ముందు కాంగ్రెస్ తమ అభ్యర్థి పేరును ప్రకటించేంత వరకు వేచి ఉంటామని ఎన్‌సిపి తెలియజేసింది. కరత్‌ను కలుసుకున్న సంగ్మా: ఇది ఇలా ఉండగా, రాష్ర్టపతి పదవికి తన అభ్యర్థిత్వానికి మద్దతు సమీకరించే ప్రక్రియలో భాగంగా సంగ్మా సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్‌ను కలుసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more