రాష్ట్రంలో జరిగిన 18 నియోజకవర్గల ఉపఎన్నికలలో ..సిఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని టిడిపి నాయకులు అంటున్నారు. సిఎం కిరణ్ కుమార్ ఒక పథకం ప్రకారమే టిడిపి దెబ్బతీసినట్లు తెలుగు దేశం నాయకులు అంటున్నారు. కొన్ని నియోజక వర్గాలలో .. కాంగ్రెస్ పార్టీ , టిడిపి పార్టీలు ములఖత్ అయినప్పటికి .. టిడిపి ఓటమి పాలైంది. కాంగ్రెస్ కు మూడోస్థానం రావటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి . సీఎం కిరణ్ కుమార్ తన రెడ్డి వర్గానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి గా రెడ్డి వర్గం వారే ఉండాలి అనే విధంగా సీఎం ఉప ఎన్నికల్లో వ్యవహరించినట్లు తెలుస్తుంది. అందువలన వైఎస్ఆర్ జగన్ పార్టీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిందని టీడీపీ నాయకులు అంటన్నారు.
ఆంద్రప్రదేశ్ సీఎం పదవి ఎప్పటికి రెడ్డి వర్గం వారే ఉండాలి అనే విధంగా కిరణ్ పథకం వేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం సొమ్ము తింటే రెడ్డి వర్గం వారే తినాలి? చంద్రబాబు తినకూడదు? అనే విధంగా జగన్ పార్టీ కోసం సిఎం కిరణ్ కాంగ్రెస్ స్థానాలు వదులుకున్నట్లు టీడీపీ నాయకులు అంటున్నారు. అందువలన టీడీపీ ఓటిమి పాలైందని పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గానీ గట్టి పోటి ఇచ్చి ఉంటే .. తప్పకుండా టిడిపి గెలిచి ఉండేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందనుకొన్న కాం గ్రెస్ చివరకు వచ్చేసరికి నీరుగారిపోవడం టీడీపీ కొంప ముంచిందని గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అంతకు ముందు ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ 64వేల ఓట్లు వస్తే.. ఈ ఉప ఎన్నికల్లో 71వేలకు పెరిగిందని..
గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు పోలైన ఓట్లలో అధిక శాతం ఈసారి జగన్ పార్టీకి వెళ్లిపోవడంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయని 'దేశం' నేతలు వివరించారురెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పట్టుదల కమ్మ సామాజిక వర్గంలో కనిపించడం లేదని, ప్రత్తిపాడులో ఈ వర్గంవారు అంత బలమైన పట్టుదలతో పనిచేయలేదని స్థానిక నేత వ్యాఖ్యానించారు. 'ఈ ఉప ఎన్నికల్లో ఫలితాలు శాశ్వతం కాదు. పొంగు మాదిరిగా వచ్చా యి. వేడి తగ్గగానే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. సిఎం కిరణ్ తన రెడ్డి వర్గానికి పీఠం వేసినట్లు టీడీపీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more