కాంగ్రెస్ లో విలీనమైన ప్రరాపా వర్గంతో కింది స్థాయిలో సరైన రీతిలో సమన్వయం చేసుకోకపోవటం ఉప ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణమని మాజీ ప్రరాపా నాయకులు అంటున్నారు. సమన్వయమున్న రామచంద్రపురం, నరసాపురంల్లో విజయం సాధ్యమైందని మిగిలిన చోట్లా అలాగే ఉంటే మరికొన్ని చోట్లా గెలుపు సాధ్యమయ్యేదని అభిప్రాయపడుతున్నారు. కొత్త ఎమ్మెల్యేలు కొత్త పల్లి సుబ్బరాయుడు, తోట త్రిమూర్తులు రాజ్య సభ సభ్యుడు చిరంజీవిని కలిసి వివరించినట్లు తెలుస్తుంది.
ప్రరాపా యంత్రాంగాన్ని కాంగ్రెస్ నాయకులు సరైన రీతిలో సమన్వయం చేసుకుని పోవటంలేదని వారు అంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్ లోకి రావడంతో వివిధ వర్గాలు, అభిమానులు, అన్నింటికీ మించి బలమైన సామాజిక వర్గం అండదండలు లభించినా దానిని స్వదినియోగం చేసుకోవటంలో కాంగ్రెస్ నేతలు విషలమయ్యారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రాయలసీమ లో ఒక వర్గం వైకాపా తో నడిచే పరిస్థితి ఉన్నప్పుడు చిరంజీవి రాకతో లభించిన మరో వర్గం అండదండల్ని సంపూర్ణంగా ఉపయోగించుకునేలా కాంగ్రెస్ వ్యవహరించలేకపోయిందని ప్రరాపా నాయకులు అంటున్నారు. రాజం పేట అనంతపురం , రాయచోటిల్లో అభ్యర్థుల ఎంపికే దీనికి ఉదాహరణ అని వారు అంటున్నారు. రాయలసీమలో ఏడు జనరల్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే తెదేపా నాలుగింటిలో ఆ వర్గానికి అవకాశమిచ్చిందని గుర్తు చేస్తూ.. ఆ వర్గం ఓట్లు కొంత మేర తెదేపాకి పోల్ కావటంతో కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని తెలిపారు. అందుకే ధరావతు కోల్పోయిన స్థితి ఏర్పడిందన్న భావన నెలకొందని వారు అంటున్నారు. కొంత మంది నాయకులు ప్రరాపా విలీనమైన ఫలితం లేకపోయిందన్న వ్యాఖ్యలు వినిపించటంతో.. ఆ పార్టీ నాయకులు వివరణ ఇవ్వటం జరిగింది. ప్రరాపా , కాంగ్రెస్ శ్రేణుల మధ్య చక్కటి సమన్వయం ఉండటం వలన సుబ్బరాయుడు, తోట త్రిమూర్తులు విజయం సాధించిన విషయం గుర్తు చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more