సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణపై జగన్ శిబిరం చేస్తున్న మానసిక యుద్దం కొత్త మలుపు తిరగనుంది. లక్ష్మీనారాయణ దూకుడుకు బ్రేకులు వేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాల్ షీటుతో జేడీపై యుద్దం చేస్తున్న అతని పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజాగా కొత్త అస్త్రాన్ని తీస్తున్నారట. అసలు చంద్రబాల కాల్ లిస్టు సేకరణ వెనుక కుట్ర కోణం బయటపడుతోంది. సంబంధాలు అంటగట్టి వ్యక్తి గతంగా టార్గెట్ చేయడానికి కాల్ లిస్టును అక్రమంగా తీసుకున్నారన్న వ్యవహారం వెలుగులోకి వస్తోంది. వాసిరెడ్డి చంద్రబాల కాల్ లిస్టు వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది. వైఎస్ఆర్ సీపీ నేతల ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన ఈ కాల్ లిస్టు సేకరణ వెనుక పెద్ద కుట్ర ఉందన్న వాస్తవం బయటపడుతోంది.
లక్ష్మీనారాయణ సీబీఐ జాయింట్ డైరెక్టర్ కాదట.. ఆడవాళ్లను వేధించే పోకిరి, వాసిరెడ్డి చంద్రబాల , ఈమె ఐబీఎం ఉద్యోగి కాదట. ఆమె ఒక పూలన్ దేవి గా మార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంతేకాదండోయ్ ఆయనను.. ఈవ్ టీజర్గా మార్చేశారు, చంద్రబాలను దోపీడీ దొంగల ముఠాలో కలిపేశారు. ఆ విధంగా జే గ్యాంగ్ కాల్ లిస్ట్ లను సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే వైఎస్ జగన్ అడ్డదారులు తొక్కి.. పైగా నాకేటి సిగ్గు అంటూ అడ్డగోలు వాదనలు చేశారు జగన్ పార్టీ నాయకులు. ఓ గొప్పింటి మహిళకు ఫోన్ వేధింపులు వస్తున్నాయి. బాగా ఇబ్బంది పెడుతున్నాడు. కొంచెం కాల్ లిస్ట్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి అంటూ జేడీ లక్ష్మీనారాయణ నెంబర్ ఇచ్చారు జగన్ పార్టీ నాయకులు. జేడీ ఫోన్ కాల్ లిస్ట్ లో చంద్రబాల నెంబర్ ఎక్కువగా కనిపించడంతో.. దాని ఆదారంగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు జగన్ వర్గం ప్రయత్నించింది. ఇందులో భాగంగా జగన్ మీడియాకు చెందిన ఒక విలేకరి రంగంలోకి దిగాడు. తనకు బాగా తెలిసిన నాచారం ఎసై శ్రీనివాసరావును ఆశ్రయించాడు. జగన్ అక్రమాలస్తుల కేసులో విచారణ జరుగుతున్న సమయంలో ఆయన మీడియా నుంచి కాల్ లిస్ట్ కోసం అనధికార, అభ్యర్థన వచ్చినప్పటికీ ఎసై ఏ మాత్రం అనుమానం రాలేదట. ఆ రోజే ఒక హైవే దోపీడీ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీంతో జగన్ మీడియా విలేకరి ఇచ్చిన చంద్రబాల నెంబర్ ను కూడా దొంగల ముఠా సభ్యుల ఫోన్ నెంబర్లలో కలిపి వివరాలు కావాలంటూ డీసీపీ అనుమతి కోరి... సర్వీస్ ప్రొవైడర్ నుంచి జాబితా సంపాదించటం జరిగిందట.
చంద్రబాల కాల్ లిస్టు ఈ-మెయిల్ ద్వారా నాచారం స్టేషన్ ఆదేశాల మేరకు అదే మెయిల్ ఐడీ నుంచి జగన్ మీడియా విలేకరికి స్టేషన్ రైటర్ ఫార్వర్డ్ చేశారట. ఈ తర్వాత చంద్రబాల కాల్ లిస్ట్ ఆధారంగా జగన్ పార్టీ నేతలు, ఆయన మీడియా చేసిన రాద్దాంతం అందరికీ తెలిసిందే. జగన్ గ్యాంగ్ కుట్ర కు తాను పావులా ఉపయోగపడిన సగంతి తెలుసుకున్న ఇన్ స్పెక్టర్ మొత్తం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయటం జరిగిందట. జగన్ గ్యాంగ్ చేసిన మాయలు ఇలా ఉంటాయని .. ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more