కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం పై కొత్త పథకం వేస్తుంది. రాష్ట్ర ప్రజలను జగన్ వైపు నుండి తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు కొత్త మార్గాలను వెతుకుంతుంది. కొత్త పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల ముందుకు వెళ్లాటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకు పార్టీ నాయకులను సిద్దంగా ఉండమని చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగయ్యేందుకు కారణభూతుడిగా భావిస్తున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముద్రను ఎంత త్వరగా వదిలించు కుంటే పార్టీకి అంత మేలని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ధర్మాన కమిటీ సభ్యులు కూడా దాదాపు అలాంటి అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మంత్రి ఆనం నివాసంలో భేటీ అయిన ధర్మాన కమిటీ... రాష్ట్రంలో పార్టీ బతికి బట్ట కట్టేందుకు కావలసిన ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది. అందులో భాగంగా.. పేద, మధ్య, తరగతి వర్గాల ప్రజలకు చేరువయ్యే కొత్త పథకాలపై దృష్టి సారించాలని నిర్ణయించింది. ఆ మేరకు దానిని చర్చించి, ఎంత త్వరలో కొత్త పథకాలు ప్రారంభిస్తే పార్టీకి అంత మంచిదని భావించింది.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో భేటీ అయిన ధర్మాన కమిటీ పార్టీ-ప్రభుత్వ స్థితిగతులు, పరిష్కార-ప్రత్యమ్నాయ మార్గాలపై సుదీర్ఘంగా చర్చించింది. ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ వైఎస్ పథకాలన్న ముద్ర క్షేత్రస్థాయిలో బలపడటం వల్ల అదంతా వైఎస్ కొడుకు జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళుతున్నాయన్న వాస్తవం ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలతో స్పష్టమయినందున.. అంతకంటే మించి ప్రజాదరణ చూరగొనే సరికొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై దృష్టిసారించాలని ప్రభుత్వానికి ధర్మాన కమిటీ సూచించనుంది. దీనిపై కమిటీలో ఏకాభిప్రాయం వ్యక్తమయింది. దానితోపాటు.. వైఎస్ తమ పార్టీ నాయకుడేనని ప్రచారం చేయాలని, ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీవేనని చాటడం ద్వారా ప్రజల ఆలోచనా విధానంలో కొంత మేరకు మార్పు చేయాలని నిర్ణయించింది. కొత్త పథకాలు వైఎస్‌ను పూర్తిగా మర్చిపోయేలా ఉండాలని, ఆ రకంగా క్రమంగా వైఎస్ పేరును తెరమరుగు చేయాలన్నది ధర్మాన కమిటీ ఆలోచనగా కనిపిస్తోంది. అదే సమయంలో వైఎస్‌ను పూర్తిగా వదులుకోకుండా, ‘వైఎస్ మా వాడే’నని ప్రచారం చేయడం ద్వారా, కనీసం 30 శాతం మందినయినా తన వైపు మళ్లించుకోవచ్చని భావిస్తోంది.
జనామోదం పొందిన వైఎస్ పథకాల కంటే ఇంకా వేగంగా జనంలోకి వెళ్లే కొత్త పథకాలను త్వరగా రూపొందించాలని ధర్మాన కమిటీ సర్కారుకు సూచించనుంది. సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేనందున, కొత్త పథకాలు శరవేగంగా జనంలోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రికి తన తొలి మధ్యంతర నివేదికలో సూచించాలని నిర్ణయించింది. కొత్త పథకాలతో పాటు, ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా జనంలోకి తీసుకువెళ్లేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆదర్శరైతులు, రేషన్‌షాపు డీలర్ల సేవలను వీలయినంత ఎక్కువగా వినియోగించుకోవాలని ధర్మాన కమిటీ నిర్ణయించింది. ఇటీవలి ఉప ఎన్నికలతో పాటు.. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ పార్టీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో, బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలు పార్టీకి దూరమయ్యారని ధర్మాన కమిటీ గ్రహించింది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు ఏ కారణంతో పార్టీకి దూరమవుతున్నారన్న అంశంపై అధ్యయనం చేసి, ఆ మేరకు ప్రత్యామ్నాయ మార్గాలను సర్కారుకు సూచించాలని నిర్ణయించింది. కులాలు, మతాల వారీగా ఓటు బ్యాంకుపై దృష్టి సారించేందుకు ప్రభుత్వం-పార్టీకి కొన్ని సిఫార్సులు చేయనుంది. వారికి ఏయే పథకాలు రూపొందిస్తే వారంతా పార్టీ వైపు మళ్లుతారన్న అంశంపై సీరియస్‌గా దృష్టి సారించనుంది. ప్రధానంగా పార్టీకి శాశ్వత ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు దూరం అవడం ఆందోళన కలిగిస్తోంది. దానికోసం ప్రతి నియోజకవర్గంలోనూ బూత్‌ల వారీగా, కులాల వారీగా పార్టీ పక్షాన ఒక సర్వే నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమయింది. పార్టీని గ్రామస్థాయిలో పటిష్ఠం చేయాలని, బూత్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీపై దృష్టి సారించడం ద్వారా, కింది స్ధాయి నుంచే పార్టీలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించింది.
జగన్ పార్టీ వైపు పెరుగుతున్న వలసను నియంత్రించక పోతే భవిష్యత్తులో పార్టీ ఇంకా భారీగా నష్టపోవలసి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమయింది. అసలు కాంగ్రెస్ శ్రేణులు ఎందుకు జగన్ వైపు వెళుతున్నారన్న అంశంపై సీరియస్‌గా దృష్టి సారించకపోతే వలసల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్నారు. దానికోసం క్షేత్రస్దాయిలో వాస్తవాలు తెలుసుకుని, దానికి ప్రత్నామ్నాయ మార్గాలను పార్టీకి సూచించాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవులపై శ్రేణుల్లో చాలాకాలం నుంచీ అసంతృప్తి ఉందని, దానిని తొలగించడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ధర్మాన కమిటీ యోచిస్తోంది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ధర్మాన కమిటీ అభిప్రాయపడింది. దానిపై చర్చ జరిగింది. గెలుపు, ఓటములను పక్కకుపెడితే, కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలకు అవకాశాలు దక్కడంతో పాటు, రిజర్వేషన్ల వల్ల బడుగు బలహీన వర్గాల నాయకత్వం పటిష్టపడుతుందని అభిప్రాయపడ్డారు. దానితోపాటు.. సొంత పార్టీలో ఎవరున్నారు? జగన్ వైపు భవిష్యత్తులో ఎవరు ఉంటారన్న దానిపై ఒక స్పష్టత లభిస్తుందని, ప్రధానంగా.. జయాపజయాల ఆధారంగా ఓడిన ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశం లభిస్తుందని విశ్లేషించారు. ఎన్నికల అంశం కోర్టులో ఉన్నందున, దానిపై అధికారులతో మాట్లాడి 9న జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more