తెలుగుదేశం అధినేత , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వస్తున్నా మీ కోసం పేరుతో వంద రోజులకు పైగా భారీ పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాబు వయస్సు అరవై సంవత్సరాల పై మాటే. ఈ వయస్సులో కూడా ఎంతో ధైర్యం చేసి బాబు పాదయాత్ర చేపట్టాడు. రోజుకు 15 నుండి 20 కిలోమీటర్ల పైనే నడుస్తున్న బాబుకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాడు. బాబు పాదయాత్ర గడుస్తున్న కొద్ది ఆయన ఆరోగ్య స్థితి పై భిన్న కథనాలు వస్తున్నాయి. బాబుకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆయన నడకలో రోజు రోజుకు వేగం తగ్గుతుందని, ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్ర పూర్తి చేస్తున్నాడా ? లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు బాబుకు మహబూబ్ నగర్ లో స్టేజి కూలి నడుంకి గాయాలు అయ్యాయి. డాక్టర్లు కూడా విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. అయినప్పట్టికీ చంద్రబాబు పట్టుదలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇదే ప్రకారం సాగించగలరా?లేక మధ్యలో విరమించవలసిన పరిస్థితి వస్తుందా అన్నది అప్పుడే చెప్పలేం. ఒకవేళ విరమించవలసి వస్తే చివరి వెయ్యి కిలోమీటర్లు ఆయన కుమారుడు లోకేష్ యాత్రను కొనసాగించే అవకాశం ఉందా అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఎప్పటి నుండో ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేష్ ని తీసుకు రావాలనుకుంటున్న బాబు ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు. అయితే ఇవన్ని అనవసర ఊహాగానాలేనని, చంద్రబాబు నాయుడు పాదయాత్ర పూర్తి చేసి తీరతారని టిడిపి నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more