వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జైల్లో నుండే తన రాజకీయాల్ని నడుతున్నాడని తెలుస్తుంది. అతను జైల్లో ఉన్నా 2014 ఎన్నికల కొసం అక్కడి నుండే వ్యూహాలు రచిస్తున్నాడని అంటున్నారు. అతని వ్యూహంలో భాగంగానే ఇతర పార్టీ నేతల పై తన ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని అమలు చేస్తున్నాడని అంటున్నారు. 2014 ఎన్నికలలో గెలవాలంటే... అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందు కు ఆ సామాజిక వర్గం నేతలకు గాలం వేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నుండి చాలా మంది నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జగన్ కి రెడ్డి వర్గం బలం ఎలాగు ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆకర్షిస్తే గెలుపు ఖాయం అని భావించి అతను ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు. సామాజిక న్యాయం చేస్తానంటూ రాజకీయాల్లో కి వచ్చి తన కాపు వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ద్వారా 18 శాతం ఓట్లు సాధించిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి రెడ్ కార్పెట్ పరుస్తుంది. కాపు వర్గానికి చెందిన చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నాడు. మరి ఆ వర్గం ఓట్లు తనవైపుకు తిప్పుకోవడానికి కాపు వర్గానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన దాసరి నారాయణ రావు పై తన ఆకర్ష్ అస్ర్తాన్ని ప్రయోగించినట్లు రాజకీయ వర్గాల సమాచారం.
ఈ విషయం పై జగన్ ఆయన మామ అయిన వై.వి. సుబ్బారెడ్డితో చర్చలు కూడా జరిపించినట్లు వార్తలు. దాసరి కూడా కాంగ్రెస్ పార్టీ పై కాస్తంత అసం త్రుప్తితో ఉండటంతో వైయస్సార్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాడట. త్వరలో తన అనుచర గనంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నారు . దాసరి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరితే.... గోదావరి జిల్లాలతో పాటు, క్రిష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన కాపు వర్గాన్ని ఆకట్టుకోవచ్చని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కాపు వర్గానికి చెందిన వంగవీటి రాధాక్రిష్ణను వైయస్సార్ కాంగ్రెస్ లోకి లాక్కున్నారు. ఇక దాసరి కూడా వస్తే మరింత బలం చేకూరుతుందని ఆయన భావిస్తున్నాడు. మొత్తానికి జగన్ కాపు వర్గాన్ని చేజారకుండా ముఖ్యనేతలను తెరపైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నాడు. మరి ఏ మేరకు జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more