రోజు రోజుకీ పెరిగిపోతున్న ప్రయాణికులు... ఆటో చార్జీలు ఆకాశాన్ని అంటడం, ఇతర నిత్యావసర వస్తువులు అమాంతం పెరుగడం, పెట్రోల్ ధరల భగ భగలు, మెట్రో రైళ్ళు కూడా అంతగా అందుబాటులో లేకపోవడం, కారణం ఏదైతేనేం, ఆర్. టీ.సీ. కి ఏంతొ గిరాకి. అసలు కొన్ని ప్రాంతాలకైతే, వేసే బస్సలు తక్కువ, ప్రయానికుల సంఖ్య ఎక్కువ. ఆరు నెలల క్రితమే, ఆర్. టీ.సీ. లాభాల్లో ఉందని ప్రకటించింది యాజమాన్యం...
అయితే, అంటా హుళక్కే. లాభాల మాట అటుంచితే, ప్రస్తుతం ఆర్. టీ.సీ. నష్టాలలో ఉంది. ఈ నష్టాలని పూడ్చడానికే, ఆర్. టీ.సీ. అధికారులు, ఒక ప్రణాళిక వేసారు. అదే, ప్రతీ ప్రయానికుడికి సర్ చార్జీ 50 పైసలు పెంచడం. ఆర్. టీ.సీ. లాభాల బాట పట్టడానికి, ప్రయానికుడే పావు అయ్యాడు. ఈ సర్ చార్జీ కేవలం బస్సు లో ప్రయాణించే వారికే కాదు... బస్సు స్టాండ్ కి వచ్చి ప్లాట్ఫారం టికెట్ కొనే చర్జీలలో కూడా పెరుగుదల జరుగబోతోందట. ఒక్క సారి ప్రభుత్వం ఆదేశం అనుకూలంగా వస్తే చాలు. ఇక ఈ సర్ చార్జీల భూతం అమలు అయిపోతుంది.
ఆర్. టీ.సీ. దాదాపు 4, 000 కోట్లకు పైగా, అప్పుల ఓబిలో కూరుకుపోయిది. ప్రతీ సంవత్సరం, ఇతర ప్రయివేటు సంస్థలకే, వడ్డీ కిందనే, 100 కోట్ల వరకు చెల్లిస్తోంది. లాభాల మాట అటుంచితే, ప్రతీ నెల, ఆర్. టీ.సీ.లో పని చేసే వారి జీతాలు చెల్లించడానికే అదనంగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మొన్న ఈ మధ్యనే టికెట్ చార్జీలు పెంచడం, ఇప్పుడు ఈ సర్ చార్జీల పెంపకం. అయితే, ఈ కారణాల తో పాటు, సర్ చార్జీల పెంపకం వెనుక ఆర్. టీ.సీ. యాజమాన్యం, ఇంకో కొన్ని కారణాలు కూడా చెప్తోంది... ఆర్. టీ.సీ.కి చెందిన అనేక స్థలాలు తాకట్టు లో ఉండటం. బస్సు స్టేషన్ లో కనీస వసతులు కూడా కల్పించకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, ఇవన్నీ కూడా, నిధులు లేకపోవడం వల్లే అని.
కనీసం, ఈ టికెట్ ధరలు, సర్ చార్జీల పెంపకం వల్ల అయినా, ఆర్. టీ.సీ. యాజమాన్యం జీతాలు, మరికొన్ని బస్సులు వెయ్యడానికి ఆర్ధికంగా వెసులుబాటు, బస్సు స్టేషన్లలో కనీస వసతులు కలిపించాలని, ఆర్. టీ.సీ. అధికారులు ఆలోచిస్తున్నారు.మరిక ఈ ప్రణాళిక ఎంతవరకు సఫలం అవుతుందో, ఆర్. టీ.సీ. లాభాల బాట పడకపోయినా, కనీస నష్టాలు పూడ్చుకుంటుందో లేదో, వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more