కేవలం యువతరం మాత్రమె కాదు, అన్ని వయస్సుల వారు 'ఫేస్ బుక్' కి దాసోహం అయిపోయారు... తమ మదిలో మెదిలే అతి చిన్న ఆలోచన దగ్గరినుండి, తమ జీవితంలో జరిగే సంఘటనలు, వాటి తాలూకు స్మ్రుతులుగా బంధించిన ఫోటోలు, ఒక్కటేమిటి, 'ఫేస్ బుక్' లో పోస్టింగ్ కి ప్రతీది ఓకే... అటు సినిమా తారల నుండి, ఇటు ప్రముఖుల వరకు, 'ఫేస్ బుక్' లో ఏంతో మంది ఎకౌంటు క్రియేట్ చేసి, తెలిసిన - కొత్తవారిని కూడా స్నేహితుల జాబితాలో యాడ్ చేసుకుని, అందరిని కలుపుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఇదే సరదా కొంతమంది రాజకీయ నాయకుల పాలిట శాపంగా మారింది.
కొంతమంది ఆకతాయిలు రాష్ట్ర హోం శాఖ మంత్రి సబితా ఇందిరా రెడ్డి దగ్గరినుండి, చంద్రబాబు, కే. సి. ఆర్., బొత్స సత్యనారాయణ, మంత్రి డి. కే. అరుణ వంటి ఏంతో మంది రాజకీయ నాయకుల వివరాలు సేకరించి, 'ఫేస్ బుక్' లో వారి పేరిట ఫేక్ ఆకవుంట్లు క్రియేట్ చేసి, ఎప్పటికప్పుడు ఈ నాయకుల దిన చర్యని, అప్డేట్ చేస్తూఉన్నారు..సామాన్యులకేం ? ప్రముఖుల ఎకౌంటు 'ఫేస్ బుక్'లో చూడగానే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపుతారు, ఇటువంటి ప్రముఖులు తమను ఫ్రెండ్స్ లిస్టులో యాడ్ చేసుకున్నారు అని తెలియగానే ఉబ్బి తబ్బిపోయి, రోజువారి మెసెజ్ ల దగ్గరినుండి, తాము ఎదురుకొంటున్న సమస్యల వరకు పోస్ట్ చేస్తారు.
అయితే ఇక్కడే ఉంది అసలు విషయం..ఇవి ఫేక్ ఆకవుంట్లు కావడం వల్ల, ఆయా అధికారులకు సామాన్యుల మెసేజ్ లు చేరే అవకాశమే లేదు కాబట్టి, వారు స్పందించరు.. ఇక సామాన్యులకు అధికారులంటే చిన్న చూపు ఏర్పడుతోంది. ఇక లాభం లేదు అని, పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. 'ఫేస్ బుక్' అకౌవుంట్లు క్రియేట్ చేసే వారి ఐ.పీ. అడ్రస్ఆధారంగా, వారిని పట్టుకుని, తగిన చర్యలు తీసుకుంటాం అని చెబుతున్నారు. అయితే, ఇవుతల కొంతమంది అధికారులు మాత్రం, వారి పేరు పై ఫేక్ ఆకవుంట్లు క్రియేట్ చేసారు అని తెలిసినా ఏమి పట్టనట్టే ఉంటున్నారు. ఆకతాయిలు, ఈ అధికారుల పేరిట ఉన్న ఆకవుంట్లను ఎటువంటి విధంగా దుర్వినియోగం చెయ్యక ముందే, సంబందీత అధికారులు మేలుకుంటే మంచిదని ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more