ర్యాగింగ్... ఏ యింజినీరింగ్ లేదా మెడికల్ కళాశాలలో కాదు... ఇది ఒక ఇంటర్ కళాశాలలో జరిగిన ఉదంతం... హైదరాబాద్, అమీర్ పేట్ లోని ఒక పేరు మోసిన ఇంటర్ కళాశాలలో, సీనియర్ యింటర్ విద్యార్ధులు, యింటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని, ర్యాగింగ్ పేరిట వేధిస్తూ, ఎట్టకేలకు, పోలీసుల చేతుల్లో చీవాట్లు తిన్నారు.అమీర్స పెట్ లోని ఒక కలాసాల లో యింటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సదరు విద్యార్ధి ని, కొంత మంది సీనియర్ యింటర్ విద్యార్ధులు, గతకొద్ది కాలంగా ర్యాగింగ్ పేరిట వేధిస్తూ, తాము చెప్పినదల్లా వినాలని ఒత్తిడి చేస్తూ, తమ మాటలతో, చేతలతో కూడా వేధింపులకు గురి చేస్తున్నారు... బాధిత విద్యార్ధి తల్లి తండ్రులు, ఈ సీనియర్ ఇంటర్ చదువుతున్న, ర్యాగింగ్ కు పాలుపడుతున్న విద్యార్ధుల తల్లి తండ్రులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోయింది...
ఈ సమయం లో, ఆదివారం, బాధిత విద్యార్ధిని, కినెమ్యాక్స్ కు రమ్మని, సీనియర్స్ ఒత్తిడి చేసారు... అతడు అక్కడికి చేరుకున్న తరువాత, అతడిని కొట్టడం మొదలుపెట్టారు... ఆక్కడినుంది తప్పించుకున్న బాధితుడు, తమ తల్లి తండ్రులకు విషయం వెల్లడించగా, వారు, బంజారా హిల్స్ ఠాణా లో ఫిర్యాదు చేసారు...ర్యాగింగ్ కు పాలుపడ్డ విధ్యార్దులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తుండగా, ఈ విద్యార్ధుల తల్లి తండ్రులు, పోలీసు స్టేషన్ కు చేరుకొని, పోలీసులని, బాధిత విద్యార్ధి తల్లి తండ్రులని బతిమాలారు. ఇలాంటి తప్పు, తమ పిల్లలు ఇంకెప్పుడు చెయ్యకుండా చూసుకునే బాధ్యతా తమదే అని, ఈ ఒక్కసారికి కేసు నమోదు చెయ్యవద్దని బతిమాలి, కేసు నమోదు కానివ్వకుండా చూసుకున్నారు...ర్యాగింగ్ కు పాలుపడ్డ విద్యార్ధులని, వారి తల్లి తండ్రులని, పోలీసులు తీవ్రంగా మందలించి, హెచ్చరించి పంపివేశారు...ర్యాగింగ్ భూతం ఏ ఒక్క ఇంజినీరింగ్ లేదా మెడికల్ కలాసాలకి సొంతం కాదని, ఈ భూతాన్ని అరికట్టే దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటన మరొక్కసారి రుజువు చేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more