రాష్ట్రంలోను, అటు పార్టీలోను తన కిరణాలను బలపరుచుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన హవా మళ్లీ చూపించారు. తనలో ఉన్న కఠినమైన స్వభవం ఏమిటో ఉగ్రవాదులకు రుచి చూపించారు. కరుడు గట్టిన ఉగ్రవాదుల పాలిట మండే సూర్యుడై వారికి చుక్కలు చూపిస్తున్నారు సీఎం కిరణ్. ఉగ్రవాది సయ్యద్ మక్బూల్కు 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన క్షమాభిక్ష పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల హైదరబాద్ నగరంలో జరిగిన జంట బాంబు పేలుడు విషయంలో నిందితుడిగా ఉన్న సయ్యద్ మక్బూల్ పై ముఖ్యమంత్రి కిరణ్ తన కఠిన నిర్ణయం ఘాటుగా చెప్పటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మక్బూల్ కు వైఎస్ క్షమాభిక్ష ప్రకటించడంపై అప్పట్లో నే తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. నిజానికి దీనికి సంబంధించిన జీఓ 338, హోం డేటెడ్ 24-7-2009 రెమిషన్ కోసం మార్గదర్శకాలు రూపొందించేందుకు వైఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత వచ్చిన సీఎం రోశయ్య కూడా మక్బూల్ క్షమాభిక్షను యథాతథంగా అమలు చేశారు. ఇప్పడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సర్వత్రా, రాజకీయాలు , మతాలకు అతీతంగా హర్షం వ్యక్తమవుతోంది. కిరణ్ కుమార్ తీసుకున్న నిర్ణయంతో ఆయన ఇమేజ్ తో పాటు, పార్టీ –ప్రభుత్వ ఇమేజ్ కూడా ఆకాశమంత పెరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సాహసం కావాలి. అందరికీ సాధ్యం కాదని, కిరణ్ కే సాధ్యమన్న విషయం మరోసారి రుజవయింది. మక్బూల్ కు వైఎస్ క్షమాభిక్ష ప్రకటించారని తెలుసుకున్న కిరణ్ ఆ ఫైలు , ఉత్తర్వులను తెప్పించి, ఆధ్యయనం చేశారు. ఒకవైపు దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఎన్ ఐ ఏ విచారణ చేస్తున్న సమయంలోనే కిరణ్ మక్బూల్ కు సంబంధించిన ఫైలును తిరగతోడి, వైఎస్ ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేసి, ఆ ఫైలును హుటా హుటిన గవర్నర్ కు పంపించి కీలక అంశాలలో తన పట్టుదల , చిత్తశుద్ది ఏమిటో మరోసారి కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించుకున్నారు. ఎవరి మాట వినని సీతయ్యగా హైకమాండ్ వద్ద ముద్రపడిన కిరణ్ , తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా తాను అనుకున్నది అమలు చేసి .. రాష్ట్ర ప్రజల చేత శభాష్ సీఎం గా పేరు తెచ్చుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more