నానక్ రామ్ గూడ లో జరిగిన బాదాషా ఆడియో వేడుకలో భాగంగా ఒక విషాదం జరిగిన విషయం తెలిసిందే. ఆడియో వేడుకలో ఓ అభిమాని మరణించటం పై టాలీవుడ్ లో కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన కేవలం జూనియర్ ఎన్టీఆర్ వలనే జరిగిందని సినిమా విశ్లేషాకులు అంటున్నారు. వరంగల్ కు చెందిన రాజు అనే వ్యక్తి మరణంతో ఎన్టీఆర్ అభిమానులు షాక్ తిన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ మరణించిన రాజు కుంటుబానికి అండగా నేనుంటానని మీడియా ముందు చెప్పటం వరకు బాగానే ఉంది. ఎన్టీఆర్ తొందరపడి అలా చెప్పటం వెనుక అర్థం ఏమిటి? ఎన్టీఆర్ వేదిక మీద ఎందుకు బాధపడ్డాడు. సహజంగా ఏ హీరోకైన అభిమానులు రావటం సహజం? బాద్ షా ముందు జరిగిన మిర్చి ఆడియో ఫంక్షన్ కూడా అధిక సంఖ్యలో అభిమానులు వచ్చారు? కానీ అప్పుడు జరగని తొక్కిసలాట ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఎందుకు జరిగింది? అయిదు వేల కంటే ఎక్కువ అభిమానులు ఎలా వచ్చారు? బాద్ షా ఆడియో ఫంక్షన్ కు సుమారుముప్పైవేల మంది అభిమానులు ఎలా వచ్చారు? అభిమానులకు అన్ని పాస్ లు ఎవరు ఇచ్చారు? అభిమానుల చేతిలో పాస్ లున్నప్పటికి .. ఫంక్షన్ హాల్ లోకి ఎందుకు వెళ్లలేకపోయారు? పోలీసులు ఆవేశపడ్డారా? లేక బాద్ షా సినిమా ఆర్గనైజేషన్ తొందరపడిందా? లేక ఎన్టీఆర్ ఆవేశపడ్డరా? అనే ప్రశ్నలు టాలీవుడ్ లో చకర్లు కొడుతున్నాయి. కేవలం జూనియర్ ఎన్టీఆర్ తప్పిదం వలనే ఒక నిండు ప్రాణం పోయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అధిక సంఖ్యలో ఆడియో పాస్ ఇవ్వటంతో ఎక్కువ సంఖ్యలో అభిమానులు రావటం జరిగిందని అభిమాన సంఘాలు అంటున్నాయి.
ఇది కేవలం రాజకీయం కోసమే ఎన్టీఆర్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆడియో ఫంక్షన్ లో నందమూరి కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవటం ఇందుకు నిదర్శనం అని అంటున్నారు ఆయన అభిమానులు. రీసెంట్ గా విజయవాడ వెళ్లిన వచ్చిన ఎన్టీఆర్ బెజవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఎవరు సహకరించలేదు. కేవలం ఎన్టీఆర్ అభిమానుల మద్యనే ఒంటరిగా బెజవాడ యాత్ర ముగించిన విషయం తెలిసింది. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానుల మద్య అనేక విమర్శలు తలెత్తాయి. బాబాయ్ వలనే తనకు నందమూరి అభిమానులు దూరమయ్యారని భావించిన ఎన్టీఆర్ . అందుకు ప్రతీకారంగా తన బలంమెంతో పరోక్షంగా చూపించాలనే ఆవేశంతో.. తన అభిమానులు 30 వేల పాస్ ఇవ్వటం జరిగినట్లు టాలీవుడ్. అభిమాన హీరో సినిమా ఆడియో ఫంక్షన్ కు పాస్ రావటంతో అభిమానులు కష్టపడి ఆడియో వేదిక వద్దకు చేరుకోవటం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్న అభిమానులకు పోలీసుల చేతిలో చుక్కలు కనిపించాయి. ఈ తొక్కిసలాటలోనే రాజు మరణించటం జరిగిందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ ఆవేశపడటం వలనే ఈ సంఘటన జరిగిందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ విషయం గురించి టాలీవుడ్ లో ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. అసలేం జరిగిందే అంతా ఆ పేరుమాళ్ళకే తెలియాలి....
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more