ఇటీవల కాలంలో పీసీసీ అధ్యక్షుడు రవాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏది మాట్లాడిన అది పెద్ద వివాదంగా మారుతున్న విషయం తెలిసిందే. గతంలో తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? అని పలికిన నోటి నుండి.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని .. ఆ ఏడుకొండల స్వామి సాక్షిగా చెప్పటంతో సత్తిబాబుకు శత్రువుల సంఖ్య పెరిగిపోయిందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. అయితే జరగబోయే కాంగ్రెస్ కమిటి పై సమైక్యంద్రలో సెగలు ఎగిసిపడుతున్నా సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ .. ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యే లు రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంలో బొత్స సత్యనారాయణలో దాగిన నిజం బయటపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన రాజీనామాలను సత్తిబాబు తప్పుపట్టారు. తెలంగాణ పై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం చెప్పకుండా నాటకాలాడుతోందని వైసీపీ నాయకుల ఆరోపణలను సత్తిబాబు సీరియస్ గా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అసలు రూపమోంటో మాకు తేలియదంటూ సత్తిబాబు అన్నారు.
తెలంగాణ పై ఏదో ఒక నిర్ణయం చెప్పాలంటే ఎప్పుడో చెప్పేవాళ్లమనీ, తాము రాజకీయ లబ్ది గురించి ఆలోచించలేదని సత్తిబాబు తన మాటల్లో పదును చూపించారు. తెలంగాణ పై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని , కేంద్రం ద్వారా ఆ నిర్ణయాన్ని అమలు పర్చడమే ఇలా ఆలస్యమనీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక పక్క మీటింగులు పెట్టి చెబుతున్నారు. కానీ సత్తిబాబు మాత్రం తెలంగాణ పై జరుగుతున్నఅసలైన నిజాన్ని స్వయంగా చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశంలో తెలంగాణ పై నిర్ణయం వెల్లడైతే, ఆ తర్వాత కేంద్రం ప్రభుత్వానికి ఆ నిర్ణయం తెలియజేయడానికి పెద్ద తతంగమే ఉంటుంది. మామూలుగా అయితే పెద్ద తతంగం అనవసరంగానీ.. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పడానికే నాలుగేళ్లు పట్టింది, ఇక ఆ నిర్ణయం కేంద్రానికి వెళ్ళటానికి ఇంకో 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యంలేదని సత్తిబాబు చెప్పటంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కొత్త అనుమానం మొదలైందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. అసలు ఇవన్నీ కాదూ, అని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంటే.. రాత్రికి రాత్రే తెలంగాణ పై నిర్ణయం చెప్పిన ఆశ్చర్యంలేదని సత్తిబాబు తెలంగాణ పై చిలకపలుకులు పలకటంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అయోమయంలో పడినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more