అవుననే అంటున్న తెలంగాణ ప్రాంత నాయకులు. నిన్నటి కొండా దంపతుల పరువు గంగలో కలిసిపోయిందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు కామెంట్స్ కు కొండా దంపతులు మౌనం పాటించటమే అందుకు నిదర్శనం అని అంటున్నారు. సీమాంద్ర నాయకులు సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చెయ్యటంతో పార్టీ లో ఉన్న అసలు రంగు ఏమిటో బయటపడిందని కొండా సురేఖ అనుచరులు మండిపడుతున్నారు. ఇప్పుడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తెల్చుకోవాటినికి సిద్దమైనట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లొల్లి మొదలైంది. మొన్నటి వరకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని, మళ్లీ జైలుకెళ్ళి వైఎస్ జగన్ తో సంప్రదింపులు జరిగి, చల్లబడిన కొండా సురేఖలో మరోసారి ఫైర్ పుట్టిందని ఆమె అనుచరులు అంటున్నారు. పార్టీలో ఊగిసలాడుతున్న కొండా సురేఖ దంపతులు పార్టీలో తెలంగాణా సెగ రేపారు. పార్టీలోని సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామా ప్రకటనపై కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను, తన భర్త మురళీ ప్రత్యేక తెలంగాణ కోసం పదవులను వదలుకున్నామని ఆమె ఆవేశంగా చెప్పినట్లు సమాచారం. తెలంగాణ వస్తున్న తరుణంలో సీమాంద్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల తెలంగాణలో తాము నష్టపోతామని కొండా సురేఖ దంపతలు తమ బాధలను వైఎస్ విజయమ్మ వద్ద వ్యక్తం చేసినట్లు పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
అయితే ఆమె కొంచెం అనుమానంతో .. ఇది వ్యక్తిగత నిర్ణయమా? పార్టీ నిర్ణయమా అన్నది తెలియటం లేదని సురేఖ మదనపడుతున్నట్లు పార్టీలో సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ విషయంపై నే పార్టీలో ఉండాలా? వద్దా అన్నది తేల్చుకోలేక .. కొండా దంపతులు సతమతమవుతున్నారని.. వైసీపీ కార్యకర్తలు చెప్పకుంటున్నారు. ఈ సమయంలో కొండా సురేఖ వైఎస్ విజయమ్మను కలిసి, తన గోడు వెల్లబోసుకున్నట్లు సమాచారం. వైఎస్ విజయమ్మతో.. కొండా సురేఖ చాలా ఘాటుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలపై సమాధానం చెప్పాలని సురేఖ డిమాండ్ చేసినట్లు వినికిడి. అంతేకాకుండా జవాబు చెప్పకపోతే రెండ్రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని కొండా సురేఖ విజయమ్మకు అల్టిమేటం ఇచ్చినట్లు పార్టీల్లో కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. విజయమ్మ దీనిపై స్పందించాలని లేకపోతే పార్టీని వీడడం ఖాయమనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సీమాంధ్రలో ఉద్యమం పేరుతో రెచ్చగొట్టడం, ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే తాము కూడా పార్టీకి రాజీనామా చేయవలసి ఉంటుందని, రాజీనామా చేసిన నేతలు పార్టీతో మాట్లాడే చేసారో లేదో నాయకత్వం చెప్పాలని కొండా సురేఖ డిమాండ్ చేసినట్లు పార్టీ నాయకులు అంటున్నారు.
మొత్తానికి వైకాపాలో ఈ రాజీనామాలతో తెలంగాణాలో ఆసలు వదులుకున్నట్లే కనబడుతుండగా, కొండా దంపతుల భవిష్యత్ ఇరకాటంలో పడిందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. పార్టీలో ముఖ్యమైన నేతలే రాజీనామాలు చేయగా కొండా దంపతులు ఎవరిని ప్రస్నించాలో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక, వైఎస్సార్సీపీ అధినాయకత్వంతో తమకు విభేదాలున్నాయని కొండా సురేఖ చెప్పటం కొసమెరుపుగా ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఈ విషయంపై కొండా సురేఖ దంపతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? పార్టీ రాజనామాలపై ఎలాంటి ప్రకటన చేస్తుందో? కొండా దంపతులు పార్టీని వీడితే.. వారి రాజకీయ పరిస్థితి ఏమిటి? టీఆర్ఎస్ లో కొండా దంపతులు చెరుతారా? లేక బీజేపికి జై అంటారో? కాంగ్రెస్ పార్టీతో రాజీకుదుర్చుకుంటారో? లేకపోతే రాజకీయ సన్యాశం పుచ్చుకుంటారో అనే అనుమానాలు వైసీపీ లో చకర్లు కొడుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఈ రాజీనామా పోకడలు వైకాపాను ఎటు నడిపిస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more