కొత్త రాష్ట్ర ఏర్పాడుతుందనే ఆనందంలో.. తెలంగాణ నాయకులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రజలు ఉన్నారు. రాష్ట్రం విడిపోతుందనే బాధలో సీమాంద్ర నాయకులు, ప్రజలు, మేథావులు, ఉద్యోగులు ఉన్నారు. అయితే సమైక్యాంద్ర కోసం సీమాంద్ర ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు, 38 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నారు. అదీ కూడా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటి వరకు సీమాంద్ర లో ఎక్కడ .. ప్రభుత్వ ఆస్తులకు, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరగలేదనే విషయం గమనించాలి. సీమాంద్ర ప్రజలను మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. వారికి ఎలాంటి ఆటకం రాదు. వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని తెలంగాణ ప్రాంత నాయకులు మీడియా ముందు ప్రగాల్బలు పలికిన తెలంగాణ నాయకులు, చేస్తున్న తీరు ఏమిటి ఒక్కసారి ఆలోచించుకోవాలనీ రాజకీయ మేథావులు కోరుకుంటున్నారు. సెప్టెంబర్ 7న హైదారబాద్ హై టెన్షన్ అని మీడియాలో ఊకదంపుడు వార్తలు వస్తున్నాయి. ఆ రోజు అంత టెన్షన్ ఎందుకు? ఏం జరుగుతుంది? హైదరాబాద్ లో యుద్దం జరుగుతుందా? రెండు ప్రాంతాల నాయకులు మద్య గొడవలు ఏమైన జరుగుతున్నాయా? అని రాష్ట్రంలోని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలు హై టెన్షన్ ఎందుకు? ఎవరి వల్ల వస్తుంది? అంటే.. మన రాజకీయ నాయకులే ఈ టెన్షన్ ను రేకేత్తిస్తున్నారు. ఎపీ ఎన్జీవోలు సమైక్యాంద్ర కోసం సెప్టెంబర్ 7న ఎల్బీ స్టేడియం లో భారీ సభ నిర్వహిస్తున్నారు.
అయితే ఇప్పడు తెలంగాణ నాయకులు, తెలంగాణ ఎన్జీవోలు, కొంతమంది కుల నాయకులు కలిసి ఎపీ ఎన్జీవోల సభను అడ్డుకోవాలని విఫల ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా.. అదే రోజు శాంతి ర్యాలీ పేరుతో.. భారీ ఎత్తున హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహిస్తామని.. తెలంగాణ ఎన్జీవోలు గోడ పత్రికలు విడుదల చేయటం జరిగింది. ఇలాంటి సందర్భంలో.. ప్రభుత్వం నుండి ఎపీ ఎన్జీవోల సభకు అనుమతి లభించింది. అయితే ఎపీ ఎన్జీవోల సభకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? సీమాంద్ర రాజకీయ నాయకుల అండతోనే ఈ సభ జరుగుతుందని, దీనికి వెనుక సీఎం కుట్ర ఉందని , రాజకీయ నాయకులు, తెలంగాణ ఎన్జీవోలు మీడియా ముందు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ సభలను నిర్వహించినప్పుడు ఎలా అనుమతి ఇచ్చారు? అప్పుడు సీమాంద్ర ప్రజలను, సీమాంద్ర నాయకులను నాయకులను, సీమాంద్ర ఉద్యోగులను ఎవరినైన అడిగి అనుమతి తీసుకొని సభలు నిర్వహించారా? మీరు తెలంగాణ రాష్ట్రం కోసం సభలకు అనుమతి ఎలా తీసుకున్నారో.. అలాగే ఎపీ ఎన్జీవోలు నిర్వహించే సభకు కూడా అనుమతి పొందారు. ఇందులో ఏ రాజకీయ నాయకుడు హస్తంలేదు. కోర్టు ద్వారానే అనుమతి పొందారు. నిజంగా సీమాంద్ర ప్రజల మేలుకొరే తెలంగాణ నాయకులు, తెలంగాణ ఉద్యోగులు, చేస్తున్న శాంతి ర్యాలీ ఎందుకోసం, ఎవరి కోసం? నిజంగా.. శాంతికొరేవారైతే.. సెప్టెంబర్ 7న ఎపీ ఎన్జీవోలు సభకు ఆటకం కలిగించారు.
శాంతి ర్యాలీ పేరుతో అదే రోజు నిర్వహిస్తున్నారు. ఒక్క నిమిషాం ఆలోచించాలి. ఎపీ ఎన్జీవోల సభకు ఆటకం లేకుండా.. సెప్టెంబర్ 8వ తేదీ శాంతి ర్యాలీ జరుపుకోవచ్చు. అప్పుడు హైదరాబాద్ లో హై టెన్షన్ ఉండదు. ఇరుప్రాంతాల ప్రజలకు మంచిది. ఆరోజు అయితే 7వ తేదీన ఎపీ ఎన్జీవోల సభలో మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎపీ ఎన్జీవోలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ ఎన్జీవోలు సమాధానం చెప్పినట్లుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ కొంత మంది రాజకీయ నాయకులు.. తన స్వార్థ ప్రయోజనాల కోసం, తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారు. ఈ విషయం రాజకీయ నాయకులు కలుగజేసుకొని, తెలంగాణ ఉద్యోగులను, తెలంగాణ ప్రజలను శాంతింప చేయ్యవచ్చు. అప్పుడు హైదరాబాద్ లో హై టెన్షన్ ఉండదు. రెండు ప్రాంతాల ఉద్యోగుల మనోభోవాలు అందరికి తెలుస్తాయి. ప్రభుత్వానికి వారదిగా ఉన్న మంత్రి జానారెడ్డి లాంటి నాయకులు ఈ సమస్యను సున్నితమైన మనసుతో ఆలోచించి, సీమాంద్ర ప్రజల ఉద్యమానికి సహకరించాలని ఎపీ ఎన్జీవోలు కోరుకుంటున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ హైదరాబాద్ లో ఏం జరుగుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more