రాజకీయ నాయకులు పదవులు కోసం అడ్డదారులు, గాలిలో పేకమేడలు కడుతుంటారు. ఒట్లు కోసం.. తప్పుడు ప్రకటనలతో ప్రచారం చేసుకుంటారు. మీడియా ముందు గొప్పలకు పోయి.. ఎదుటవారి మీద బురద చల్లే ప్రయాత్నం చేస్తారని విషయం అందరికి తెలిసిందే. రాజకీయ నాయకులు తమ కుర్చీలను కాపాడుకోవటానికి కుట్రలు, కుతంత్రాలు చేసి ఫైకి ఎదుగుతుంటారు. రాజకీయ నాయకులు విషయం పక్కన పెడితే. ప్రతి కులానికి ఒక నాయకుడు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయా కులానికి సంబంధించిన విషయలపై కుల నాయకుడు మీడియా ముందు మాట్లాడటం మనకు తెలిసిందే. అయితే రాజకీయానికి, కులానికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఒక ప్రాంతానికి, కులానికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు. ఆంద్రలో రెడ్డి అంటే.. తెలంగాణలో కూడా రెడ్డి అంటారు. రాయల సీమాలో కమ్మ అంటే.. తెలంగాణ ప్రాంతంలో కూడా కమ్మ అని అంటారు. గుంటూరులో కాపు అంటే.. తెలంగాణలో కాపు అనే అంటారు. ప్రాంతాల వారికి గా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మారిన, వారికి యొక్క కులాలు మారిపోవు అని విషయం అందరికి తెలిసిందే. కులాన్ని అడ్డుపెట్టుకొని, రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకులు మీద, విమర్శలు చేసిన కుల నాయకులు చాలా తక్కువమంది ఉంటారు. కానీ ఆంద్రప్రదేశ్ లో ఎస్సీలు రెండు వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అందులో ఒకటి మాదిగ దండోరా, రెండోది..మాలమహానాడు.
ఈ రెండు కులాల నాయకులు వారికి కుల హక్కుల కోసం గత కొన్ని సంవత్సారాల నుండి ప్రభుత్వం పై పైట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పడు కొత్తగా ఈరెండు కులాల మద్య ప్రాంతాల విభేదం వచ్చినట్లు తెలుస్తోంది. ఒకరు సమైక్యాంద్రకు సపోర్టు చేస్తే.. మరోకరు తెలంగాణకు సపోర్టు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాదిగ దండోర నాయకుడు మందా క్రిష్ణ మాదిగ మరో అడుగు ముందుకేస్తున్నారు. అతను తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కాబట్టి, తెలంగాణ కోరుకోవటం నాయ్యం ఉంది. కానీ ఎపీ ఎన్జీవోలు సెప్టెంబర్ 7వ తేదీన తలపెట్టిన సెవ్ సమైక్యాంద్ర సభకు మందా క్రిష్ణ మాదిగ వద్ద పర్మిషన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పర్మిషన్ తీసుకోని పక్షంలో.. ఎపీ ఎన్జీవోల సభను అడ్డుకుంటామని మందా వార్నింగ్ ఇస్తున్నారు. అసలు మందా క్రిష్ణ మాదిగా ఏ హక్కుతో మాట్లాడుతున్నారు? మందా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతున్నాడా? లేక ఎవరైన రాజకీయ నాయకుడి అండతో మాట్లాడుతున్నాడా? అనే అనుమానం కలుగుతుంది. మందా గత చరిత్ర తీసుకుంటే.. ఆయన తన కుల రిజర్వేషన్ కోసం .. గత కొన్ని సంవత్సరాల నుండి మాలమహానాడు మాలకులం) పై పోరాటం చేస్తూనే ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వంలో మందా క్రిష్ణ మాదిగకు అనుకూలంగా ఉన్నప్పటికి .. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సుప్రీం కోర్టు మందాకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయిన నీ కులం కోసం.. గతంలో..ఆంద్రప్రదేశ్ అన్ని ప్రాంతాలు తిరిగి మీటింగులు పెట్టి, హైదరాబాద్ నగర నడిబోడ్డున మాదిగ దండోర పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం ఎలా మరిచిపోయావు. అప్పుడు నీకో న్యాయం.. ఇప్పుడు ఎపీ ఎన్జీవోలకు ఒక న్యాయమా? ఏమిటి మందా... మాట్లాడే ముందు ఆలోచించవయ్యా.
గతంలో నీవు ఎవరి పర్మిషన్ తీసుకొని అప్పుడు భారీ సభ నిర్వహించావు అనేది ఒక్కసారి చెప్పాలి. చంద్రబాబుకు నీ కులం ఓట్లను పణంగా పెట్టి, కుల నాయకుడిగా ఎదిగిన విషయం మరిచిపోయావు. ఇక్కడ నీకు తెలంగాణ ఎంత ముఖ్యమో.. అంతే..ఎపీ ఎన్జీవోలకు సమైక్యాంద్ర అంతే ముఖ్యమనే విషయం మరిచిపోయి మాట్లాడుతున్నావు. ‘‘కత్తి పీటకు లేని దురద ..కంద ఎందుకు చెప్పు ’’? అనే విధంగా నీ తీరు ఉంది. సభ పెట్టుకునేది ఎపీ ఎన్జీవోలు, అనుమతి ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ వారు. మద్యలో నీ పెత్తనం ఏమిటి మందా? తెలంగాణ ఉద్యమానికి ఎంతో సపోర్టు చేసిన అనుభవం నీకుంది. అందులోను ఒక కులానికి నాయకుడివి. అనే విషయాలు మరిచిపోయి, పేను పెత్తనం చేస్తావా? అసలు మరో విషయం గుర్తించుకోవాలి మందా. రాష్ట్రం ఇంక విడిపోలేదు. ఇంక కలిసే ఉందనే విషయం తెలుసుకోవాలి. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన తరువాత.. ఆంద్ర నాయకులు సభలు పెట్టుకోవాలంటే.. అప్పుడు అనుమతి తీసుకోవాలి. కానీ నీలాంటి నాయకుల వద్ద కాదు.. ఆ రాష్ట్ర ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోని సభలు నిర్వహించుకోవాలి. రీసెంట్ గా జాతీయపార్టీ నాయకుడు ఎల్బీ స్టేడియంలో సభ పెట్టితే.. ఆయన నీ పర్మిషన్ తీసుకున్నారా? అందరికంటే ముందు నీవు ఆయన దర్శనం కోసం క్యూలో నిలబడిన విషయం ప్రజలకు తెలియాదా. చెప్పు మందా? అందుకే మందా మాట్లాడే ముందు ఆలోచించవయ్యా అని మీ కులానికి సీమాంద్ర ప్రజలే అంటున్నారు. అయితే మందా గడిచిన సంవత్సారల్లో ఎన్ని రంగులు మార్చి ఉంటావో .. ఒక్కే ఒక్కసారి తిరిగి చూసుకోమని.. మీ కుల ప్రజలు అడుగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more