భయంతో బంద్ చేస్తున్నారో, బలుపుతో బంద్ చేస్తున్నారో తెలియాదు కానీ, మొత్తం మీద తెలంగాణలో బంద్ పాటిస్తున్నారు. అయితే ఈ బంద్ ఎందుకోసం చేస్తున్నారో? ఎవరి కోసం చేస్తున్నారో? అసలు బంద్ వల్ల తెలంగాణవాదులకు వచ్చే లాభం ఏమిటో, నష్టం ఏమిటో తెలంగాణ ప్రజలకే అర్థం కావటంలేదని అంటున్నారు. ఈ బంద్ లో చాలా ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయని హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు ఎన్నో బంద్ లు చూసి ఉంటారు. కానీ ఈ రోజు తెలంగాణలో జరిగే బంద్ గురించి ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ అర్థరాత్రి బంద్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అర్థరాత్రి స్వతంత్రం వచ్చిన విషయం ప్రజలకు తెలిసిందే. అయితే అర్థరాత్రి బంద్ అంటే ఇలా ఉంటుందా? అని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. సహజంగా రేపు బంద్ అని ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మాత్రం శుక్రవారం అర్థరాత్రి నుండే తెలంగాణ బంద్ అని ప్రకటించటం జరిగింది. అయితే ఇక్కడే పెద్ద మతలబు ఉందని సీమాంద్ర ఉద్యోగులు అంటున్నారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న సేవ్ ఆంద్రప్రదేశ్ సభకు సీమాంద్ర ప్రాంతాల నుండి వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం, రాత్రి సమయంలో హైదరాబాదుకు బస్సుల్లో బయలుదేరి, శుక్రవారం అర్థరాత్రి సమయానికి తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశిస్తారు కాబట్టి, ఆ సయయంలో తెలంగాణ బంద్ అమలులో ఉంటుంది.
కాబట్టి ఆ సమయంలో సీమాంద్ర బస్సులపై భౌతిక దాడులు చేసే అవకాశానికి అనువుగా బంద్ సహకరిస్తుంది. ఒకవేళ బస్సుల పై దాడులు జరిగిన, బంద్ వల్ల ఆందోళనకారులు రెచ్చిపోయి దాడులు చేశారనే ఒక కుంటి సాకుతో.. దాడులను కొట్టిపారేయవచ్చు అనే విధంగా అర్థరాత్రి బంద్ కు పిలుపు ఇవ్వటం జరిగిందని.. సీమాంద్ర ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణ వాదులు అనేక సార్లు బంద్ కు పిలుపు ఇవ్వటం జరిగింది. కానీ రేపు తెలంగాణ బంద్, రేపు వరంగల్ బంద్, అని రాజకీయ నాయకులు, తెలంగాణ జేఏసీ నేతలు ‘రేపు ’అనే పదం ఉపయోగించిన మనకు తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం ప్రత్యేకించి .. శుక్రవారం అర్థరాత్రి నుంచే బంద్ అని ప్రకటించటం పై రాజకీయ కుట్ర దాగి ఉందని సీమాంద్ర ఉద్యోగులు, సీమాంద్ర నాయకులు అంటున్నారు. సహజంగా బంద్ అంటే.. ఏమిటి? ముఖ్యమంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోతాయి, దుకాణాలు, విద్యాసంస్థలు, అన్ని మూతపడతాయి. కానీ ఈ అర్థరాత్రి బంద్ కు ఆర్టీసీ వారు పుల్ సపోర్టు చేసినట్లు కనబడతుంది. గతంలో జరిగిన బంద్ లతో పోల్చితే.. ఈ రోజు జరిగే బంద్ తీవ్రత చాలా ఎక్కువుగా ఉందని హైదరాబాద్ వాసులు అంటున్నారు. ఎందుకంటే.. బంద్ జరిగిన ప్రతిసారీ ఆర్టీసీ వారు ఎంత కొంత దైర్యం చేసి కొన్ని బస్సులను కొన్ని కొన్ని ఏరియాల్లో బస్సులను నడపటం జరుగుతుంది.
అంతేకాకుండా బంద్ జరిగే రోజే.. ఉదయం పూట కొన్ని ఆర్టీసు బస్సులు .. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. బంద్ తీవ్రత ఎక్కువుగా ఉన్న ఏరియాలను వదిలిపెట్టి, మిగిలిన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడిపేవారు. కానీ ఈరోజు మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. నైట్ అల్టింగ్ కు గ్రామాలకు వెళ్లిన బస్సులు కూడా ఉదయం పూట రాకపోవటం పై హైదరాబాద్ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి, ఆటో, ప్రైవేటు బస్సుల వారు ప్రయణికుల వద్ద నుండి ఎక్కువ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో నగర వాసులు అనేక బాధలుపడుతున్నారు. అసలే నిత్యావసర సరుకులు అధిక ధరలు పెరిగి సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలపై అర్థరాత్రి బంద్ లు, ఉద్యమాలతో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే సమ్మెలు, బంద్ లు చెయ్యాలి గానీ, ఒక ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు సభ పెట్టుకున్నందుకు కూడా బంద్ చేసి, ఆ భారాన్ని ప్రజలు మీద వెయ్యటం ఏమైన న్యాయంగా ఉందా అని నగర ప్రజలు అడుగుతున్నారు. ఈ బంద్ వల్ల ఎవరికి ఉపయోగం ఉందో , తెలియాదు గానీ, ఈ బంద్ వలన పూర్తిగా నష్టపోయింది మాత్రం హైదరాబాద్ వాసులేనని మేథావులు అంటున్నారు. ఏపీ ఎన్జీవోల సభ కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడాలా? హైదారాబాద్ నగర ప్రజలు బంద్ నరకం అనుభవించాలా? ఏపీ ఎన్జీవోల సభ అనేది కేవలం కొన్ని గంటల మాత్రమే ? కొన్ని గంటల్లోనే తెలంగాణ విభజనను ఏపీ ఏన్జీవోలు అడ్డుకుంటారా? వారు దేని కోసం సభ పెట్టుకుంటున్నారో తెలియాలంటే? వారి సభ జరిగితే తెలుస్తోంది.
అంతేకానీ ముందుగానే వారి సభను అడ్డుకుంటే.. వారి దేని కోసం సభ పెట్టుకున్నారో ఎలా తెలుస్తోంది చెప్పండి. ఎంతో మంది మేథావులు, ప్రొఫెసర్లు, రాజకీయ మేథావులు ఉన్నప్పటికి.. ఇలాంటి అతి తెలివి తక్కువ బంద్ లు చెయ్యటం వల్ల.. తెలంగాణ ప్రాంతానికి చెడ్డపేరు వస్తుందనే విషయం ఎలా మరిచిపోయాని హైదరాబాద్ ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు అంటే.. అతి సున్నితమైన భావం కలవారు, అందరికి ఆదర్శంగా ఉంటారు అనే భావన మిగత ప్రాంతాల ప్రజల మనస్సుల్లో నిండుగా ఉంది.కానీ ఇలాంటి అర్థరాత్రి బంద్ వలన, తెలంగాణలో అలాంటి మనస్సున్న ప్రజలు ఇక లేరు, అంత ముర్ఖులు అనే భావం ప్రజల మద్యకు వెళ్లిపోతుందని మేథావులు అంటున్నారు. ఏమైన ఈ బంద్ వలన నగర ప్రజలు అనేక ఇబ్బందాలు పడ్డారనేది నిజం. ఈ బంద్ వలన తెలంగాణ ప్రాంతానికి అపారమైన అపకీర్తి సంపాదించుకుందని నగర వాసులు అంటున్నారు. అయితే ఈ రోజ సాయంత్ర జరిగే ఏపీ ఎన్జీవోల సభ పై బంద్ ప్రభావం ఎలా చూపుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more