ఎందుకంటే ప్రేమంట సినిమా రివ్యూ....
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
నటీనటులు: రామ్, తమన్నా, రాధికా ఆప్టే, సుమన్, షాయాజి షిండే, రఘుబాబు, సుమన్ శెట్టి తదితరులు
మాటలు: కోన వెంకట్
పాటలు: రామజోగయ్య శాస్ర్తి, శ్రీమణి
సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్
కెమెరా: ఐ.ఆండ్రూ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్: పీటర్ హెయిన్స్
సమర్పణ: పి.కృష్ణచైతన్య.
నిర్మాత: పి.రవికిషోర్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.
రామ్ కందిరీగ వంటి భారీ విజయం తరువాత వస్తున్న సినిమా ఇది. అది కాకుండా ప్రేమ కథాచిత్రాల దర్శకుడు అయిన కరుణాకరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘తొలి ప్రేమ’ సినిమాతో ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహాంగా వంటి చిత్రాలు కూడా ప్రేమకథా చిత్రాలను అందించి, మరో క్లాస్ ప్రేమ కథా చిత్రాన్ని తీసిన ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ : భాధ్యతలు అంటే పట్టని అల్లరి కుర్రాడు రామ్. అతను తన తండ్రి (షయాజీ షిండే) మాట వినకపోవటంతో రామ్ ని భరించలేక తన ఫ్రెండ్ (నాగీనీడు) వద్దకు ప్యారిస్ పంపుతాడు.. గంతులేసుకుంటూ వెళ్లిన అతనికి అక్కడో ట్విస్ట్ ఎదురౌతుంది. తనని ఇక్కడికి ప్లాన్ ప్రకారమే పంపించాని తెలుసుకున్న రామ్ అక్కడి నుండి బయటపడాలని అనుకుంటాడు. చేతులో డబ్బులేక, చెప్పుకునే దిక్కులేక విషాద యోగంలో ఉన్న అతనికి స్రవంతి(తమన్నా)పరిచయం అవుతుంది. ఆమె అక్కడున్న ఇండియన్ అంబాసిడర్(సుమన్)కూతురు. ఆమె స్వేచ్చను వెతుక్కుంటూ బయిటకు వస్తుంది. రామ్ కి పరిచయం అయిన ఆమె అతన్ని ప్యారిస్ నుంచి ఇండియా వెళ్లి పోవటానికి సహాయం చేస్తానంటుంది. తను కూడా రామ్ నుండి సహాయం కోరుతుంది. దానికి సరేనన్న రామ్ ఆ తర్వాత ఆమె గురించి ఓ నిజం తెలిసి షాక్ అవుతాడు. ఇంతకీ రామ్ ని అంతలా షాక్ కి గురి చేసిన నిజం ఏమిటి.. తరువాట జరిగే పరిణామాలు తెర పై చూడాల్సిందే.కళాకారుల
పనితీరు : హీరో రామ్ తన దైన శైలిలో చక్కగా చేసుకుంటూ పోయాడు. పాటలలో కూడా రామ్ చాలా కష్టపడి స్టెప్స్ వేశాడు. తమన్నా రెగ్యులర్ ఎక్సప్రెషన్స్ తో లవ్ సీన్స్ పండించింది. బ్రహ్మానందం కామెడీ నవ్వుల్ని పండించినా అవి సీన్స్ కి తగ్గట్లు లేవు. విలన్ లుగా పరిచయం చేసిన ఒకప్పటి హీరో రిషి, రైటర్ కోన వెంకట్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు. ఛాయాగ్రహణం అందించిన ఆండ్రూ ఈ సినిమాకు ఉన్న ఏకైక ప్లస్ అని చెప్పాలి. పాటలు విన్నప్పటికంటే చూస్తున్నప్పుడే విజువల్ గా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ : ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ చిత్ర దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్. కోమాలోకి వెళ్ళిన స్రవంతి ఆత్మ రూపంలో తిరగడం, ఆమె ఆత్మ కేవలం రామ్ కి మాత్రమే కనపడం వంటి ప్రేక్షకుడికి మింగుడుపడని కాన్సెప్ట్ ఎంచుకుని, వాటిని తెరపై సరిగ్గా ఆవిష్కరించి ప్రేక్షకుడిని ఒప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం ఆకట్టుకోలేదు.
ప్లస్ పాయింట్స్ :
చివరగా : కరుణాకరన్ ముందు రెండు సినిమాలతో పోలిస్తే కొంచెం నిరాశ పరిచే విధంగా ఉన్నపటికీ అంతిమ తీర్పు ప్రేక్షకులే నిర్ణయించాలి, అలాగే వేసవి సెలవుల చివరి సీజన్లో విడుదల అవడం ఈ చిత్రానికి ఎంత వరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాలి. క్లీన్ గా ఉండి, అక్కడక్కడా కామెడీ కూడా బాగా పేలింది కాబట్టి ఫ్యామిలీలు కొంత బోర్ ని భరిస్తే మిగతాది ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.