Teluguwishesh బలుపు బలుపు Balupu Telugu Movie Review, Raviteja Balupu Telugu Movie Review, Balupu Movie Rating, Balupu trailers, Telugu movie Balupu photos, wallpapers, Videos, photo gallery, cast and crew on teluguwishesh.com. Product #: 45588 3/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బలుపు

  • బ్యానర్  :

    పివిపి సినిమా

  • దర్శకుడు  :

    గోపిచంద్ మలినేని

  • నిర్మాత  :

    ప్రసాద్ వర పొట్లూరి

  • సంగీతం  :

    ఎస్.ఎస్. థమన్

  • సినిమా రేటింగ్  :

    3/53/53/5  3/5

  • ఛాయాగ్రహణం  :

    జయంత్ విన్సెంట్

  • ఎడిటర్  :

    గౌతమ్ రాజు

  • నటినటులు  :

    రవితేజ, శ్రుతి హాసన్, అంజలి తదితరులు

Balupu Telugu Movie Review

విడుదల తేది :

జూన్ 28, 2013

Cinema Story

బలుపు శంకర్ (రవితేజ) చిన్నప్పటి నుండి అనాధ తిరుగుతూ పెద్దాడవుతాడు. చిన్నప్పటినుండి చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాడు. పెద్దయిన తరువాత ఐసీఐసీఐ బ్యాంకులో చిన్నపాటి ఉద్యోగం కూడా చేస్తుంటాడు. అతనికి పూర్ణ (అశ్ తోష్ రాణా) అనే ఫ్రెండు కూడా ఉంటాడు. ఓ సెటిల్మెంటులో భాగంగా నానాజీ (ప్రకాష్ రాజ్ ) అనే రౌడీషీటర్ తో గొడవ వస్తుంది. అంజలి ప్రకాష్ రాజ్ కూతురు. ఈమెను చూసి శంకర్ లవ్ లో పడతాడు. కానీ రెండు వర్గాల మధ్య గొడల కారణంగా పూర్ణ గ్యాంగ్ ఆమెను చంపేస్తారు. శ్రుతి (శ్రుతిహాసన్) రోహిత్ (అడవి శేష్ ) లకి పెళ్ళి కుదురుతుంది. కానీ ఓ సందర్భంలో శ్రుతి శంకర్ చూసి ఇష్టపడుతుంది. వీరిద్దరి పెళ్లి చేయాలని శ్రుతి తండ్రి (నాజర్ ) అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ పెళ్లి ఆపడానికి వస్తాడు. అక్కడ రవి, శ్రుతి ని చూసి షాక్ అవుతాడు. రవికి, పూర్ణకి మధ్య ఏం జరిగింది ? వారి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెర పైన చూడాల్సిందే.

cinima-reviews
బలుపు

మాస్ రాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ సినిమాలు అంటే ఖచ్చితంగా కావాల్సిన ఎంటరైట్ మెంట్ ఉంటుందనే ఫీలింగ్ ఉండేది ప్రేక్షకుల్లో, ఇక దర్శక నిర్మాతలు అయితే ఇతనితే సినిమా తీస్తే బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొట్టకున్నా , మినిమం గ్యారెంటీ కలెక్షన్లు అనే ధీమా ఉండేది. అది గత రెండు సంవత్సరాల వరకు. కానీ ఆ తరువాత పరిస్థితి మారింది. ఈయన నటించిన పలు సినిమాలు వరుస డిజాస్టర్ లు కావడంతో మాస్ రాజా సినిమానా ? అనే భయపడే స్థితికి వచ్చారు. ఇక ఇలాంటి తరుణంలో మలినేని గోపిచంద్ దర్శకత్వంలో ‘బలుపు ’ అనే సినిమాలో చాలా టైం కేటాయించి నటించాడు. ఇక దర్శకుడు పూర్తి స్థాయి మాస్ మసాలను జోడించి రవితేజకు తగ్గ కథను, కామెడీని జోడించి కమర్షియల్ సినిమాగా రూపొందించాడు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

రవితేజ సినిమా గురించి పెద్దగా విశ్లేషించాల్సింది ఏమి ఉండదు. ఎందుకంటే  ఆయన గత సినిమాలను ఊహించుకుంటే సినిమా టెంప్లేట్ ఏంటో అర్థం అయిపోతుంది. ఈ సినిమాను దర్శకుడు రవితేజను ఉద్దేశించే తీసినట్లు అనిపిస్తుంది. మొదటి భాగాన్ని కామెడీతో లాగించేసిన దర్శకుడు విశ్రాంతికి ముందు ట్విస్ట్ తో కథను మలుపు తిప్పుతాడు. ఆ తరువాత సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ సీన్లు సీరియస్ నెస్ తో సాగిపోతుంటాయి. సెకండాఫ్ లో కామెడీ పార్ట్ మిస్సయింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు రొటీన్ స్టోరీ లాగా అనిపించినా , టైమ్ పాస్ కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకుడిని కాస్త నవ్విస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఇక రవితేజ గత సినిమాలతో పోలిస్తే.... ఈ సినిమా చాలా బెటర్. ఇటీవలి కాలంలో రవితేజ సినిమాలు ఈ మాత్రం కూడా లేవు. తన మొదటి సినిమాలో రవితేజను డాన్ శీను గా చూపించిన గోపీచంద్ బలుపు శంకర్ గా చూపించడంలో కాస్తంత బెటర్ అనిపించాడు. ఈ సినిమా మొత్తంగా చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. కానీ రవితేజ సినిమా కదా అని తప్పకవెళ్ళాల్సిన చిత్రమేమి కాదు. ఒకవేళ వెళ్లినా దాని గురించి మాట్లాకునేంతగా లేదు.

Cinema Review

రవితేజ సినిమాలో ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే గత నాలుగైదు సినిమాలను ఊహించుకొని ఈయన నటన బాగోలేదని ఫీలవకండి. ఈ సినిమాలో రవితేజ పాత వినోదాన్ని చూడవచ్చు. అన్ని తానై ఈ సినిమాలో తన పాత్రను పోషించాడు. రెండు కోణాలలో సాగే పాత్రను పోషించిన రవితేజ వాటికి న్యాయం చేశాడు. ఇక శ్రుతి హాసన్ అందంగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె కామెడీ ట్రైచేసి మెప్పించే ప్రయత్నం చేసింది. సెకండ్ హీరోయిన్ గా నటించిన అంజలి చిన్న పాత్ర చేసినా ఫర్వాలేదనిపించింది. సినిమా మొదట్లోనే ఐటెం సాంగుతో లక్ష్మీరాయ్ షేక్ చేసింది. ప్రకాష్ రాజ్ తన పాత్రకు అన్నివిధాల న్యాయం చేశాడు. బ్రహ్మానంగం గగ్నమ్ స్టైల్ డాన్స్, కామెడీ అక్కడక్కడ నవ్వును తెప్పించాయి. అశుతోష్ రాణా మంచి పాత్రను పోషించాడు. ఇక ఈ సినిమాలో చాలా మంది తారగణాన్ని పెట్టిన దర్శకుడు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికత:

సినిమాకు సంగీతం సగం ప్రాణం పోస్తుంది. కథలో కాస్తంత బలం తక్కువయినా, సంగీతం బాగుంటే అది మరుగున పడుతుంది. ఈ సినిమాకు సంగీతం అందించిన థమన్ సంగీతం సోసోగా ఉండటమే కాకుండా మొదటి నుండి ఒకేరకమైన మ్యూజిక్ తో ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తున్నాడు. ప్రతి సినిమాకు ఇంచు మించుగా ఒకే రకమైన మ్యూజిక్ కి వినిపించి ఇది ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగిస్తున్నాడు. స్టోరీ రొటీన్ గా ఉన్నట్లే సంగీతం కూడా రొటీగా ఉంది. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. ఇక స్ర్కిప్టును అందించిన కోన వెంకట్ ఇంకాస్త మెరుగ్గా రాయాల్సి ఉండేది. డైలాగులు డిఫరెంటుగా లేకపోయినా, అవి కాస్తంత కామెడీగా అనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు పక్కా కమర్షియల్ ఫార్ములాని, రవితేజ మార్కు కామెడీని నమ్ముకొని సినిమా తీయడంలో సఫలం అయ్యాడని చెప్పవచ్చు.

more