పెద్దలు కుదిర్చిన వివాహం ఇష్టపడని ఓ అబ్బాయి అనీల్ (సుమంత్ అశ్విన్) వారి పెద్దల నుండి తప్పించుకొని హైదారాబాద్ కు ప్రయాణం అవుతాడు. హైదారాబాద్ వచ్చాక అనన్య (ఈశ) ను తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అనన్య కూడా అనీల్ ని ప్రేమిస్తుంది. కానీ అనన్య వాళ్ల పేరెంట్స్ కి నిత్యం ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. వాటన్నింటిని చూసిన అనన్యకు అనీల్ ని పెళ్లి చేసుకున్న తరువాత కూడా నా జీవితం కూడా ఇలానే ఉంటుందా ? పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోతుందా అనే అనుమానాలు వస్తాయి. ఇటు అనీల్ కి కూడా ప్రేమ పెళ్ళి చేసుకున్నాక లైఫ్ బోర్ గా ఉంటుందా ? జీవితాంతం కలిసి ఉంటామా అనే సందేహాలు వస్తాయి. దాంతో వారిద్దరు కొన్నాళ్ళ పాటు కలిసి ఉండి ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఆ తరువాత వారిద్దరి మధ్య బంధం బలపడుతుందా ? వారికి లైవ్ లైఫ్ రిలేషన్ షిప్ లో వచ్చే సమస్యలు ఏంటి ? చివరికి వారు పెళ్లి చేసుకుంటారా అన్నది తెర పై చూడాల్సిందే.
కొత్త తరహా కథల్ని ఎంచుకొని వాస్తవికానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసే క్లీన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ ఇంద్రగంటి తన కొద్దిపాటి సినిమాలతోనే సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వస్తున్న యూత్ సినిమాలన్నింటిని బూతు సినిమాలుగా చూపించి, యూత్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అంటేనే బూతు సినిమాలకు ఐకాన్ గా మారిన ఈ రోజుల్లో అదే యూత్ ని టార్గెట్ చేసి, ఏ మాత్రం అశ్లీలతకు చోటు లేకుండా, యువత ప్రేమ, పెళ్ళి పై ఆలోచనలు ఎలా ఉంటాయి ? ప్రేమలో ఉన్నప్పుడు ఉండే ప్రేమ, ఆకర్షణ వంటి పెళ్ళి తరువాత ఉంటాయా ? ఉండవా అనే కొత్త రకం కాన్సెప్ట్ తో తెర కెక్కించిన ఇంద్రగంటి యూత్ ని అంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఆకట్టుకున్నాడా అనేది ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.
ఎంచుకున్న కథలో కొత్తదనంతో పాటు, యూత్ ని ఆకట్టుకునే విధంగా బూతు లేకుండా సినిమా చేసి ప్రేక్షకుల్ని ఆట్టుకోవచ్చిని చెప్పాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ. ప్రేమలో ఉన్నప్పుడు ఉండే ప్రేమ, అనుబంధం గురించి ఇంతకు ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమ పెళ్లిలో ఉండే వాటిని గురించి దర్శకుడు విఫులంగా తెర పై చూపించాడు. ఏ చిత్రం అయిన పెళ్లి కి ముందు చూపించి పెళ్ళితో శుభం కార్డు వేసేస్తారు కాని పెళ్లి తరువాతే అసలు కథ ఉంటుంది. ఈ చిత్రంలో పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత అనే అంశాన్ని చాలా బాగా చూపించాడు. చెప్పదలుచుకున్న విషయాన్ని క్లీన్ గా స్టేట్ ఫార్వర్డ్ గా చేసేశాడు. కథలో కామెడీకి ఎంత వరకు స్కోప్ ఉందో అంతే చూపించి ఆకట్టుకున్నాడు. ఇటీవల వచ్చిన యూత్ చిత్రాలకు బూతును జోడించి దండిగా డబ్బులు రాబట్టుకున్న దర్శకులకు ఈ చిత్రం ఒక చెంపపెట్టు లాటింది. సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ దానిని బూతు లేకుండా కూడా తీయవచ్చు అని నిరూపించే చిత్రం. ఫస్టాఫ్ లో కంటే సెకండాఫ్ లో అనసరమైన విషయాన్ని జోడించి, కాస్త విసిగించాడు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే యూత్ చిత్రాలంటే.. బూతు చిత్రాలుగా మారిన ఈ రోజుల్లో ఇంతకు ముందు ఫ్యామిలీతో కలిసి చూడని వాళ్లు ఈ చిత్రానికి నిశ్చితంగా వెళ్లవచ్చు. ఎందుకుంటే ఆ తరువాత వచ్చే చిత్రాలు ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి.
ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన ఎం.ఎస్. రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ చేసింది రెండో సినిమా అయినా, మొదటి సినిమా కంటే ఈ సినిమాలో నటన పరంగా చాలా పరిణతి చెందాడు. తనకు సూటయ్యే క్యారెక్టర్ ని ఎంచుకొని అందులోలీనమై నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో, క్లోజప్ షాట్స్ లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా నటించడం చూస్తే ఎన్నో సినిమాలలో నటించినట్టు అనిపిస్తుంది. ఇలానే చేసుకుంటూ పోతే సుమంత్ కి మంచి భవిష్యత్ తో ఉంటుంది. ఇక సుమంత్ సరసన నటించిన ఈష నటిన ఫర్వాలేదనిపిస్తుంది. చూడటానికి అందంగా కనిపించినా నటనలో ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది. రోహిణి, రావు రమేష్ ల నటన ఆకట్టుకుంటుది. చాలా రోజుల తరువాత తెలుగు తెర పై కనిపించిన విలక్షణ నటి మధుబాల చూడటానికి బాగుంది. నటనే కాస్తంత డల్ గా అనిపించింది. రవి బాబు, ఝాన్సీలు ఎప్పటిలానే చేశారు. అపరాల శ్రీనివాస్ చెప్పే సింగల్ లైన్ డైలాగ్స్, తాగుపోతు రమేష్ ల కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. మిగతావారు వారి వారి పాత్రల మేరకు చేశారు.
సాంకేతిక విభాగం:
ఈ సినిమాకు దర్శకుడు ఎంచుకున్న కథకు అనుగుణంగా నేపధ్య సంగీతం అందించాడు కళ్యాణి కోడూరి. పాటలు ఒక్కసారి వినిపించేలా ఉన్నా, సినిమాకు మాత్రం నేపధ్య సంగీతమే హైలెట్ గా నిలుస్తుంది. సినిమాకి సినిమాటోగ్రఫి హైలెట్ గా ఉంది. ప్రతి సన్నివేశాన్ని పి.జి. విందా చక్కగా తీశాడు. ఎడిటింగ్ విభాగంలో ఫస్టాఫ్ బ్రేకులు లేకుండా చేసి, సినిమాను ఒక స్పీడ్ లో వెళ్లేలా చేశాడు, కానీ సెకండాఫ్ లో అక్కడక్కడ బ్రేకులు వేసి కాస్త వేగం తగ్గించాడు. అది లేకుండా చూసుకుంటే ఇంకా బాగుండేది. ఇక లవ్ స్టోరీలను ఎలాంటి బూతు లేకుండా హ్యాండిల్ చేయాలంటే..దర్శకుడికి ఘట్స్ కావాలి. అదే చేశాడు దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి. ముఖ్యంగా ఆయన రాసిన డైలాగ్స్, సంభాషణలు చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ తో పోల్చు కుంటే సెకండాఫ్ కాస్త కంటెంట్ ఎక్కువ పెట్టి కాసేపు బోర్ కొట్టించడం మినహా మిగతాదంతా శ్రద్ద పెట్టి చేశాడు. మొత్తంగా చూస్తే తను ఎంచుకున్న కథకు 90 శాతానికి పైగా న్యాయం చేశాడని చెప్పవచ్చు.