టాలీవుడ్లో మరో విషాదం అలుముకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, ప్రిన్స్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ తెల్లవారుజామున పరమపదించారు. అమె మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఇటీవలే 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆమె జన్మదినాన్ని కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. అలాంటి ఇందిరాదేవి ఇవాళ హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంలో ఘట్టమనేని కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘట్టనేని ఇందిరాదేవి మరణంవార్త తెలియడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా మాద్యమాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, ఘట్టమనేని కుటుంబానికి తమ ప్రగాఢ…