డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్న కార్తీక్ (నాగచైతన్య) ఇప్పుడే భాద్యతలు అవసరమా అనుకుని జాబ్ కు రిజైన్ చేస్తాడు. ప్రపంచాన్ని చుట్టివద్దామని టూర్ ప్లాన్ వేసుకుని విదేశాలు పట్టి తిరుగుతుండగా ఓ సారి నందన (పూజ హెగ్డే)ను చూస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా ప్రేమలో పడిపోతాడు. నందు ఎక్కడుంది.. ఏం చేస్తుంది అని రోజూ ఫాలో అవుతుంటాడు. తన ప్రేమను ఎప్పుడెప్పుడు చెప్పాలా అని తహతహలాడుతుంటే..,పలు సందర్బాల్లో కార్తిక్ ప్రవర్తనను చూసి నందు అసహ్యించుకుంటుంది. ఇదిలా ఉండగానే కార్తిక్, నందు ఇళ్ళలో పెళ్లిళ్ళు చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకుంటాయి. కార్తీక్ మనస్సులో నందు ఉండటంతో పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు అయినా సరే.. పెళ్లి చూపులకు వచ్చి అక్కడ అమ్మాయి నచ్చలేదు అని చెప్పాలని డిసైడ్ అవుతాడు.
కట్ చేస్తే.., పెళ్ళి చూపుల్లో నందునే తనకు కాబోయే భార్య అని తెలుసుకుని ఆలస్యం చేయకుండా ఓకే చెప్తాడు. కార్తిక్ అంటే వ్యతిరేక భావం ఉన్న నందు తండ్రి మాటను కాదనలేక... పెళ్లికి ఒప్పుకోలేక బాదపడుతుంటుంది. పెళ్లి చూపులు నిశ్చితార్ధం వరకు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది ? కార్తిక్ ప్రేమను నందు అర్ధం చేసుకుందా.. లేదా..? అనేది థియేటర్ కు వెళ్ళి చూడండి.
తెలుగు ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా విడుదల అయింది. వరుసగా ఏదో ఒక కారణంగా ఆలస్యం అయిన సినిమా మంచి ముహూర్త బలం చూసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవర్ గ్రీన్ హిట్ పాటను సినిమా పేరుగా పెట్టుకున్న చైతు తాజా లవ్ స్టోరీతో పూజ హెగ్డే ఇండస్ర్టీకి పరిచయం అయింది. ‘గుండెజారి గల్లంతయిందే’ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ మరోసారి లవ్, ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాము అంటున్న ‘ఒక లైలా కోసం’ సినిమా రివ్యూను మీకోసం అందిస్తున్నాం.
ప్లస్ పాయింట్స్ :
రొమాంటిక్ సినిమాల విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న నాగచైతన్య. ‘ఒక లైలా కోసం’తో మరోసారి పేరు నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. గతంలో వచ్చిన మూవీల కంటే ఇందులో మరింత హ్యాండ్ సమ్ గా, కొత్త లుక్ తో కన్పించాడు. లవ్ కధలు చేయటంలో చేయి తిరిగిన చైతు ఇందులో అనుభవాన్నంతా ఉపయోగించాడు. లవ్, ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా చేశాడు. కొత్తగా పరిచయం అయిన పూజ హెగ్డే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అనే ఫార్ములాని ఫాలో అయింది. తనలోని సాంప్రదాయ కళ, గ్లామర్ లుక్ రెండింటిలోనూ మార్కులు కొట్టేసింది. ఈ దెబ్బతో డైరెక్టర్లు, నిర్మాతలు పూజ పేరు జపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
లవ్ పరంగా ఆకట్టుకున్న సినిమా.., ఎంటర్ టైన్ మెంట్ విషయంలోనూ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా అలీ, పోసాని కామెడి సీన్లు బాగా పండాయి. నాగార్జున చెప్పినట్లు ఈ సినమాకు అలీ హైలైట్ అయ్యాడు. ఓవరాల్ సినిమాను చూస్తే... ఫస్ట్ ఆఫ్ దాదాపుగా ఎంటర్ టైన్ పరంగా సాగింది. దీనికి రొమాన్స్ తోడు అయింది. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేయటంతో సినిమా బాగా వచ్చింది. పాటలు.., సినిమాటోగ్రఫీ అదనపు పాయింట్లుగా చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ అంటే... క్లారిటి లేదు అని చెప్పవచ్చు. కధ... ప్రధాన క్యారెక్టర్ల విషయంలో స్పష్టత కొరవడింది. హీరోయిన్ హీరోను ఎందుకు ద్వేషిస్తుందో సరైన కారణం ఉండదు. అదేవిధంగా హెగ్డే పాత్రకు కొన్నిచోట్ల క్లారిటీ మిస్ అయింది. ఇక కధను ప్రజెంట్ చేయటంలో విజయ్ కొండా కొంత తడబడ్డారు. ఎమోషనల్ సీన్లు బాగా ఉన్నా.. వాటి ప్రజెంటేషన్ కు వచ్చే సరికి లోపాలు కన్పిస్తున్నాయి. ఎమోషనల్ సీన్లను ఆడియెన్స్ కు సరిగా కనెక్ట్ చేయలేకపోయారు.
ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో.., సెకండ్ ఆఫ్ ఇంకా బాగుంటుంది అని బయటకు వెళ్ళి వచ్చిన వారు నిరాశపడతారు. సెకండ్ ఆఫ్ ల్ కామెడి అంతగా లేదు. కధలో ముఖ్యమైన అంశాలన్ని చాలావరకు సెకండ్ ఆఫ్ లో కవర్ చేశారు. దీంతో కామెడి సీన్లకు ఆస్కారం లేకపోయింది. రోటీన్ సీన్లతో పాటు పాత సినిమాల్లోని సీన్లు గుర్తుకు వచ్చేలా ఇందులో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.
కళాకారుల పనితీరు
ముందుగా డైరెక్టర్ గురించి చెప్పాలంటే.. విజయ్ కొండా కధ బాగుంది. ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ సీన్లను డిజైన్ చేసుకున్న విజయ్ కొండ... వాటిని కనెక్ట్ చేయటంలో మాత్రం కాస్త వెనకబడ్డాడు. ఇక టక్నికల్ విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పాల్సింది ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ గురించి. విజువల్స్, చాలా నీట్ గా, కొత్త లుక్ తో వచ్చాయి. ఆండ్రూ పనితనం కారణంగా ప్రతి సీన్ క్వాలిటి బాగా రావటంతో పాటు ఫ్రెష్ నెస్ కన్పించింది. వీడియోకు తగినట్లే అనూప్ ఆడియో కూడా చాలా బాగుంది. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రెండు ఓకే అనక తప్పదు. అదేవిధంగా డైలాగ్స్ కూడా కధకు సెట్ అయ్యాయి. కామెడి పరంగా.., ఎమోషనల్ పరంగా మాటలు మంచి మార్కులు కొట్టేశాయి. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో మంచి డైలాగ్స్ గుర్తించవచ్చు.
లవ్ స్టోరీలో ఉండే యాక్షన్ సన్నివేశల ప్రాధాన్యతను గుర్తించి ఇందులో ఫైట్ సీన్లను పెట్టారు. యాక్షన్ సీన్లు చక్కగా డిజైన్ చేశారు. ఎడిటింగ్ లో ఫస్ట్ ఆఫ్ ని పరిగెత్తించిన ప్రవీణ్ సెకండ్ పార్ట్ కూడా వేగం పెంచి ఉంటే బాగుండేది. ఇక నిర్మాత నాగార్జున క్వాలిటి విషయంలో ఎక్కడా తగ్గలేదు అని స్ఫష్టం అవుతుంది. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒక్కమాటలో....
లవ్, ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమాను ఫ్యామిలి ఆడియెన్స్, ముఖ్యంగా యూత్ చూడదగినదిగా చెప్పవచ్చు.
కార్తిక్