రానా ప్రతాప్ జయదేవ్ (నారా రోహిత్) చాల ఈగో ఉన్న వ్యక్తి. తన ఈగోను ఎవరైనా దెబ్బతీస్తే వారిని వెతుక్కుంటూ వెళ్లి మరి దెబ్బకొట్టే మనస్తత్వం కలవాడు. దీనికోసం ఏమైనా చేసేందుకు వెనకాడడు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన రానా ఓ రోజు బయటకు వెళ్ళగా మార్గమద్యలో ఓ వ్యక్తి చావుబతుకుల మద్య ఉంటే.., అతన్ని హాస్పిటల్ లో చేర్పించేందుకు ప.గో. జిల్లాకు చెందిన ఓ మినిస్టర్ ర్యాలిని చెదరగొడతాడు. ఈ కేసులో రానాను పోలిసులు అరెస్టు చేస్తారు. స్టేషన్ లో పోలిస్ ఆఫీసర్ రానా ఈగోను హర్ట్ చేస్తాడు. అసలే ఈగో ఫీలింగ్ ఎక్కువగా ఉండే రానా.., పోలిస్ తో పాటు తనను కేసులో ఇరికించిన మంత్రిపై రివేంజ్ తీర్చుకోవాలనే కసితో పోలిస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది.. ఇద్దర్ని రానా ఎలా దెబ్బకొట్టాడు..? అసలు రానా పోలిస్ ఎలా అవుతాడు అనేది థియేటర్ కు వెళ్ళి చూడండి.
‘సోలో’, ప్రతినిధి’ వంటి డిఫరెంట్ కధలతో కూడిన సినిమాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ మరోసారి కొత్త కాన్సెప్ట్ ట్రై చేశాడు. పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా ఆయన నటించిన ‘రౌడీఫెల్లో’ మూవీ శుక్రవారం (నవంబర 21)న విడుదల అయింది. లిరిక్ రైటర్ గా పేరున్న కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన తొలి మూవీ ఇది. ఈ ప్రాజెక్టుతో విశాఖ సింగ్ అనే హీరోయిన్ కూడా ఇండస్ర్టికి పరిచయం అయింది. సినిమాకు సన్నీ సంగీతం అందించగా.., ప్రకాష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. కొత్తదనంతో థియేటర్ కు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
ప్లస్ పాయింట్స్ :
ఈ మూవీతో నారా రోహిత్ మరోసారి టాలెంట్ నిరూపించుకున్నాడు. తాను నటించే డిఫరెంట్ కధలు బాగా వస్తాయి అని రుజువు చేశాడు. ఈ మూవీతో ఇండస్ర్టికి వచ్చిన కొత్త హీరోయిన్ విశాఖ సింగ్ కు సినిమాలో పాత్ర తక్కువగా ఉన్నా.., కన్పించినంత సమయం ఆకట్టుకుంది. అటు విలన్ క్యారెక్టర్ లో రావు రమేష్ చాలా బాగా నటించారు. ఆయన నుంచి వచ్చే డైలాగ్స్ హైలైట్ అయ్యేలా ఉన్నాయి. హీరో-విలన్ మద్యసీన్లు కూడా బాగా తీశారు. ఇక సినిమా విషయానికి వస్తే.., ఈగో అనే చిన్న పదాన్ని తీసుకుని సినిమాను చూపించారు. అయినా సరే ఈ ఫీలింగ్ పై నెగెటివ్ షేడ్ రాకుండా.. రానా ఈగో వల్ల కొందరి జీవితాలకు కలిగిన మంచిని చూపించారు. సినిమా కాన్సెప్ట్ తో పాటు., డైలాగ్స్ కూడా బాగున్నాయి. స్వయంగా లిరిక్ రైటర్ అయిన కృష్ణ చైతన్య ‘రౌడీ ఫెల్లో’ లో రాసిన డైలాగ్స్ వెనక లోతైన అర్ధం కన్పిస్తుంది.
యాక్షన్ పార్ట్ ఒక ఎత్తయితే కామెడి పార్ట్ మరొక ఎత్తు. ‘రౌడీ ఫెల్లో’లో కామెడి క్రెడిట్ అంతా పోసానికే చెందుతుంది. సినిమాలో కన్పించిన ప్రతి సీన్ లో నవ్వించటం జరుగుతుంది. డైలాగులతో పాటు టైమింగ్ కలిసి పేలాయి. ఇక సత్య కూడా కామెడిని పండించాడు. సినిమాను డిఫరెంట్ గా చూపించటంతో పాటు హీరో ఎంట్రి, ఇంటర్వల్, సస్పెన్స్, క్లైమాక్స్ చాలాబాగా చూపించారు.
మైనస్ పాయింట్స్ :
డిఫరెంట్ కాన్సెప్ట్ ను డిఫరెంట్ గా చూపించాలనే ఉద్దేశ్యంతో డైరెక్టర్ చిన్నచిన్న తప్పులు చేశాడు. అదేవిధంగా కాన్సెప్ట్ చిన్నది కావటంతో ఎక్కువగా చూపించవద్దు అనే విషయం డైరెక్టర్ మర్చిపోయాడు. చిన్న లైన్ పట్టుకుని రెండున్నర గంటలు చూపించటంతో కాస్త సాగదీసినట్లుగా అన్పిస్తుంది. మూవీ మొదట్లో ఫాస్ట్ గా మొదలవుతుంది ఆ తర్వాత నిదానించి అలా వెళ్తుంటుంది. ఇంటర్వల్ కు ముందు అయితే చాలా స్లో అవుతుంది. ఇక ఇంటర్వల్ తర్వాత సెకండ్ పార్ట్ లో సినిమాలోకి ఆడియెన్స్ లీనం అయిన సమయంలో హీరోయిన్ సీన్లు డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పుడెందుకు వచ్చింది అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఆ తర్వాత వచ్చే ఓ పాట కూడా సినిమాకు, కధకు అవసరం లేదు. హీరో -హీరోయిన్ లవ్ స్టోరీ కూడా సరిగా చూపించలేదు. అంటే హీరోయిన్ లవ్ చేయటానికి కారణమేంటో క్లారిటీ ఇవ్వలేదు.
డైరెక్టర్ విషయానికి వస్తే.., ఈ విభాగానికి ఆయన కొత్త. పైగా అదనపు బాధ్యతలు కూడా తీసుకున్నాడు. దీంతో ఆయన తప్పులను ఎక్కవుగా విమర్శించలేము. అయితే చెప్పక తప్పదు కాబట్టి.., చిన్న పాయింట్ తో సినిమా తీయటంతో ఉన్న సమయం ఏం చేయాలో తెలియక కథను సాగతీశాడు. డిఫరెంట్ అనే మైండ్ సెట్ లో ఉండి అతి శ్రద్ధ చూపించటంతో అక్కడక్కడా అనవసర అంశాలు వచ్చాయి. కాని డైలాగ్స్ మాత్రం దుమ్ములేపుతాయి. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ ఓమ్ కూడా చాలాబాగా పనిచేశాడు. ప్రతి సీన్ ఫ్రెష్ లుక్ తో ఉండటంతో పాటు.., గ్రాండ్ గా కన్పిస్తుంది. ఇక సన్నీ సంగీత దర్శకుడిగా న్యాయం చేశాడు. పాటలు బాగుంటే.., బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే బాగుంది. ఎడిటర్ కార్తిక్ పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. చిన్నలైన్ తో సినిమా తీయటంతో.., తన తప్పు లేకపోయినా.., సినిమాకు అనవసరం అయిన సీన్లను తీసివేసి ఉంటే బాగుండేది.
చివరగా : పర్వాలేదు ఈగోను బాగానే చూపించారు.