Teluguwishesh గోపాల గోపాల గోపాల గోపాల Get Gopala Gopala Movie Review, Gopala Gopala Telugu Movie Review, Gopala Gopala Movie Ratings, Pawan Kalyan Gopala Movie Review, Venkatesh Gopala Gopala Movie Review. Know Gopala Gopala Movie Updates. Product #: 59769 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గోపాల గోపాల

  • బ్యానర్  :

    సురేష ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్త

  • దర్శకుడు  :

    కిషోర్ కుమార్ పార్థసాని

  • నిర్మాత  :

    సురేష్ బాబు, శరత్ మరార్

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    జయంత్ విన్సెంట్

  • ఎడిటర్  :

    గౌతం రాజు

  • నటినటులు  :

    వెంకటేష్ (హీరో), పవన్ కళ్యాణ్ (హీరో), శ్రియ (హీరోయిన్), పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ తదితరులు

Gopala Gopala Movie Review

విడుదల తేది :

2015-01-10

Cinema Story

గోపాల్ రావు (వెంకటేష్) దైవ భక్తి లేని వ్యక్తి. అయితే దేవుడి విగ్రహాలు అమ్మే షాపును నిర్వహిస్తుంటాడు. ఒక భార్య ఇద్దరు పిల్లలతో చిన్న, మద్యతరగతి కుటుంబం. కుటుంబం, వ్యాపారం జీవితంగా ఉన్న గోపాల్ రావు ఓ రోజు దేవుడిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తాడు. అకస్మాత్తుగా భూకంపం వచ్చి గోపాల్ రావు షాపు కూలిపోతుంది. నష్ట నివారణ కోసం ఇన్సూరెన్స్ కంపనీని సంప్రదిస్తే అక్కడ నిరాశ ఎదురవుతుంది.

ఇన్సూరెన్స్  కంపనీ ప్రతినిధి దేవుడి చర్యలకు క్లయిమ్ రాదని చెప్పటంతో.., గోపాల్ రావు దేవుడిపై కోర్టులో పిటిషన్ వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, గోపాల్ రావుకు న్యాయం జరిగిందా లేదా అనే విషయాలు తెలియాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి.

cinima-reviews
గోపాల గోపాల

పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ సినిమా లేకపోవటంతో ఈ మూవీ కోసం పవర్ ష్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. పవన్ రోల్ తక్కువగా ఉన్నా.. ఆయన పేరుమీదే ఎక్కువగా ప్రమోషన్ జరిగింది. ‘ఓ మై గాడ్’ హిందీ మూవీకి రీమేక్ గా ‘గోపాల గోపాల’ను కిశోర్ పార్థసాని డైరెక్ట్ చేశాడు. సురేష్  ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

వెంకటేష్, శ్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మూడు పాటలే ఉన్నా... అన్నీ సూపర్ హిట్ కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి రేసులో చాలా సినిమాలను దాటుకుని వచ్చిన ఏకైక తెలుగు సినిమా ఇదే. సెన్సార్  బోర్డు ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చిన  ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఫ్యామిలీ మెన్ గా పేరుపొందిన విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో తన టాలెంట్ అంతా చూపించాడు. మిడిల్ క్లాస్ పర్సన్ గా, నాస్తికుడిగా తన రోల్ కు పూర్తి న్యాయం చేశాడు. ముఖంపై హావభావాలను చాలా చక్కగా చూపించాడు. దేవుడిగా కన్పించిన పవన్ కూడా బాగా నటించాడు. మోడ్రన్ కృష్ణుడి అవతారం పవర్ స్టార్ కు సూట్ అయింది. వీరిద్దరి మద్య వచ్చే సన్నివేశాలు చాలా బాగున్నాయి. శ్రియ పాత్ర కూడా తక్కువగా ఉన్నా.. పూర్తి న్యాయం చేసింది.

మిగతా ఆర్టిస్టుల్లో ప్రధానంగా పోసాని కృష్ణమురళి, బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి సూపర్ గా నటించారు. ముఖ్యంగా పోసాని కామెడి డైలాగులు బాగుంటాయి. సినిమా మొత్తాన్ని ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్ లో తెరకెక్కించారు. కాబట్టి ఎక్కడా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వరు.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్ట్ ఆఫ్ న్యారేషన్ సింపుల్ గా సాగింది, పర్వాలేదు అన్పించుకుంది. సెకండ్ ఆఫ్ లో మాత్రం కాస్త స్లో అయింది. అంతేకాకుండా మూవీలో వెంకటేష్ తప్ప మిగతా ఎవరిని ఎక్కువగా ఫోకస్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కన్పించేది కొద్ది సేపే కాగా., శ్రియ ఎక్కువ సేపు ఉన్నా., ఎక్కువగా ఉపయోగించుకోలేదు. రీమేక్ సినిమాలో అన్ని సీన్లు ఉంటాయి అనుకుంటే.., క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలు తొలగించారు.

కళాకారుల పనితీరు :

కిషోర్ పార్థసాని డైరెక్టర్ గా న్యాయం చేశాడు. ఒరిజినల్ కథకు ఎక్కడా నష్టం కల్గించకుండా, ప్రేక్షకుల అంచనాలు దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించాడు. సున్నితమైన అంశం కావటంతో విడుదలకు ముందే వివాదాలు వచ్చాయి. వీటన్నిటిని బేరీజు వేసుకుంటూ ఎవరినీ నొప్పించకుండా సినిమా చూపించాడు. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. మంచి క్వాలిటీ, లైటింగ్ తో షూట్ చేశారు. అనూప్ రూబెన్స్  సంగీతం గురించి చెప్పక్కర్లేదు. ఆడియో సూపర్ హిట్ కావటంతోనే ఇది ప్రూవ్ అయింది. డైలాగులు కూడా ఎవర్నీ నొప్పించకుండా ఉన్నాయి. సెకండ్ ఆఫ్ లో కొన్ని అవసరం లేని సన్నివేశాలపై ఎడిటర్ ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది.

చివరగా : అందరూ చూడదగ్గ కామెడి, ఎంటర్ టైనర్

Movie TRAILERS

గోపాల గోపాల

play