Teluguwishesh బీరువా బీరువా beeruva telugu movie review : sundeep kishan latest movie beeruva review which is released on 23rd january Product #: 60183 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బీరువా

  • బ్యానర్  :

    ఉషాకిరణ్ ఫిలిమ్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్

  • దర్శకుడు  :

    కన్మణి

  • నిర్మాత  :

    రామోజీరావు

  • సంగీతం  :

    ఎస్.ఎస్.థమన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    చోటా కె నాయుడు

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    సందీప్ కిషన్, సురభి తదితరులు

Beeruva Telugu Movie Review

విడుదల తేది :

2015-01-23

Cinema Story

సీన్ ఓపెన్ చేయగానే ఓ బీరువా కనిపిస్తుంది. దీపిక (అనీషా సింగ్) ఆ బీరువాను కొంటుంది. దానిని ఓపెన్ చేస్తే.. అందులో నుంచి హీరో సంజు (సందీప్ కిషన్) వుంటాడు. అతడ్ని చూసి ఖంగుతిన్న దీపు.. అతడి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం మొదలుపెడుతుంది. సీన్ కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. నగరంలో రిచ్ ఇండస్ట్రియలిస్ట్ అయిన సూర్యనారాయణ (సీనియర్ నరేష్) కుమారుడే ఈ సంజు. ఇతగాడు ఏ పనీ చేయకుండా తన తండ్రిని ఇబ్బందులు పెడుతుంటాడు.

అనుకోకుండా ఓసారి సూర్యనారాయణకి బిజినెస్ పరంగా ఓ సమస్య వస్తుంది. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు సంజు విజయవాడను శాసించగల ఆదికేశవులు (ముఖేష్ ఖుషి) సహాయం అడుగుతాడు. అప్పుడు సంజు అతడి కుమార్తె స్వాతి (సురభి)ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే.. సంజు, స్వాతిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో ఆదికేశవులు సంజును చంపేయాలని అతడికోసం గాలింపు చర్యలు మొదలు పెడతాడు.

అదే టైంలో విజయవాడకు కాబోయే ఎమ్మెల్యే అజయ్ (అజయ్) కూడా సంజుని చంపాలని ట్రై చేస్తుంటాడు..? ఇలా చిత్రం మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతుంది. అసలు అజయ్, సంజును ఎందుకు చంపాలనుకుంటాడు..? వీరిద్దరి మధ్య వున్న సంబంధం ఏంటి..? సంజు - స్వాతికి మధ్య ఏం జరిగింది..? వాళ్లు ఎందుకు పారిపోవాలనుకుంటారు..? ఇన్ని సమస్యల మధ్యలో బీరువా ఎందుకు వచ్చింది..? అసలు సంజు బీరువాలో ఎందుకు వున్నాడు..? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే!

cinima-reviews
బీరువా

వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్.. తాజాగా నటించిన ‘బీరువా’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘సంజుగాడి ఫ్రెండ్’ అనే ఉపశీర్షికతో వున్న ఈ మూవీలో సురభి హీరోయిన్’గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించగా.. ఆనంది ఆర్ట్స్, ఉషా కిరణ్ ఫిల్మ్స్ నిర్మించారు. ‘జోరు’ చిత్రంతో పరాజయాన్ని ఎదుర్కొన్న సందీప్.. ఈ చిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఇందులో తారాగణం కూడా బాగానే వుండటంతో దర్శకనిర్మాతలు చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి.. ప్రేక్షకులను ఈ చిత్రం ఏ విధంగా సంతోషపరిచిందో చూద్దాం...

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఇందులో వున్న కామెడీ ఎపిసోడ్స్ మూవీకి బాగా హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా సీనియర్ నరేష్, షకలక శంకర్, సప్తగిరి కామెడీ ట్రాక్స్ సినిమాలో బాగా పేలాయి. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అందరినీ నవ్వించేస్తాయి. ఇక సందీప్ కిషన్ కొత్తదనం ఇందులో ఏమీలేదు. కానీ.. స్టైలిష్ గా డాన్సులు, రిస్కీ స్టంట్స్ బాగా చేసాడు. పరిచయమైన సురభి మంచి పెర్ఫార్మన్స్ కనబరిచింది. కొన్ని సీన్స్, పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించింది. అనీషా సింగ్ చేసింది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో హాట్ హాట్ గా కనిపించి మాస్ ఆడియన్స్ ని మెప్పించింది. ఇక అజయ్, అనిత చౌదరి, చలపతి రావు లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు. చోటా కె నాయుడు విజువల్స్ చాలా బాగున్నాయి.  నిర్మాణంలో ఏ లోటూ లేకుండా నిర్మాతలు బాగానే ఖర్చు వెచ్చించారు.

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం ఏమీ లేదు. ఇక టైటిల్ తగ్గట్టుగా బీరువా సినిమాకి పెద్దగా హెల్ప్ చేయలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేది ప్రేక్షకులు ముందుగానే పసిగట్టేస్తారు. అక్కడక్కడ కాస్త బోరింగ్’గా అనిపిస్తుంది. మూవీ నిడివిని ట్రిమ్ చేసి వుంటే బాగుండేది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ బాగా సాగదీశారు. హీరో – విలన్ కి మధ్య ఒక్క స్ట్రాంగ్ చాలెంజ్ సీన్ కూడా ఉండదు.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ, రెండు నిర్మాణ విలువలు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చోటా కె నాయుడు అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. లో బడ్జెట్ సినిమానే అయినా ఓ భారీ బడ్జెట్ రేంజ్ విజువల్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఎస్ఎస్ తమన్ అందించిన పాటలు ఈ సినిమా కథకి ఓకే అనేలా వున్నాయి. గౌతంరాజు ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకుని వుంటే బాగుండేది. వెలిగొండ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక కన్మణి కథ – కథనం – దర్శకత్వం ఏవీ ఆడియన్స్ ని అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాయి.

చివరగా... ఈ ‘బీరువా’ను అంత దృఢంగా తయారుచేయలేదు.