కేశవపురం గ్రామంలోని ఆకాష్ నారాయణ్(రవితేజ) కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేసినా, ఏ పనీ చేయకుండా తన ప్రెండ్స్ తో కలిసి జులాయిలా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. పెళ్లి చేస్తేనైనా మారుతాడని అనుకొని ఇంట్లో వాళ్లు పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తే.. అక్కడ పెళ్లికూతురు అక్ష తాను చేసుకోబోయేవాడు పెద్ద సెలబ్రెటి అయ్యుండాలి అంటూ ఆకాష్ ను అవమానిస్తుంది. దీంతో ఎలాగైనా ఫేమస్ అయిపోయి, సెలబ్రెటిగా మారాలని అనుకుంటాడు ఆకాష్. అనుకోకుండా అక్కడ లోకల్ పార్టీ మీటింగ్ ను నాశనం చేసి, మీటింగ్‌కు వచ్చిన వ్యవసాయ శాఖామంత్రి(షాయాజీ షిండే)ని కొట్టి వార్తల్లో నిలుస్తాడు. ఆకాష్ ధైర్యం, టాలెంట్ చూసి హోం మినిష్టర్ నాగప్ప(రావు రమేష్) తన కుమార్తె శ్రద్ధ(రాశీఖన్నా)కు బాడీగార్డ్ గా పెడతాడు. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలోపడటం జరుగుతుంది. సీన్ కట్ చేస్తే ఆకాష్ కు శ్రద్ధను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. కానీ ఆకాష్ మాత్రం తాను సిఎం అశోక్ గజపతి(బోమన్ ఇరానీ) కూతురు మీరా(తమన్నా)ను ప్రేమిస్తున్నానని చెప్పి, అందరికి షాక్ ఇస్తాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు పరిచయమేలేని మీరా గురించి ఆకాష్ కు ఎలా తెలుసు? అశోక్ గజపతిని ఆకాష్ ఎందుకు టార్గెట్ చేసాడు? అసలు మీరాను ఎందుకు ప్రేమిస్తాడు? ఇంతకీ ఆకాష్ ఎవరు? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే వెండితెర మీద ‘బెంగాల్ టైగర్’ చూడాల్సిందే.
‘బలుపు’, ‘పవర్’, చిత్రాలతో వరుసగా హిట్స్ ను అందుకున్న మాస్ మహారాజ రవితేజకు ‘కిక్2’ చిత్రం హ్యట్రిక్ ను అందించకలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలనే కసితో ‘బెంగాల్ టైగర్’ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. భీమ్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.
ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తున్నాయి. ‘బెంగాల్ టైగర్’లోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ గా నిలవడం అభినందించదగ్గ విషయం. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. పవర్ ఫుల్ కమర్షియల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో అక్ష, బోమన్ ఇరానీ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.
భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావాల్సింది కానీ, పలు చిత్రాల విడుదలకు సహకరిస్తూ ‘బెంగాల్ టైగర్’ వాయిదా పడుతూ వచ్చింది. తమ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా భారీ హిట్టు కొట్టడం ఖాయమనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ చిత్ర యూనిట్. ‘బెంగాల్ టైగర్’ నేడు(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
రెడ్ బుల్ తాగినవాడిలా ఎప్పుడూ ఎనర్జీతో వుండే మాస్ మహారాజ రవితేజ ‘బెంగాల్ టైగర్’ లో ఉతికి ఆరేసాడు. ఆకాష్ నారాయణ్ పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ తో అదరగొట్టాడు. తన పంచ్ డైలాగ్స్ తో కిక్కేంచాడు. స్ర్కీన్ మీద కాస్త సన్నగా కనిపించినప్పటికీ పర్వాలేదనిపించాడు. ఇక తమన్నా, రాశిఖన్నాలు ఒకరినొకరు పోటీపడి అందాలు ఆరబోసారు. అసలే మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ‘చూపులతో దీపాల...’ పాటలో పిచ్చెక్కించే అందాల ప్రదర్శన చేసింది. తన అందచందాలతో తమన్నా మతిపోగొట్టేసింది. ఇక రాశిఖన్నా కూడా తానేం తక్కువ కాదనే విధంగా భారీగా అందాలు ఆరబోసింది. ఓ సీన్ లో బికినీలో కనిపించి పిచ్చెక్కించేసింది. రవితేజతో ఈ ఇద్దరి భామల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
ఫ్యూచర్ స్టార్ పృద్వీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. రవితేజ తర్వాత అంతటి రేంజులో అలరించిన పాత్ర పృధ్వీదే. పృధ్వీ తనదైన శైలిలో కామెడీతో చంపేసాడు. అలాగే సెలబ్రిటి శాస్త్రిగా పోసాని కృష్ణమురళి తనదైన స్టైల్లో కామెడీని పండించారు. ఇక సిఎం అశోక్ గజపతి పాత్రలో బోమన్ ఇరానీ చక్కగా నటించాడు. ఆ పాత్రకు బోమన్ పూర్తి న్యాయం చేసాడు. నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక రావు రమేష్, సాయాజీ షిండే, నాగినీడు తదితరులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదా సరదాగా కొనసాగుతుంది. ముఖ్యంగా రవితేజ – పృథ్వి – పోసానిల కామెడీ సినిమాలో ఆడియన్స్ నవ్విస్తూ ఫస్ట్ హాఫ్ ని ఎంటర్టైనింగ్ గా సాగేలా చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో పలు సీన్లు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ సెకండ్ హాఫ్. కమర్షియల్ చిత్రాలకు సెకండ్ హాఫ్ చాలా ముఖ్యం. కానీ ఈ సినిమాలో సెకండ్ హాఫ్ ను మాత్రం బాగా సాగదీసేసారు. ఫస్ట్ హాఫ్ ను సూపర్బ్ గా రాసుకొని, సెకండ్ హాఫ్ ను మాత్రం సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. సెకండ్ హాఫ్ మొదలైన 10 నిమిషాలకే సాగదీస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వున్న కామెడీ సెకండ్ హాఫ్ లో లేకపోవడం మైనస్. సెకండ్ హాఫ్ లో కామెడీ పెద్దగా కనిపించదు. దర్శకుడు సంపత్ నంది అనుకున్న కథను సెకండ్ హాఫ్ లో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు. సెకండ్ హాఫ్ లో కాస్త ఎడిట్ చేసి వుంటే, సినిమాకు మరింత జోష్ పెరిగేది.
సాంకేతికవర్గ పనితీరు:
ముందుగా సౌందర్ రాజన్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా వున్నాయి. ముఖ్యంగా యాక్షన్, సాంగ్స్ లో సినిమాటోగ్రఫి సూపర్బ్. ‘చూపులతో దీపాల..’ సాంగ్ విజువల్స్ అదిరిపోయాయి. భీమ్స్ పాటలు సినిమా విడుదలకు ముందే బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. విజువల్స్ పరంగా మరింత బాగున్నాయి. చిన్నా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రీరికార్డింగ్ చాలా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని వుంటే బాగుండేది.
ఇక కథ, కథనం, మాటలు, దర్శకత్వం వంటి డిపార్ట్ మెంట్స్ ను హ్యండిల్ చేసిన సంపత్ నంది దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ కథనం విషయంలో కాస్త మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ ను చాలా పర్ఫెక్ట్ గా రాసుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్ పై మాత్రం అంతగా కేర్ తీసుకోకుండా వదిలేసినట్లుగా అనిపిస్తుంది. సంపత్ నంది రాసిన డైలాగ్స్ బాగున్నాయి. పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. కె.కె.రాధామోహన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు.
చివరగా:
‘బెంగాల్ టైగర్’: కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్.
- Sandy