కిల్లింగ్ వీరప్పన్ పూర్తిగా స్మగ్లర్ వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు. అయితే వర్మ మార్క్ సినిమాటిక్ ట్రీట్‌మెంట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. దశాబ్దాల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు అడవులను ఏలిన వీరప్పన్, ఆ స్థాయికి ఎలా రాగలిగాడు, వీరప్పన్ను పట్టుకోవటానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ముఖ్యంగా వీరప్పన్ను మట్టుపెట్టిన కుకూన్ ఆపరేషన్ ఎలా సాగిందిన్నదే కిల్లింగ్ వీరప్పన్ అసలు కథ.
ఈ సినిమా మొత్తం నిజజీవితంలోని గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత ఆధారంగా రూపొందింది. అయితే వీరప్పన్ జీవితాన్ని వర్మ తనదైన శైలిలో క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందించాడు. కొన్ని దశాబ్దాల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు అడవుల్లో సంచలనం సృష్టించిన వీరప్పన్... ఆ స్థాయికి ఎలా రాగలిగాడు? వీరప్పన్ ను పట్టుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ముఖ్యంగా వీరప్పన్ను మట్టుపెట్టిన కుకూన్ ఆపరేషన్ ఎలా జరిగింది? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే వెండితెర మీద ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా చూడాల్సిందే.
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. శ్రీకృష్ణ క్రియేషన్స్ సమర్పణలో జి ఆర్ పిక్చర్స్ మరియు జెడ్ త్రీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై బీవీ మంజునాథ్, ఇ.శివప్రకాష్, బి ఎస్ సుధీంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ జనవరి 1న కన్నడలో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. శివ రాజ్ కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్క్షాశెట్టి, పరూల్ యాదవ్ , రాక్ లైన్ వెంకటేష్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. తెలుగు వర్షెన్ ను ఈనెల 7వ తేదిన విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.
ప్లస్ పాయింట్స్:
‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో మేజర్ హైలెట్స్ సందీప్ భరద్వాజ్, శివరాజ్ కుమార్. మొదట్లో వీరప్పన్ పాత్రకు సంబంధించిన సందీప్ భరద్వాజ్ లుక్స్ ను విడుదల చేసినప్పుడే సగం హిట్టుకొట్టినట్లుగా అనిపించింది. వీరప్పన్ పాత్రలో సందీప్ భరద్వాజ్ అదరగొట్టేసాడు. కన్నింగ్, ఎమోషనల్, థ్రిల్లింగ్ హవాభావాలతో చాలా చక్కగా నటించాడు. వీరప్పన్ పాత్రకు సందీప్ భరద్వాజ్ పూర్తి న్యాయం చేసాడు. తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక వీరప్పన్ ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ‘కుకూన్’ ఆపరేషన్ హెడ్ గా శివరాజ్ కుమార్ యాక్టింగ్ సూపర్బ్. క్రిమినల్ మైండ్ పోలీస్ ఆఫీసర్ గా తన నటనతో శివరాజ్ కుమార్ చాలా చక్కగా నటించాడు. మొత్తానికి వీరిద్దరే సినిమాను అదరగొట్టేసారు. ఇక వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీ పాత్రలో యాగ్నాశెట్టి తన పాత్ర మేరకు నటించింది. ఇక పరూల్ యాదవ్ తో పాటు మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా నిజజీవితం ఆధారంగా రూపొందించబడింది కాబట్టి అంతగా మైనస్ పాయింట్స్ ఏం లేవు. కాకపోతే కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చదు. కామెడీ, డాన్సులు, ఫైట్లు, పంచ్ డైలాగ్స్ వంటి ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ‘కిల్లింగ్ వీరప్పన్’ బోర్ ను కలిగిస్తుంది.
సాంకేతికవర్గం పనితీరు:
చాలా కాలం తర్వాత రాంగోపాల్ వర్మ ఓ హిట్టు కొట్టాడని చెప్పుకోవచ్చు. వీరప్పన్ జీవిత కథాంశాన్ని వర్మ చాలా చక్కగా ప్రజెంట్ చేయగలిగాడు. ముఖ్యంగా వీరప్పన్ పాత్ర కోసం సందీప్ భరద్వాజ్ ను సెలెక్ట్ చేయడంతోనే సగం హిట్టుకొట్టాడని చెప్పుకోవచ్చు. అచ్చం వీరప్పన్ వలే చాలా చక్కగా కుదిరాడు. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు వర్మ. సినిమాటోగ్రఫి బాగుంది. అడవుల్లోని అందాలను, ఎమోషన్లను బాగా చూపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. ముఖ్యంగా సందీప్ భరద్వాజ్ ను వీరప్పన్ గా చూపించిన మేకప్ మెన్ పనితీనం చాలా బాగుంది. నిజమైన వీరప్పన్ తో సినిమా చేసారా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా వున్నాయి.
చివరగా:
‘కిల్లింగ్ వీరప్పన్’: వర్మ మార్క్ వీరప్పన్