గుంటూరులోని ఓ మెడికల్ షాప్ లో పనిచేసే మధ్యతరగతి మనుషులు గిరి(నరేష్), హరి(సిద్ధు). చాలీచాలని జీతాల వల్ల.. తమ అవసరాలను తీర్చుకునేందుకు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఒకానొక దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకుని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దొంగతనం చేస్తారు. ఆ డబ్బుతో సంతోషంగా, ఎంజాయ్ చేస్తూ బ్రతికేయాలనుకున్న వీరి జీవితాల్లో అనుకొని కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. జాకీ(మహేష్ మంజ్రేకర్), రివాల్వర్ రాణి(శ్రద్ధా దాస్) అనే ఇద్దరు డాన్ లతో పాటు పోలీసులు కూడా వీరి వెంట పడుతుంటారు. అసలు గిరి, హరిలకు వీరందరికి వున్న సంబంధం ఏమిటి? వాళ్లెందుకు వీరిద్దరి వెంట పడుతున్నారు? రివాల్వర్ రాణి ఎవరు? హరి ప్రేమించిన సువర్ణ(రష్మీ) ఎవరు? చివరకు ఈ కథ ఎక్కడికి చేరుకుంది? హరి, గిరిల పరిస్థితి ఏంటి అనేది మిగతా కథ.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘గుంటూర్ టాకీస్’. ఈ చిత్రంలో సిద్ధు జొన్నగడ్డ, నరేష్ విజయ్‌కృష్ణ, రేష్మీ గౌతమ్, శ్రద్ధాదాస్, లక్ష్మీ మంచు, మహేష్ మంజ్రేకర్ ప్రధాన తారాగణంగా నటించారు. ఆర్.కె.స్టూడియోస్ బ్యానర్‌పై రాజ్‌కుమార్.ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ చరణ్ పాకల సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రెష్మీ అందాల ఆరబోత హాట్ టాపిక్ గా మారింది. ‘గుంటూరు టాకీస్’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నేడు(మార్చి 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
* సిద్ధు, నరేష్ ల కామెడీ టైమింగ్, యాక్టింగ్
* రష్మీ, శ్రద్ధాదాస్ ల గ్లామర్
* మహేష్ మంజ్రేకర్ యాక్టింగ్
* కామెడీ, పాటలు
మైనస్ పాయింట్స్:
* కథ, కథనం
* అనవసరమైన పాత్రలు
* బూతు డైలాగులు
* సాగదీసే సన్నివేశాలు
* స్లోగా సాగే కథనం
సాంకేతికవర్గం పనితీరు:
శ్రీచరణ్ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఎడిటర్ ధర్మేంద్ర ఎడిటింగ్ వర్క్ బాగోలేదు. ఆర్ట్ వర్క్ బాగుంది. డైలాగ్స్ జస్ట్ ఓకే. ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కథలో ఎలాంటి దమ్ము లేకపోగా.. కథనం విషయంలో కూడా ఎలాంటి కొత్తదనం లేదు. కొన్ని కొన్ని పాత్రల విషయంలో క్లారిటీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
గుంటూరు టాకీస్: మాస్ అడల్ట్ బోరింగ్ చిత్రం.