సిటీలో సాఫ్ట్‌గా మర్డర్స్ చేస్తూ చాలా ఈజీగా తప్పించుకు తిరిగే కిల్లర్ విజయ్ మాణిక్(తారక్‌రత్న)..అదే సిటీలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి సినిమాలపై ఇంట్రస్ట్ చూపించే రాజా రామ్(నారా రోహిత్)కు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే చైత్ర(ఇషా తల్వార్)తో పరిచయం ఏర్పడుతుంది..ఓ రోజు కాఫీ షాప్‌లో మీట్ అయిన వీరిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో చైత్రకు రాజారామ్ ఓ కథ వినిపిస్తాడు..ఈ కథ కాఫీ ఫాప్‌లో ఉన్న వారంతా విని చాలా బాగుందంటారు..మరుసటిరోజు ఉదయం రాజారామ్‌కి ఓ లెటర్, కొంత డబ్బు ఉన్న పార్సిల్ వస్తుంది..మీ స్టోరీ నిన్న నేను విన్నాను.. నాకు ఓ లవ్ స్టోరీ రాయండి.ఇది మీ అడ్వాన్స్ అని ఆ లెటర్‌లో ఉంటుంది..చెప్పిన విధంగానే స్టోరీ రాసి పంపుతాడు రాజారామ్..మళ్ళీ ఓ పార్సిల్ వస్తుంది..ఈ సారి క్రైమ్ కథ కావాలని ఆ లెటర్‌లో రాసుంటుంది..రాజారామ్ రాసి పంపుతాడు..లాస్ట్ అండ్ ఫైనల్‌గా మరో పార్సిల్ వస్తుంది..ఈ సారి అందులో ఓ గన్ ఉంటుంది.నువ్వు కథలో రాసిన విధంగా మాణిక్‌ను చంపాలి..లేదంటే చైత్రని చంపేస్తానని బెదిరిస్తాడు. ఓసారి హత్యాయత్నం కూడా చేస్తాడు. అసలు ఈ అపరిచిత వ్యక్తి ఎవరు.. అతనికి మాణిక్‌కి సంబందం ఏంటి..అతను రాజారామ్‌ని ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడు.. అసలు మాణిక్‌ని ఆ వ్యక్తి ఎందుకు చంపాలనుకుంటున్నాడు..చివరికి రాజారామ్ ఏంచేస్తాడు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో నారా రోహిత్. తాజాగా నటించిన సినిమా రాజా చెయ్యి వేస్తే.ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నారా రోహిత్ సరసన ఇషా తల్వార్ హీరోయిన్ గా నటించింది. ఇందులో నందమూరి తారకరత్న నెగెటివ్ పాత్రలో నటించడంతో కాస్త హైప్ క్రియేట్ అయింది. కాగా నేడు విడుదలైన ఈ సినిమా హిట్టా లేదంటే ప్లాఫా తెలియాంటే రివ్యూ చదవండి.
విశ్లేషణ:
ముందుగా నటీనటుల విషయానికొస్తే హీరో నారా రోహిత్ నటన వరకు ఏదోలే అనిపించుకున్నాడు. రోహిత్ పర్స్‌నాలిటీ బాగా ఎక్కువగా ఉంది.. నారా రోహిత్ పాటలకు డ్యాన్సులు వేస్తుంటే జనాలు బ్రేక్ కు వెళ్లారు. ఇక హీరో పరిస్థితి ఇలా ఉంటే హీరోయిన్ పాటల వరకు ఓకే అనిపించినా యాక్టింగ్ పరంగా మాత్రం అస్సలు పర్ఫామెన్స్ లేదు. కొన్నిఎమోషనల్ సీన్స్‌లో అర్దం కాని ఎక్స్‌ప్రెషన్‌తో ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేసేసింది.నందమూరి తారకరత్న ఎంట్రీ సినిమాకి హైలెట్.. డ్రెస్సింగ్, స్టైల్ అంతా చాలా బాగున్నాయ్ కానీ ఈ రేంజ్ పర్ఫామెన్స్‌కి తగ్గ విలన్ పాత్రకాకపోవటం విశేషం. దర్శకుడు ప్రదీప్ కొత్త కథనే ఎంచుకున్నాడు కానీ కథనం సరిగా నడపలేకపోయాడు.. ఫస్ట్‌హాఫ్ మొత్తం లవ్ పేరుతో సాగతీయటం విసుగుపుట్టించినా అక్కడక్కడా అంటే ఎడారిలో వర్షంలాగా కామెడీ సీన్లు ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు.. ఎడిటింగ్ అంతగొప్పగా ఏమీలేదు.. సంగీతం విషయానికొస్తే ఎక్కడో విన్నాం అనిపించేలా కొన్ని సాంగ్స్.. స్మశానంలో ఫైట్‌కి ఇచ్చిన ఆర్ ఆర్ బాగుంది..
ఫస్టాఫ్.. స్టోరీ బాగానే ఉన్నా సాగదీసింది
బ్రేక్ టైంలో.. రెండు కాఫీలు తాగితే గానీ కూర్చోవాలనిపించదు
సెకండాఫ్.. నారా రోహిత్ పర్సనాలిటీతో చంపేస్తే.. దర్శకుడు కథను నడిపించడంలో చుక్కలు చూపించాడు
ప్లస్ పాయింట్లు :
తారకరత్న, కథ, సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్లు:
రోహిత్, హీరోయిన్సి ఇషా తల్వార్, సినిమా తీసిన విధానం, సాంగ్స్, క్లైమాక్స్
చివరగా.. ఈ రాజా చెయ్యి వేస్తే ‘మటాష్’