ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన తాజా చిత్రం ‘అజార్’. ఈ సినిమా అజారుద్దీన్ 99వ టెస్ట్ మ్యాచ్ గెలవడంతో ప్రారంభం అవుతుంది. అదే స్టింగ్ ఆపరేషన్ జరిపి 100వ టెస్ట్ మ్యాచ్ ఆడనివ్వకుండా ఆపేస్తారు. ఆ తర్వాత అజార్ తన పెళ్లి, సంసారంలో వచ్చిన మార్పులు, లవ్ స్టోరీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది కథాంశం. అజారుద్దీన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో చూడాలంటే ‘అజార్’ సినిమా చూడాల్సిందే.
ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన తాజా చిత్రం ‘అజార్’. ఇందులో అజారుద్దీన్ పాత్రలో బాలీవుడ్ కిస్సింగ్ హీరో ఇమ్రాన్ హష్మీ నటించాడు. నర్గీస్ ఫక్రీ, ప్రాచీ దేశాయ్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. నిజజీవితంలో అజారుద్దీన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే వ్యక్తిగత జీవితాన్ని వెండితెరపై ‘అజార్’ పేరుతో చూపించబోతున్నారు. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
ఇమ్రాన్ హష్మీ నటన
ప్రాచీ దేశాయ్
నౌరీన్, నర్గీస్ ఫక్రీ గ్లామర్
కుల్భుషన్ ఖర్బందా, గౌతమ్ గులాటీ మరియు లారా దత్తా నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
స్ర్కీన్ ప్లే హైలెట్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
స్లో నెరేషన్
కామెడీ లేకపోవడం
కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ సీన్లు తక్కువ
ఘాటు లిప్ లాక్ మస్తు ఎంజాయ్ చేసాడట
సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు టోనీ డిసౌజా అద్భుతంగా ‘అజార్’ చిత్రాన్ని రూపొందించాడు. ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా చక్కగా చూపించాడు. ముఖ్యంగా స్ర్కీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. అజారుద్దీన్ నిజజీవితంలోని రహస్యలను, ఒడిదుడుకులను చాలా చక్కగా ప్రజెంట్ చేసారు. డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ బాగా సెట్ అయ్యింది. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
‘అజార్’: ఇమ్రాన్ హష్మీ స్టైల్లో అజార్ అదుర్స్