మెహక్(రాధిక ఆప్టే) ఓ ఆర్టిస్ట్. అనుకోని ఓ సంఘటన వలన తనకు ఒంటరితనం భయంగా మారుతుంది. తన భయాన్ని అర్థం చేసుకున్న షాన్(సత్యదీప్ మిశ్రా).. మెహక్ బాధ్యతలను తీసుకొని, ఓ ఫ్లాట్ లో నివాసం వుంచుతాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఆ ఫ్లాట్ లో ఏం జరిగింది? అసలు మెహక్ భయపడటానికి గల కారణం ఏంటి? మెహక్ ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథాంశం.
నందమూరి బాలకృష్ణతో ‘లెజెండ్’ ‘లయన్’ సినిమాలలో జతకట్టిన రాధిక ఆప్టే తాజాగా హిందీలో నటించిన చిత్రం ‘ఫోబియా’. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలను మరింతలా పెంచేసింది. ఇందులో మెహతక్ అనే ఒక ఆర్టిస్ట్ పాత్రను రాధిక పోషిస్తోంది. ఒక యాక్సిడెంట్ కు గురైన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. థ్రిల్లర్ తరహాలో ఈ సినిమా రూపొందింది. ఈ పాత్రలో నటించేముందు కొంతమంది సైకియాట్రిస్ట్ లను సంప్రదించడమే కాకుండా, అలాగే తన పాత్ర ప్రవర్తించే తీరును గమనించడం కోసం కొంతమంది రోగుల బిహేవియర్ ను రాధిక పరిశీలించిందట. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
రాధిక ఆప్టే నటన
సత్యదీప్ మిశ్రా నటన
సెకండ్ హాఫ్
కథ, స్ర్కీన్ ప్లే
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు.
ట్విస్టులు లేవు.
చివరగా:
‘ఫోబియా’: భయపెట్టే ఓ థ్రిల్లర్.