పంజాబ్ లో డ్రగ్స్ వ్యవహారంపై ఈ సినిమా నడుస్తోంది. టామీ సింగ్(షాహిద్ కపూర్) ఒక రాక్ స్టార్. డ్రగ్స్ కు బానిసగా మారి తన సింగింగ్ టాలెంట్ ను మిస్ అవుతాడు. సర్జాత్ సింగ్ (దిల్జిత్ దొసంజ్) ఒక పోలీస్ కాప్. ప్రీతి సహ్నీ(కరీనా కపూర్) ఒక డాక్టర్ మరియు పింకీ(ఆలీయా భట్) ఒక కూలీ. సర్జాత్ తమ్ముడు డ్రగ్స్ కు బానిసగా మారిన తర్వాత డ్రగ్స్ మాఫియా గురించి చాలా విషయాలను బయటపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కథలో ఈ నలుగురికి ఏం సంబంధం? చివరకు ఏం జరిగింది అనేది వెండితెర మీద చూడాల్సిందే.
బాలీవుడ్ లో గతకొద్దిరోజులుగా రచ్చ రచ్చ చేస్తున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని నేడు(జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. షాహిద్ కపూర్, కరీనా కపూర్, ఆలీయా భట్, దిల్జిత్ దొసంగ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా సెన్సార్ సమస్యలు దాటి, చివరకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాపై అంతగా రచ్చ జరగడానికి గల కారణాలు, అసలు ఈ సినిమాలో ఏం విషయం వుందో ఒకసారి చూద్దామా!
ప్లస్ పాయింట్స్:
షాహిద్ కపూర్
కరీనా కపూర్
దిల్జిత్ దొసంజ్
ఫస్ట్ హాఫ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
స్టోరీ, స్క్రీన్ ప్లే
సెకండ్ హాఫ్
చివరగా:
‘ఉడ్తా పంజాబ్’: బోరింగ్ సినిమా