ప్రేమమ్ రివ్యూ | premam telugu movie review

Teluguwishesh ప్రేమమ్ ప్రేమమ్ Naga Chaitanya's premam movie review. Product #: 78204 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ప్రేమమ్

  • బ్యానర్  :

    సితార ఎంటర్ టైన్ మెంట్స్

  • దర్శకుడు  :

    చందూ మొండేటి

  • నిర్మాత  :

    సూర్య దేవర నాగ వంశీ

  • సంగీతం  :

    గోపీ సుందర్, రాజేష్ మురుగేశన్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    కార్తీక్ ఘట్టమనేని

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వర రావు

  • నటినటులు  :

    నాగ చైతన్య, శృతీహాసన్, మడోన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ తదితరులు

Premam Telugu Movie Review

విడుదల తేది :

2016-10-07

Cinema Story

పదోతరగతి చదువుతున్న సమయంలోనే ఊరికే అందగత్తె అయిన సుమ(అనుపమ) వెంట పడతాడు విక్రమ్(చైతూ). ఆమెను ముగ్గులో దించడానికి పడరాని పాట్లు పడి చివరకు ఎలాగోలా కవిత్వాలతో ఆమె మురిపించి పడగొడతాడు. అయితే పాపం విధి వక్రీకరించడంతో ఆ ప్రేమకథ అక్కడితోనే ముగుస్తుంది. ఇక కట్ చేస్తే ఐదేళ్లకు కాలేజీలో గ్యాంగ్ మెయింటెన్ చేస్తూ చిల్లరగా తిరుగుతుంటాడు. ఆ హీరోయిజంతోనే లెక్చరర్ సితార వెంకటేష్ (శృతిహాసన్) ను ప్రేమలో పడేస్తాడు. అయితే ఫేట్ మరోసారి వెక్కిరించడంతో అది కూడా ఫెయిలవుతుంది.

 

ఇక ఈ ప్రేమ గీమా పక్కనబెట్టి కష్టపడి కొన్నేళ్ల తర్వాత ఓ రెస్టారెంట్ పెట్టి హ్యాపీ లైఫ్ గడుపుతుంటాడు. ఇంతలో సింధు (మడోనా సెబాస్టియన్) అతని జీవితంలోకి వస్తుంది. మరి ఈసారైనా అతని లవ్ సక్సెస్ అవుతుందా? లేక అది కూడా విషాదం అయి లైఫ్ లో ఒంటరిగానే మిగిలిపోతాడా? ఈ త్రీ స్టేజెస్ ఆఫ్ లవ్ కథే ప్రేమమ్.

cinima-reviews
ప్రేమమ్

అక్కినేని వారుసుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లపైగానే అవుతున్నా ఇంతవరకు భారీ హిట్ అందుకోలేకపోయాడు నాగ చైతన్య. దీంతోపాటు గత కొంత కాలంగా వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్నాడు. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రీమేక్ సేఫ్ ఫార్ములాను నమ్ముకున్నాడు. మళయాళంలోనే కాదు, యావత్ సౌత్ లోనూ సంచలనాలు సృష్టించిన ప్రేమమ్ సినిమాను రీమేక్ చేసి మన ముందుకు తెచ్చాడు. మరి ఆ మంత్రం ఫలించిందా? చైతూకి బ్లాక్ బస్టర్ కొట్టాడా? ఛలో రివ్యూ....

విశ్లేషణ:

ప్రేమ కథలకు ముగింపు పుట్టింది కానీ, ఆ ఫీలింగ్ కు కాదు. ఇది సినిమా టాగ్ లైన్. నా ఆటోగ్రాఫ్ తరహాలో సాగే కథ. మూడు దశల ప్రేమ కథలు, అల్రెడీ చూసినట్లే ఉంటాయి. అలాగని గొప్పవేం కూడా కాదు. కానీ, అందులోని ఫీల్ మాత్రం అద్భుతమైన అనుభవాన్ని పంచుతుంది. ఓ హిట్ మూవీని ఆ ఫీల్ చెడగొట్టకుండా తెరకెక్కించడమంటే మాములు విషయం కాదు. ఈ విషయంలో చందూ మొండేటిని అభినందించకుండా ఉండలేం.

కథను ఏ మార్చలేదు కానీ, తెలుగు నేటివిటికి తగ్గట్లుగా రూపొందించాడు. గ్రామీణ వాతావరణం దగ్గరి నుంచి మొదలుపెట్టి సిటీ కల్చర్ దాకా, దానికి తగ్గట్లుగా విజువల్స్ సూపర్బ్ గా కుదిరాయి. లవ్ లో పడటం, విఫలమవటం, చివర్లో మెచ్యూర్డ్ లెవల్లో ఓ తోడు దొరకటం అంతా ఎమోషనల్ తో క్యారీ చేశాడు. అయితే సెకండాఫ్ లోనే లెంగ్త్ చాలా ఎక్కువ అయినట్లు అనిపించకమానదు. ఆ ఒక్క మైనస్ ను పక్కన బెడితే ప్రేమమ్ మంచి ఫీల్ ను ఇస్తుంది.

ఇక కాస్టింగ్ వియానికొస్తే... ఇప్పటిదాకా చైతూ చేసిన సినిమాలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. మొదటి నుంచి డైలాగ్ డెలివరీ సమస్యను ఈ సినిమాతో పూడ్చుకున్నాడు. మూడు దశల్లో గెటప్ లు, ఫ్రెండ్ గా, ప్రేమికుడిగా నటన అన్నింటిలో ఈజ్ ను ప్రదర్శించాడు. హీరోయిన్లు ముగ్గురు బాగా సెట్ అయ్యారు. ఎటోచ్చి శృతీ పాత్రే కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది. గెస్ట్ రోల్స్ చేసిన నాగ్, వెంకీ పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారు కనిపించినప్పుడు తెరపై ఆ సందడే వేరు. మిగతా పాత్రల్లో పరిధి మేర నటించారు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... సినిమాకు అన్ని అస్సెట్స్ ఫర్ ఫెక్ట్ గా ఉన్నాయి. సంగీతం, ఆర్ట్, ఎడిటింగ్ అన్ని విషయాలు ఫ్లస్ అయ్యాయి. గోపీ సుందర్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా అయ్యాక కూడా వెంటాడుతుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బ్యూటీ ఫుల్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
నాగ చైతన్య
కథ, కథనం
సంగీతం


మైనస్ పాయింట్లు:
లెంగ్తీ సెకండాఫ్

తీర్పు:
ఎక్కడా వల్లారిటీ లేకుండా అందమైన ప్రేమకథలను ఎంజాయ్ చేద్దామనుకునే వారికి ప్రేమమ్ నిజంగా పండగ లాంటిదే. అదే సమయంలో ఒరిజినల్ వర్షన్ చూసిన వారికి ఇది అంతా కిక్కు ఇవ్వకపోవచ్చు.

చివరగా... ప్రేమమ్ పరిపూర్ణమైన ప్రేమ కథల కోసం...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.